• Follow NativePlanet
Share
» »ఇక్కడ అందాలు కనిపిస్తున్నా అందుకోలేరు

ఇక్కడ అందాలు కనిపిస్తున్నా అందుకోలేరు

Written By: Kishore

భారత దేశపు పార్టీ హబ్ రాజధానిగా గోవాను పిలుస్తారు. ఒక వైపు సంతపు హోరు, మరోవైపు సముద్ర అలల హోరు. ఈ రెంటింటి నడుమ తాము మరిచిపోయి సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ విషయంలో మిగిలిన వారితో పోలిస్తే యువతీ యువకులు ముందుంటారు. ఈ విషయంలో యువతకు అన్ని విషయాలా సహకరించడానికి గోవాలో కొన్ని పబ్ లు, బార్ లు ఎల్లప్పుడూ ముందుంటాయి. ముఖ్యంగా 9 బార్, జింజిబార్, హిల్ టాప్ వంటి బార్లు యువతను రారమ్మని పిలుస్తుంటాయి. అటువంటి బార్ల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. ఇక  అక్కడ మ్యూజిక్ కు అనుగుణంగా మనం డ్యాన్స్ చేయడమే కాకుండా పోల్ బార్ పట్టుకొని అందమైన అమ్మాయిలు కూడా తమ నాట్య, నటన ప్రావీణ్యాన్ని చూపిస్తుంటారు. ఈ సమయం వారిని చూడగలమే కాని ఆ అందాలను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తే అక్కడ ఉన్న బౌన్సర్లు మీ 'పెళ్లి’ చేస్తారు. కాబట్టి జాగ్రత్త. 

ఆ నిధి రహస్యాలు తెలిస్తే విజయ్ మాల్యా కాలెండర్ గర్ల్స్ అంతా నీ చుట్టూనే

1. 9 బార్

1. 9 బార్

Image Source:

గోవాలో నైట్ లైఫ్ ను బాగా ఇష్టపడే వారికి మొదట గుర్తుకు వచ్చేది 9 బార్. అంతర్జాతీయ స్థాయి డ్రమ్మర్స్ ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తారు. 9 బార్ లో అవుట్ డోర్, ఇండోర్ డ్యాన్సింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కేవలం కేవలం సంగీతమే కాకుండా దేశ విదేశాలకు చెందిన మద్యం బ్రాండ్ లు 24 గంటల పాటు దొరుకుతాయి.

2. జంజిబార్

2. జంజిబార్

Image Source:

గోవాలోని సాగర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ బార్ ఉదయం పూట చూడటానికి చాలా నిశ్శబ్దంగా కనిపిస్తుంది. సాయంత్రం అయ్యే సమయానికి తన రూపు రేఖలను పూర్తిగా మర్చుకుంటుంది. సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చిన పార్టీ బర్డ్స్ మరో వైపు కన్నెత్తి కూడా చూడరు అంటే అతిశయోక్తి కాదేమో. మ్యూజిక్ తో పాటు సముద్ర అలలు, ఇసుక తిన్నెలు మన మనస్సుకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తాయి.

3. కెఫె మోజో పబ్ అండ్ బిస్ట్రో

3. కెఫె మోజో పబ్ అండ్ బిస్ట్రో

Image Source:

గోవాలో ఈ బీర్ అన్న విధానాన్ని మొదట పరిచయం చేసింది క్లబ్బే. పార్టీ అంటే ఎలా ఉంటుందో ఈ క్లబ్ మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ ప్రతి టేబుల్ పై బియర్ ట్యాప్ తో పాటు ఎల్సీడీ తెర కలిగి ఉంటుంది. మనకు కావలసిన బ్రాండ్ బీర్ ను ఇంటర్ నెట్ ద్వారా మనం ఆర్డర్ ఇవ్వొచ్చు. ఈ పబ్ రోజుకు 24 గంటల పాటు తెరిచే ఉంటుది.

4. హిల్ టాప్

4. హిల్ టాప్

Image Source:

మ్యూజిక్, డ్యాన్స్ ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడికి అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన డీ.జేలు వస్తుంటారు. ఇక్కడ వెలువడే మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేయడానికే కొంతమంది యువతీ యువకులు వీకెండ్ రోజుల్లో ఎక్కవ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. అయితే రాత్రి 10 గంటల వరకూ మాత్రమే ఇక్కడ హిల్ పాట్ పనిచేస్తుంది. గోవాలో ఉన్న నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత గట్టిగా ఉండే ధ్వనులతో మ్యూజిక్ ప్లే చేయకూడదు. అందువల్లే ఈ హిల్ టాప్ ను రాత్రి 10 గంటల తర్వాత మూసివేస్తారు.

5. కెఫే మాంబో

5. కెఫే మాంబో

Image Source:

సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కఫే మాంబో కు ఎక్కువ సంఖ్యలో విదేశీయులు వస్తుంటారు. ఈ క్లబ్ అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ కెఫే లో గోవా సంప్రదాయక ఆహార పదార్థాలు కూడా లభిస్తుంటాయి. గోవాలోని బెస్ట్ క్లబ్ లలో కెఫే మాంబో కూడా ఒకటి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి