• Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళ్లకండి...వెళితే వద్దన్నా శృంగార కోరికలతో రెచ్చిపోతారు

ఇక్కడికి వెళ్లకండి...వెళితే వద్దన్నా శృంగార కోరికలతో రెచ్చిపోతారు

Written By: Kishore

విశాలమైన, విభిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్న భారత దేశంలో సముద్ర తీర ప్రాంతాలకు కొదువులేదు. ఆ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఆహ్లాదకరమైన Smile శృంగార Kiss పరమైన కోరికలను పెంచే బీచ్ లు చాలా ఉన్నాయి. ఈ బీచ్ లలో ఉన్న ఇసుక తిన్నెలు, సముద్రపు అలలు మీలోని కోరికలను రెట్టింపు చేస్తాయనడం లో ఆశ్చర్యం, అతిశయోక్తి లేనే లేదు. అటువంటిలో ఉత్తమమైన ఏడు బీచ్ లను మీ కోసం అందజేస్తున్నాం. ఇక్కడ మీ నెచ్చెలి నడుము పైనే కాదు మరెక్కడ చేతులు వేసినా Tongue out మిమ్ములను డిస్టర్బ్ చేసేవారు ఎవరూ ఉండరూ. అన్నట్టు ఈ బీచ్ లు హనీమూన్ జంటలకు స్వర్గపు ద్వారాలను తెరుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం ఆ బీచ్ ల వివరాలు తెలుసుకొని ఈ వేసవి సెలవులను అక్కడ ఎంజాయ్ చేయడానికి తయ్యారైపోండి. 

సాక్షాత్తు బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతం అందుకే ఇక్కడ...

 1. రాధ నగర్ బీచ్, అండమాన్ నికోబర్

1. రాధ నగర్ బీచ్, అండమాన్ నికోబర్

Image Source:

ఆసియాలో అత్యంత రొమాంటిక్ బీచ్ లలో అండమాన్ నికోబార్ లోని రాధ నగర్ బీచ్ ఒకటిగా 2004లో టైమ్స్ మ్యాగజీన్ ఎంపిక చేసింది. ఈ బీచ్ అందమైనదే కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అందువల్లే దీనిని రొమాంటిక్ డెస్టినేషన్ ఆఫ్ అండమాన్ అని అంటారు. ఈ బీచ్ లో దాదాపు 12 కిలోమీటర్ల దూరం పడవ ప్రయాణాన్ని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన. ఇక్క నీలం రంగు నీళ్లతో తెల్లటి ఇసుక తిన్నెలు ముద్దాడటం మనం ఎప్పటికీ మరి మరిచిపోలేము. ఈ బీచ్ లో స్కూబా డైవింగ్ కు కూడా అవకాశం ఉంది.

2. అగోండా బీచ్, గోవా

2. అగోండా బీచ్, గోవా

Image Source:

గోవాలో అత్యంత సుందరమైన, విశాలమైన బీచ్ లలో అంగోడా బీచ్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ అలల ఆటు, పోటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జల క్రీడలకు అనుమతించరు. ఇక చిరుతిళ్లు అమ్మేవారిని కూడా ఈ బీచ్ లోనికి అనుమతించరు. దీంతో మీనెచ్చలి నడుముచుట్టూ చేతులు వేసి చిలిపి పనులు చేయడానికి మంచి అనుకూలమైన ప్రాంతం. అందువల్లే ఇక్కడకు కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు చాలా అందంగా ఉంటాయి.

3. వర్కలా బీచ్, తిరువనంతపురం

3. వర్కలా బీచ్, తిరువనంతపురం

Image Source:

ప్రపంచంలోని 10 సీజినల్ బీచ్ లలో వర్కలా బీచ్ ఒకటి. ఈ విషయాన్ని డిస్కవరీ ఛానల్ అధికారికంగా ప్రకటించింది. దీనిని పాపనాసం బీచ్ అని అంటారు. ఇక్కటి నల్లటి ఇసుక, తెల్లటి పాలనురుగు వలే ఉన్న కడలి తీరాలతో ముద్దాడుతుంటే మీరు మీ భాగస్వామి చేతులు మాత్రమే పట్టుకొని నడవలేరు. అటువంటి శృంగార కోరికలను కలుగజేస్తుంది కాబట్టే ఇక్కడకు పెళ్లైన జంటలు ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ బోటింగ్ కు అవకాశం ఉంటుంది. అంతే కాకుండా బైక్ ను అద్దెకు తీసుకొని సముద్ర తీరం వెంబడి రయ్ మని వెళ్లి పోవచ్చు.

4. కండోలిమ్ బీచ్, గోవా

4. కండోలిమ్ బీచ్, గోవా

Image Source:

గోవాలో అత్యంత ప్రాచూర్యం పొందిన బీచ్ లలో కండోలిమ్ బీచ్ కూడా ఒకటి. నార్త్ గోవాలోని కాలబీచ్, అగువా బీచ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ బీచ్ పొడవునా పామ్ చెట్లు ఉండటం వల్ల చల్లని నీడ కూడా మీ శృంగార కోరికలను మరింతగా రెచ్చగొడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ సముద్ర తీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

5. ఎలిఫెంటా బీచ్, అండమాన్ నికోబార్

5. ఎలిఫెంటా బీచ్, అండమాన్ నికోబార్

Image Source:

అండమాన్ నికోబార్ లోని రాధానగర్ బీచ్ కు ఉత్తర భాగంలో ఉన్న ఎలిఫెంటా బీచ్ స్కూబా డైవింగ్ కు పేరుగాంచినది. ఇక్కడ పగడాలు కూడా ఎక్కువ సంఖ్యలో దొరుకుతాయి. ఈ బీచ్ లో గ్లాస్ బాటమ్ కలిగిన ఓడలో ప్రయాణం ఒక మరుపురాని అనుభూతిని మిగుల్చుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చాలా తక్కువగా జన సంచారం ఉంటుంది. అందువల్ల మీ భాగస్వామి అందాలను కొరుక్కు తిన్నా అడిగే వారు ఉండరు.

6. యారాడా బీచ్, విశాఖ పట్టణం

6. యారాడా బీచ్, విశాఖ పట్టణం

Image Source:

విశాఖ పట్టణానికి దగ్గరగా ఉన్న ఈ యారాడా బీచ్ మూడు వైపులా పర్వతాలు ఉంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. నగర జీవితానికి దూరంగా ఉండే ఈ యారాడా బీచ్ కు హనీమూన్ జంటలు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ సముద్ర జలాల ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇతకు అంత సురక్షితం కాదు. ఇక్కడి సముద్ర చేపలు, పీతలు, రొయ్యల ఆహారాన్ని అందించే రెస్టోరెంట్లు ఎన్నో ఉన్నాయి. శృంగార కోరికలను ఈ ఆహారాన్ని తిని మీ భాగస్వామితో కేకలు పెట్టించడం మాత్రం మరిచిపోకండి.

7. లైట్ హౌస్ బీచ్, కోవాలం

7. లైట్ హౌస్ బీచ్, కోవాలం

Image Source:

కేరళలో హనీమూన్ కు ప్రసిద్ధి చెందిన బీచ్ లలో లైట్ హౌస్ బీచ్ కూడా ఒకటి. ఇది అర్థ చంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి సుందరమైన ప్రపంచంలో మీ సమయాన్ని ఇట్టే మరిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడానికి ఈ ప్రాంతం చాలా మనోహరంగా ఉంటుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి