Search
  • Follow NativePlanet
Share
» »లాహిరి...లాహిరికి అనువైన ప్రాంతాలు

లాహిరి...లాహిరికి అనువైన ప్రాంతాలు

నౌకావిహారానికి అనువైన ప్రాంతాలగురించి కథనం

అటు ఉత్తర భారత దేశాన్ని ఇటు దక్షిణ ప్రాంతంలో కేరళతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో ఆ జలాల్లో ప్రయాణం చేయడం అంత క్షేమం కాదు. అయితే ఆ వరదలు తగ్గిన తర్వాత కొత్తగా వచ్చి చేరిన నీటితో ఆ నదులు, కాలువలు కొత్త రూపును సంతరించుకొంటాయి. సరికొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. అటువంటి అందాలొలికే నదుల్లో పడవ ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత దేశంలో పడవ ప్రయాణానికి అనుకూలమైన పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

వారణాసి నుంచి కలకత్తా

వారణాసి నుంచి కలకత్తా

P.C: You Tube

భారతదేశంలో గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నది అనేక రాష్ట్రాలు, పట్టణాల గుండా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గంగానదిలో కలకత్తా నుంచి వారణాసికి నౌకా ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. మొత్తం 10 నుంచి 12 రోజుల పాటు సాగే ఈ నౌకాయానం మధ్యలో అనేక ధార్మిక, పర్యాటక కేంద్రాలను కూడా సందర్శించుకోవచ్చు.

బ్రహ్మపుత్ర నదిలో

బ్రహ్మపుత్ర నదిలో

P.C: You Tube

భారతదేశంలో మరో అతి ముఖ్యమైన నది బ్రహ్మపుత్ర. దీనిని కూడా పవిత్రమైన నదీజలాల్లో ఒకటిగా భావిస్తారు. మొత్తం 10 రోజుల పాటు ఈ నదిలో ప్రయాణించడానికి వీలుగా అనేక ప్యాకేజీలతో కూడిన నౌకాయానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నదులో ప్రయాణం చేసే సందర్భంలో మజులీ ఐల్యాండ్ అందాలు, ఖడ్గమ`గాలకు పేరుగాంచిన ఖాజీరంగా నేషనల్ పార్క్ ను కూడా చూడవచ్చు.

సుందర్ బన్స్

సుందర్ బన్స్

P.C: You Tube

ప్రపంచంలో అత్యంత పొడవైన మడ అడువల గుండా వెళ్లే నది జలాలలతో పాటు ప్రయాణం చేయాలనుకొంటే సుందర్ బన్స్ ను ఎన్నుకోవచ్చు. ఇక్కడ అత్యంత అరుదైన రాయల్ బెంగాల్ టైగర్స్ ను కూడా మనం చూడవచ్చు. ఈ ప్రయాణంలో ప్రక`తి అందాలతో పాటు అందమైన పల్లెవాతావరణం, రుచులను కూడా ఆస్వాధించవచ్చు.

చిల్కా సరస్సు

చిల్కా సరస్సు

P.C: You Tube

చిల్కా సరస్సు ఉప్పునీటి సరస్సు. భారత దేశంలో అతి పెద్ద, ప్రపంచంలో రెండో కోస్తా తీర ప్రాంత సరస్సు. వలస వచ్చే వేలాది పక్షిజాతుల అందాలను చూడటానికి ఈ చిల్కా సరస్సు లో పడవ ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా బర్డ్ వాచర్స్ కు ఈ చిల్కా సరస్సు స్వర్గధామం.

అలప్పూజ

అలప్పూజ

P.C: You Tube

కేరళలోని వేంబనాడ్ లేక్ లో గూడ పడవల్లో ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హనీమూన్ జంటలకు ఈ అలప్పూజ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ బడ్జెట్ పడవుల నుంచి లక్సురీయస్ పడవల వరకూ ప్రతి వర్గానికి అనువైన గూడు పడవలు దొరుకుతాయి. పడవల్లో ప్రయాణిస్తూ కేరళ రుచులను ఆస్వాధించాలనుకొనేవారికి అలప్పూజ లో గూడు పడవల ప్రయాణం మించినది మరొకటి లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X