» »భారతదేశంలోని అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు !

భారతదేశంలోని అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు !

Written By:

సూరీడు ఉదయిస్తున్న, అస్తమిస్తున్న ఆ దృశ్యాలే వేరు. సిటీ కన్నా పల్లెటూర్లలో ... ఇంకా చెప్పాలంటే పంటలపొలాల వద్ద సూర్యోదయం, సూర్యాస్తమం దృశ్యాలు మరింత అందంగా కనపడతాయి. పక్షులకిలకిలారావాలు, వేకువజామున వినిపించే సుప్రభాతం, కోడికొక్కొరోకో శబ్దాలు ... ఇవన్నీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అనటానికి సంకేతాలు.

ఇండియాలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

అయితే ఈ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు చూడటానికి పర్యాటకులు మన పల్లెటూర్ల వరకు రారు. కనుక సిటీలలోనే ఆ దృశ్యాలను చూసి ఆనందిస్తారు. వీటిని చూడటానికి ప్రకృతిప్రేమికులు, ఓత్సాహికులు, ఫొటోగ్రాఫర్లు ఆసక్తిని కనబరుస్తుంటారు. మన భారతదేశంలో ఇటువంటి కోవకే చెందిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు అద్భుతంగా కనపడతాయి. వాటిలో బీచ్లు, హిల్ స్టేషన్లు, చారిత్రక కట్టడాలు వంటివి కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఇక్కడ చెప్పబోతున్న ప్రదేశాలకు చేరుకోవడం చాలా సులభం. ఆల్మోస్ట్ బస్సు, రైలు మరియు విమాన మార్గాలు చేరువలో అందుబాటులో ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మూడు అందుబాటులో ఉంటాయి. మరికొన్ని సార్లు వాటిలో ఏదైనా ఒకటి అందుబాటులో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రదేశాలను చూసితరిద్దాం పదండి!!

భారతదేశంలోని ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు !

వర్కాల

వర్కాల

కేరళ రాష్ట్రంలో త్రివేండ్రం నగరానికి సమీపంలో ఉన్న ప్రదేశం వర్కాల. ఈ ప్రాంత ప్రత్యేకత కొండ అంచులు అరేబియా సముద్రంతో కలుస్తాయి. సూర్యోదయం ఇక్కడ చూడవలసిన సన్నివేశం. ఆ సమయంలో బీచ్ లో ఉన్న ఇసుకతిన్నెలు బంగారు రంగులోకి మారినట్లు కనిపిస్తాయి.

చిత్రకృప : Tony Paul

మంగళూరు

మంగళూరు

మంగళూరు కర్ణాటక రాష్ట్ర ముఖద్వారం. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పశ్చిమకనుమలు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణలు. ప్రఖ్యాత ఉల్లాల్ బ్రిడ్జి పై నుండి పర్యాటకులు సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను చూస్తుంటారు.

చిత్రకృప : Nithin Bolar k

కన్యాకుమారి

కన్యాకుమారి

తమిళనాడులోని కన్యాకుమారి సన్ సెట్ / సన్ రైస్ లకు ప్రసిద్ధి చెందినది. ప్రత్యేకించి పౌర్ణమి దినాలలో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. పర్యాటకులు బీచ్ వద్ద నిలబడి ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమం చూస్తుంటారు.

చూడవలసినవి : వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్ళువార్ విగ్రహం, బీచ్ లు, మ్యూజియం, టెంపుల్, ఫోర్ట్ మొదలుగునవి.

చిత్రకృప : Gopinath Sivanesan

పూరి

పూరి

పూరి బీచ్ జంటలకు, కుటుంబ సభ్యులకు ఒక విహార స్థలం. పర్యాటకులు బీచ్ లో కూర్చొని ఉదయం పూట సూర్యోదయంను, సాయంత్రంవేళ సూర్యాస్తమంను చూస్తుంటారు.

చిత్రకృప : Lovedimpy

హైదరాబాద్

హైదరాబాద్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ గురించి తెలియనివారుండరు. మరి అక్కడ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు ఎంతబాగుంటాయో పక్క ఫొటోలో చూడండి.

చిత్రకృప : Lakshayreddy

ఆరూర్

ఆరూర్

ఆరూర్ కేరళ రాష్ట్రంలో అలప్పుజ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ పట్టణంలోని బ్రిడ్జి పై నుండి సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను చూడటానికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : Vikramjit Kakati

అగుంబే

అగుంబే

కర్ణాటక లో చూడవలసిన మరో ప్రదేశం అగుంబే. ఇక్కడ నిత్యం ఎదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను ప్రేమికులు ప్రేమ హృదయాలుగా అభివర్ణిస్తుంటారు. ఈప్రాంతపు అదనపు ఆకర్షణలు జలపాతాలు, అడవులు, పశ్చిమ కనుమలు.

చిత్రకృప : Magiceye

కొచ్చి

కొచ్చి

జీవితంలో ఒక్కసారిగా సందర్శించవలసిన ఆహ్లాదకరమైన ప్రదేశం కొచ్చి. అరేబియా సముద్రపు రాణి గా పిలువబడే ఈ ప్రదేశంలో సూర్యాస్తమ దృశ్యం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. మెరైన్ డ్రైవ్ హార్బర్ వద్ద ఈ సన్నివేశాన్ని చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : Bobinson K B

మౌంట్ అబూ

మౌంట్ అబూ

మౌంట్ అబూ ఆరావళి పర్వత శ్రేణులలో కలదు. ఇక్కడి సన్ సెట్ పాయింట్ అబూలోని సాయంత్రపు ఆకర్షణ. ప్రేమికులు, పర్యాటకులు అందమైన కొండలలో అస్తమించే సూర్యుడును చూస్తూ ఆనందిస్తారు. ఫొటోగ్రాఫర్లు జంటలకు ఫోటోలు తీస్తుంటారు.

చిత్రకృప : Selmer van Alten

పుష్కర్

పుష్కర్

పుష్కర్ రాజస్తాన్ రాష్ట్రం లోని అజ్మీర్ జిలాలో కలదు. ఇక్కడ కల పుష్కర్ సరస్సు పర్యాటక ప్రసిద్ధి గాంచినది. ఈ సరస్సు నేపధ్యంగా కనపడే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎంత చూసినా తనివి తీరనివిగా వుంటాయి.

చిత్రకృప : bjoern

గోవా

గోవా

గోవా ప్రపంచప్రసిద్ధి పర్యాటక ప్రదేశం. భారతదేశంలో ఎక్కడైనా ఫారెనర్స్ కనిపిస్తారంటే అది గోవా నే. పబ్ లు, డాన్స్ లు, మందు ... వంటి వాటికే కాక ప్రశాంతత కోరుకొనేవారికి బీచ్ లు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమాలు పర్యాటకులను కనులవిందు చేస్తాయి.

చిత్రకృప : Vitor Pamplona

అలెప్పి

అలెప్పి

అలెప్పి కేరళ రాష్ట్రంలో చూడవలసిన మరొక గమ్యస్థానం. హౌస్ బోట్ లలో సరస్సు మీద విహరిస్తూ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను తిలకించడం మరుపురాని అనుభూతి.

చిత్రకృప : Navaneeth KN

దిబ్రూ ఘర్

దిబ్రూ ఘర్

అస్సాం లోని డిబ్రూ ఘర్ సూర్యోదయ సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి. డిబ్రూ ఘర్ ను భారత దేశ చాయ్ నగరం అని అంటారు. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

చిత్రకృప : Vikramdeep Sidhu

నరసాపురం

నరసాపురం

ఆంధ్ర ప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంలో కూడా గోదావరి నది పై సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు బాగుంటాయి.

చిత్రకృప : Kkin2k

ఉమియం సరస్సు

ఉమియం సరస్సు

ఉమియం సరస్సు మేఘాలయలోని రిభోయి జిల్లాలో కలదు. సూర్యకిరణాలను పది వివిధ రంగులలో చూపే ఈ సరస్సు సూర్యాస్తమానికి ప్రసిద్ధి. ఇది షిల్లాంగ్ కు 15 కి. మీ ల దూరంలో ఉన్నది. నీటి క్రీడల సౌకర్యం కూడా ఇక్కడ కలదు.

చిత్రకృప : R4robin

డార్జీలింగ్

డార్జీలింగ్

డార్జీలింగ్ కు 11 కి.మీ. ల దూరంలో ఉన్న టైగర్ హిల్స్ కాంచేన్ జుంగా పర్వత శ్రేణి భాగంలో కలదు. పర్యాటకులు ఈ టైగర్ హిల్ నుండి కాంచెన్ జుంగా పర్వతంపై నుండి ప్రకాశిస్తూ ఉదయించే సూర్యుడును చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Suvendra.nath

తాజ్ మహల్

తాజ్ మహల్

ఆగ్రా నగరంలో తాజ్ మహల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ఉదయంవేళ సూర్యోదయం, సాయంత్రంవేళ సూర్యాస్తమం చూడదగ్గవి. ప్రతి ఏటా నవంబర్ నెలలో తాజ్ వద్ద బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది.

చిత్రకృప : Ekabhishek

రాణాఫ్ కచ్

రాణాఫ్ కచ్

గుజరాత్ రాష్ట్రంలో రాణాఫ్ కచ్ కలదు. ఉప్పు కోతార్లకు ఇది ప్రసిద్ధి. తెల్లని రంగులో ఉంటే ఆ ఉప్పు కోతార్ల ను చూస్తే అది మంచునా ? అని అనిపిస్తుంది. ఇక్కడ సూర్యోదయం ప్రతిఒక్కరిని ఆనందింపజేస్తుంది.

చిత్రకృప : Rahul Zota

Please Wait while comments are loading...