Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మకు, అక్బర్ కు, అలహాబాద్ కు సంబంధం మీకు తెలుసా?

బ్రహ్మకు, అక్బర్ కు, అలహాబాద్ కు సంబంధం మీకు తెలుసా?

అలహాబాద్ లో చూడదగిన పర్యాటక ప్రాంతాల గురించి కథనం.

బ్రహ్మ ప్రపంచాన్ని ఏర్పరిచిన తర్వాత మొట్టమొదట యాగాన్ని ప్రయాగాలో చేశాడని చెబుతారు. సంస్కృతములో యాగాలకు యోగ్యమైన భూమి అని అర్థం. ఈ ప్రయాగనే ప్రస్తుతం అలహాబాద్ గా పిలువబడుతోంది. ఇది ఉత్తర భారత దేశంలో ఉంది. ప్రయాగ పేరును మొఘల్ చక్రవర్తి అక్బర్ క్రీస్తుశకం 1513లో అలహాబాద్ గా మార్చాడు. పర్షియన్ భాషలో దీని అర్థం దేవుడు నివసించే నగరం అని అర్థం. ఇలా భాష ఏదైనా ఈ నగరం అత్యంత పవిత్రమైనదని అర్థమవుతోంది. ఈ నగరంలో చూడదగిన అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటితో పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ అలహాబ్ గురించి క్లుప్తంగా మీ కోసం...

అలహాబాద్.

అలహాబాద్.

P.C: You Tube

యయాతి మహారాజు ప్రయాగ నుంచి బయలుదేరి సప్తసింధు మైదానాన్ని జయించినట్లు చెబుతారు. రామాయణ కావ్యవాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణుడు, భార్య సీతాతో చిత్రకూటంలో పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలోని భరద్వాజ ఆశ్రమంలో కొంత కాలం నివశించినట్లు తెలుస్తోంది.

అలహాబాద్.

అలహాబాద్.

P.C: You Tube

ప్రయాగ అంటే నదీ సంగమం అని కూడా అర్థం ఉంది. వాస్తవంగా ప్రయాగను త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. గంగా, యమునా సరస్వతీ నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యమని చెబుతారు.

అలహాబాద్.

అలహాబాద్.

P.C: You Tube

అందుకే అలహాబాద్ వచ్చిన వారు తప్పక ఇక్కడ స్నానం చేస్తుంటారు. ప్రయాగలో పలు ధార్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా పడవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పెద్దలకు శ్రద్ధ కర్మలను కూడా నిర్వహిస్తారు.

కౌసర్ బాగ్

కౌసర్ బాగ్

P.C: You Tube

అలహాబాద్ లో చూడదగిన పర్యాటక ప్రాంతాల్లో కౌసర్ బాగ్ ప్రముఖ మైనది. నాలుగు సమాధుల కలయిక ప్రాంతమే ఈ కౌసర్ బాగ్. ఈ నాలుగు సమాధులు మెఘల్ చక్రవర్తి షాజహాన్ కుటుంబ సభ్యులవి. 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కౌసర్ బాగ్ పర్షియన్, భారతీయ వాస్తుశైలికి ప్రత్యక్ష నిదర్శనం. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకూ సందర్శించుకోవడానికి వీలవుతుంది.

ఆనంద్ భవన్

ఆనంద్ భవన్

P.C: You Tube

అలహాబాద్ నగర మధ్యన భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ కుటుంబానికి చెందిన ఇంటిని స్మారకంగా మార్చారు. రెండంతస్తుల ఈ భవనంలో మహాత్మాగాంధి కొద్ది కాలం పాటు గడిపిన గదిని కూడా చూడవచ్చు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి చెందిన అనేక పుస్తకాలను ఇక్కడ మనం చూడవచ్చు.

మ్యూజియం

మ్యూజియం

P.C: You Tube

భారతదేశంలో అత్యంత ఆకర్షణీయ వస్తు సంగ్రహాలయంగా అలహాబాద్ లోని మ్యూజియంకు పేరు. చరిత్ర పై పరిశోధనలు చేసేవారికి ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులు ఎంతగానో ఉపయోగపడుతాయి. అందుకే దేశం నలుమూల నుంచి పర్యాటకులతో పాటు చరిత్ర కారులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. సోమవారం సెలవు

అలహాబాద్ కోట

అలహాబాద్ కోట

P.C: You Tube

యమునా నది ఒడ్డున ఉన్న అలహాబాద్ కోట అలనాటి రాచరిక, యుద్ధనైపుణ్యానికి నిలువుటద్దం. ఈ కోటను మొదట అశోకుడు నిర్మిస్తే దానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ క్రీస్తుశకం 1583లో పున:నిర్మించాడని చెబుతారు. ప్రస్తుతం ఇండియాన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ కోట ఉంది. ఈ కోటను ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సందర్శించవచ్చు.

అజాద్ పార్క్

అజాద్ పార్క్

P.C: You Tube

భారత స్వతంత్ర సంగ్రామం జరిగే సమయంలో బ్రిటీష్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చంద్రశేఖర్ అజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయిన ఉద్యానవనం ఇదే. అతను చనిపోయిన ప్రాంతంలోనే అజాద్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకూ ఈ ఉద్యానవనాన్ని సందర్శించవచ్చు.

ప్లానిటోరియం

ప్లానిటోరియం

P.C: You Tube

ఖగోళ అద్భుతాలను చూడటానికి ప్లానిటోరియానికి మించిన ప్రదేశం మరొకటి లేదు. అలహాబాద్ లో మ్యూజియం పక్కనే ప్లానిటోరియం ఉంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ ప్లానిటోరియం అందుబాటులో ఉంటుంది. సోమవారం సెలవు.

కుంభమేళ

కుంభమేళ

P.C: You Tube

అలహాబాద్ లో జరిగే కుంభమేళ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడి నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు. అందుకే నాగసాధువులు కూడా ఇక్కడికి వస్తుంటారు. తదుపరి అలహాబాద్ లో కుంభమేళ 2025లో జరగనుంది.

సిక్కిం అందాలతో ఆడుకోవాలా?సిక్కిం అందాలతో ఆడుకోవాలా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X