Search
  • Follow NativePlanet
Share
» »భీమ్‌బెట్కా రాతి గుహల్లో ఆదిమ మానవులు గీసిన పెయింటింగ్స్ చూస్తే ఆశ్చర్యపడాల్సిందే..!

భీమ్‌బెట్కా రాతి గుహల్లో ఆదిమ మానవులు గీసిన పెయింటింగ్స్ చూస్తే ఆశ్చర్యపడాల్సిందే..!

దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది పర్యాటకులు సందర్శించే భోపాల్ దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఆసక్తికరమైన గత చరిత్ర, ఆధునిక పోకడలు వుండడం వల్ల ఈ నగరం ఆసక్తి రేకెత్తిస్తుంది. పైగా, భోపాల్ లో చూసి తీరవలసిన పర్యాటక ఆకర్షణలు కూడా చాలానే వున్నాయి. ఈ నగర భౌగోళిక స్థితి వల్ల ఈ ప్రాంతంలో సహజ౦గా ఏర్పడిన వన విహార్ అనబడే అభయారణ్యాలు చిరుత పులలకు ఆవాసంగా మారాయి. చరిత్ర ప్రేమికులు పురావస్తు ప్రదర్శనశాల, భారత్ భవన్ చూడాల్సిందే, అలాగే దైవ భక్తులు, బిర్లా మందిర్, మోతీ మసీదు, జామా మసీదు చూడాలి. పచ్‌మఢీ సమీపంలోని భీమ్‌బెట్కా, బాఘ్, ఉదయగిరి గుహలున్నాయి.

భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత

భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత

భీమ్ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. వీటికి అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉన్నాయి.

wikipedia.org

ఒకప్పుడు ఆదిమానవులకు, ఆ తర్వాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం

ఒకప్పుడు ఆదిమానవులకు, ఆ తర్వాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం

భీమ్ బెట్కా మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, అమర్ కంటక్ నది తీరాన కొండల మధ్యలో, రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆదిమానవులకు, ఆ తర్వాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.

Photo Courtesy: Nandanupadhyay

భీమ్ బెట్కా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా

భీమ్ బెట్కా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా

మధ్యప్రదేశ్ లోని భీమ్ బెట్కా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో. మధ్య రాతి యుగపు నాటివిగా శాస్త్రజ్ఞులు చెప్పుతున్నా ఈ గుహలు అలనాటి జీవన విధానాన్ని అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. వీటి గోడల పైన ఎరుపు , తెలుపు రంగులతో గీసిన చిత్రాలు, 9000 సవత్సరాల క్రితం నాటివన్నది ఒక అంచనా.

wikipedia.org

మహా భారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన గుహలు

మహా భారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన గుహలు

ఇవి మహా భారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన గుహలు అంటారు. భీమ్ బెట్కా అంటేనే భీముడు కూర్చున్న రాళ్ళు అని అర్ధం. మధ్యప్రదేశ్ లోని అత్యంత పురాతన మానవ నివాసాలని ఎప్పుడైనా ఒక్క సారి చూసి తీరాలి. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ గుహలు అంతస్దులు అమరి వున్నాయి.

wikipedia.org

ఈ గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు

ఈ గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు

భీమ్ బెట్కా గుహలు సుమారు 750కు పైగా కలవు. వీటిలో కొన్ని అతి ప్రాచీనమైనవి. వింధ్య పర్వతాలలో కల ఈ గుహలలో మానవ జీవితం ప్రతిబింబించే చిత్రాలు కలవు. ఈ గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏళ్ల నాటివని పరిశోధకులు తేల్చారు.

Bernard Gagnon

అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు.

అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు.

ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడి కొండ శిఖరాలను అధిరోహించి, అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. ఇక్కడి సహజసిద్ధమైన కొలనులు, సరస్సుల్లో పడవ ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది.

wikipedia.org

సత్‌పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది

సత్‌పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది

సత్‌పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది. స్వేచ్ఛగా సంచరించే పులులు, చిరుతలు వంటి భారీ జంతువులతో పాటు ఉడుతలు, కుందేళ్లు వంటి చిన్న చిన్న జంతువులను, రక రకాల పక్షులను ఇక్కడ దగ్గరగా తిలకించవచ్చు.

wikipedia.org

భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు

భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు

ఈ గుహలు భారతదేశంలో ఆది మానవుడు నివసించాడు అనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ గుహలలో లక్ష సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్ ఆదిమానవులు నివసించారు. భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు కనుగొన్నారు అందులో 243 భీమ్ బెట్కా చెందినవిగా మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరచి ఉంచారు.

wikipedia.org

పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణ...

పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణ...

పెయింటింగ్స్ ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ కలవు. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికిని కూడా కనబర్చాయి. ఒకానొక రాతిగుహలో చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలోని చిత్రం ఇక్కడి పెయింటింగ్స్ లో కెల్లా సెంటర్ ఆఫ్ అట్ట్రాక్షన్స్. వీటిని చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

wikipedia.org

వారసత్వ సంపద

వారసత్వ సంపద

భీమ్ బెట్కా గుహలను యునెస్కో 2003 లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. భీమ్ బెట్కా గుహలో ఉన్న ఏక శిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురైతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తుశాఖ రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది.

wikipedia.org

సందర్శన సమయం :

సందర్శన సమయం :

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భీమ్ బెట్కా గుహలను పర్యాటకులు/ యాత్రికులు సందర్శించవచ్చు. భీమ్ బెట్కా గుహలకు

Tanujdeshmukh

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

భీమ్ బెట్కా గుహలు భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాస్పోర్ట్ ద్వారా భీమ్ బెట్కా చేరుకోవచ్చు.

వాయు మార్గం ద్వారా : భీమ్ బెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజ భోజ్ ఎయిర్ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని భీమ్ బెట్కా సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా : భోపాల్ రైల్వే స్టేషన్ భీమ్ బెట్కా కు 37 కి. మీ ల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది.

రోడ్డు మార్గం ద్వారా : భీమ్ బెట్కా కు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, భోపాల్, ఇండోర్ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.

Raveesh Vyas

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more