• Follow NativePlanet
Share
» »మీ శత్రువును ఓడించే ‘పాకిస్తాన్’ హింగ్లజ్ దేవి మన దేశంలో కూడా ఉంది తెలుసా

మీ శత్రువును ఓడించే ‘పాకిస్తాన్’ హింగ్లజ్ దేవి మన దేశంలో కూడా ఉంది తెలుసా

Written By: Kishore

మనసు అల్లకల్లోలాన్ని తగ్గించే 'ఆల్మోరా'

అ (హో) బిలంలో 'అనంత'సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?

గోపి చంద్ హీరోగా నటించిన సాహసం సినిమా చూసిన వారికి హింగ్లజ్ మాత ఆలయం ఎక్కడ ఉంది అంటే వెంటనే చటుక్కున పాకిస్తాన్ లో అని చెప్పేస్తారు. అయితే అదే హింగ్లజ్ మాత ఆలయం మన దేశంలో కూడా ఉంది. ఆ దేవి దర్శనం చేసుకుంటే అనుకున్న పని ముఖ్యంగా శత్రువుల పై విజయం సాధించాలన్న వారి కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఆ దేవాలయం ఎక్కడ ఉంది. అక్కడికి ఎలా వెళ్లాలన్న విషయంతో పాటు హింగ్లజ్ దేవి గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

1. శక్తి పీఠాల్లో ఒకటి

1. శక్తి పీఠాల్లో ఒకటి

Image Source:

హింగ్లజ్ దేవి లేదా హింగుళా దేవి శక్తి పీఠాల్లో ఒకటి. ఇది పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్య లో ఉన్న హింగోల్ నదీతీరంలో గల ఒక కొండ గుహలో ఉంది. దీనిని
పాకిస్తాన్ దేశంలోని హిందువులు నానీ మందిరంగా పిలుస్తారు.

2. పురాణ కథనం

2. పురాణ కథనం

Image Source:

ఒకనాడు దక్షుడు యజ్ఞం తలపెట్టాడు. ఇందుకు ఆహ్వానం లేకపోయినా దక్ష ప్రజాపతి కుమార్తే దాక్షాయినీ ఆ శివుణ్ని ఒప్పించుకొని పుట్టింటిలో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. పార్వతి దేవిని ఎవరూ కూడా పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు.

3. బాధపడుతుంది

3. బాధపడుతుంది

Image Source:

నా భర్త మాట వినకుండా వచ్చానని బాధపడుతుంది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది. అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేకపోయింది. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది.

4. ప్రళయ తాండవం

4. ప్రళయ తాండవం

Image Source:

ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మశరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయతాండవం చేశాడు.

5. 51 ముక్కలు చేశాడు

5. 51 ముక్కలు చేశాడు

Image Source:

శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో 51 ముక్కలు చేశాడు. అవే శక్తిపీఠాలు. కొంతమంది 18 ముక్కలుగా చేశాడని వాటిని అష్టాదశ పీఠాలు అంటారని చెబుతారు.

6. బ్రహ్మరంధం పడిన ప్రాంతమే

6. బ్రహ్మరంధం పడిన ప్రాంతమే

Image Source:

అయితే 51 ముక్కలు చేసిన విషయం తీసుకుంటే దాక్షాయణి శోభాగం (బ్రహ్మరంధ్రం) ఈ హింగోళ ప్రాంతంలో పడిందని అందువల్లే ఇక్కడి దేవతను హింగ్లజ్ మాత అని అంటారు.

7. మరో కథనం ప్రకారం

7. మరో కథనం ప్రకారం

Image Source:

త్రేతాయుగంలో హింగోళుడు మునులను, ప్రజలను తీవ్రంగా బాధిస్తుంటాడు. అతని భారి నుంచి రక్షించాల్సిందిగా మునులు పరాశక్తిని వేడుకొంటారు. స్వయంగా రణరంగలోకి దిగిన అమ్మవారు హింగోళుడిని ప్రస్తుతం ఉన్న గుహలో తన ఆయుధమైన త్రిశూలంతో సంహరిస్తుంది.

8. అతనికి ఇచ్చిన వరం ప్రకారమే

8. అతనికి ఇచ్చిన వరం ప్రకారమే

Image Source:

అయితే అతను గొప్ప శివ భక్తుడు. దీంతో హింగోళుడి చివరి కోర్కెను అనుసరించి ఈ గుహలో ఆయన పేరుమీదనే కొలువుండిపోతుంది. అందువల్లే ఈ దేవతను హింగ్లజ్ మాత లేదా హిగోళ దేవి అని అంటారు.

9. భీమసేనుడి కోరిక పై

9. భీమసేనుడి కోరిక పై

Image Source:

ఈ హింగ్లజ్ మాతకు విజయాన్ని చేకూర్చే తల్లిగా పేరుంది. ఈ విషయం తెలిసిన భీముడు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో తనకు విజయం చేకూర్చాలని ఇందు కోసం యుద్ధ క్షేత్రంలోకి రావాలని హింగూళ దేవి ఉన్న గుహ వద్దకు వెళ్లి వేడుకుంటారు.

10. తన మూర్తిని అందజేస్తుంది

10. తన మూర్తిని అందజేస్తుంది

Image Source:

ఇందుకు మాత అంగీకరిస్తుంది. తన మూర్తిని భీముడికి అందజేస్తుంది. అయితే తనను భుజం పై తీసుకు వెళ్లాలని యుద్ధ క్షేత్రం వచ్చేవరకూ నన్ను కిందికి దించకూడదని అంటుంది. ఇందుకు భీమ సేనుడు అంగీకారం తెలుపుతాడు.

11. అక్కడికి రాగానే

11. అక్కడికి రాగానే

Image Source:

అయితే ప్రస్తుతం హర్యాణలోని జజ్జార్ జిల్లాలో బేరి ప్రాంతానికి వస్తున్నట్లే భీమసేనుడికి శంఖానాదం వినిపిస్తుంది. దీంతో ఏంటి ఇక్కడ శంఖానాదం వినిపిస్తోంది. ఇక్కడ కూడా యుద్ధం జరుగుతోందా అన్న అనుమాతం వస్తుంది.

12. ఎంత ప్రయత్నించినా

12. ఎంత ప్రయత్నించినా

Image Source:

దీంతో దేవతా మూర్తిని అక్కడ ఉన్కన ఓ చెట్టు కింద ఉంచి చుట్టు పక్కల చూడటానికి వెళుతాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ మూర్తిని తన భుజం పై పెట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు. దీంతో తన తప్పును ఒప్పుకుంటాడు.

13. విజయం నీకే

13. విజయం నీకే

Image Source:

శాంతించిన తల్లి తాను చెప్పిన మాట ప్రకారం తిరిగి హింగుళా గుహకు వెలుతున్నాని అయితే నీకు విజయం తథ్యమని చెప్పి అంతర్థానమై పోతుంది. చెప్పిన మాట ప్రకారమే భీముడు తన ప్రధాన శత్రువుల పై విజయం సాధిస్తాడు.

14. గాంధారి గుడి కట్టించి ఇచ్చింది

14. గాంధారి గుడి కట్టించి ఇచ్చింది

Image Source:

ఇక కురుక్షేత్ర యుద్దం జరిగిన తర్వాత తన కుమారులను పోగొట్టుకున్న గాంధీరి ఈ విషయం తెలుసుకొని మన:శాంతి కోసం ఇక్కడ మాతకు దేవాలయం నిర్మిస్తుంది. అక్కడే తన శేష జీవితం గడుపుతుంది.

15. అందువల్లే ఆ పేరు

15. అందువల్లే ఆ పేరు

Image Source:

భీముడు తీసుకువచ్చిన మూర్తి కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మవారిని భీమేశ్వరి దేవిగా వ్యవహరిస్తారు. ఈ దేవాలయం ఏడాదికి రెండు సార్లు తిరునాళ్లు జరగడం విశేషం. సాధారణంగా ఏ దేవాలయానికి అయినా ఒకసారి తిరునాళ్లు జరుగుతాయి. స్థానిక పూజారులు ఉత్సవాలను ఎప్పుడు జరపాలన్నది నిర్ణయిస్తారు.

16. వారు ఇక్కడకు రారు

16. వారు ఇక్కడకు రారు

Image Source:

కాగా, హింగళ మాతను తాంత్రిక పూజలు చేసే అఘోరాలు, హఠయోగులు ఎక్కువగా పూజిస్తే భీమేశ్వర అమ్మవారి గుడి ఛాయలకు అటువంటి వ్యక్తులు సాధారణంగా రాకపోవడం విశేషం.

17. ఎలా వెళ్లాలి

17. ఎలా వెళ్లాలి

Image Source:

ఢిల్లీ నుంచి ఇక్కడకు నిత్యం బస్సులు ఉంటాయి. అదే విధంగా ప్రైవేటు ట్యాక్సీల ద్వారా కూడా ఢిల్లీ నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. దగ్గర్లో ఉన్న విమానాశ్రయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి