Search
  • Follow NativePlanet
Share
» »బిలాస్ పూర్ - మరచిన దేవాలయాలు !

బిలాస్ పూర్ - మరచిన దేవాలయాలు !

బిలాస్ పూర్ లో అనేక దేవాలయాలు మరియు పురావస్తు ప్రదేశాలు ఎంతో కాలం నుండి మరచినవి కలవు. నేడు బిలాస్ పూర్ విద్యుత్ ఉత్పాదతకు ఒక పెద్ద కేంద్రం అయింది. ఈ కారణంగా అక్కడి ఈ పురాతన పర్యటనా ప్రదేశాలను మరో మారు పునర్నిర్మాణం చేసేందుకు అక్కడి పర్యాటక శాఖ నడుం కట్టింది. ఈ పురాతన అద్భుత దేవాలయాలు, ఇతర ప్రదేశాలను చూసేందుకు అనేక మంది పర్యాటకులు నేడు ఇక్కడకు వస్తున్నారు. ప్రకృతి ప్రియులు కోరే అనిక సహజ దృశ్యాలు ఖుతా ఘాట్ వంటి ప్రదేశాలలో కలవు. ఆచనక్మార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి ప్రసిద్ధి చెందినా పర్యావరణ పర్యాతకత లో ఒకటి. ఇక్కడ కల అందమైన లోయల, పర్వత శ్రేణుల, అడవుల దృశ్యాలు చూసేందుకు సోన్ముడ ఒక మంచి ప్రదేశం. మీ బిలాస్ పూర్ పర్యాతనలో తేలికగా పర్యటించేందుకు మీకు ఇక్కడ కొన్ని మార్గాదర్శకతలు అందిస్తున్నాం. పరిశీలించండి.

మల్హార్ బిలాస్ పూర్

మల్హార్ బిలాస్ పూర్

బిలాస్ పూర్ లో కల అనేక పర్యాటక ప్రదేశాలలో మల్హార్ ఒకటి. దీనినే సర్వ పూర్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ పట్టణం చత్తీస్ ఘర్ కు రాజధాని గా వుండేది. ఈ పట్టణం అక్కడ కల పురావస్తు ప్రదేశాలకు, పాతాళేశ్వర్ టెంపుల్ కు ప్రసిద్ధి. ఇక్కడ కల దేవరి టెంపుల్ మరియు దిన్దేశ్వరి టెంపుల్ చాలా పురాతనమైనవి. ఈ దేవాలయాలు సుమారు 10 మరియు 11 వ శాతాబ్దాలనాటివిగా చెపుతారు. ఈ ప్రదేశంలోనే కొన్ని జైన మత మందిరాలు కూడా తవ్వకాలలో బయట పడ్డాయి. నాలుగు తలలు కల విష్ణు మూర్తి విగ్రహం ఒక పర్యాటక ఆకర్షణ. పాతాళేస్వర్ కేదార్ టెంపుల్ లో గోముఖి శివ లింగం మరొక ప్రధాన ఆకర్షణ. దిన్దేశ్వరి దేవాలయం కాలచూరి రాజుల పాలన లోనిది.
Photo Courtesy: Rksande

రతన్ పూర్, బిలాస్ పూర్

రతన్ పూర్, బిలాస్ పూర్

బిలాస్ పూర్ నుండి 25 కి. మీ. ల దూరంలో కల రతన్ పూర్ వివిధ రాజ వంశాల పాలనలో అనేక చారిత్రక మార్పులు పొందింది. రతన్ పూర్ లోని మహామాయ టెంపుల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ఒక కొలను దాని ఒడ్డున కొన్ని పురాతన దేవాలయాలు కలవు. ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. రతన్ పూర్ లో ఇంకనూ, బుద్ధ మహాదేవ టెంపుల్, రత్నేస్వర్ మహాదేవ టెంపుల్ మరియు లక్ష్మి దేవాలయం లు కూడా కలవు.

తలగ్రాం తాలా లేదా తాలగ్రం , బిలాస్ పూర్ నుండి 25 కి. మీ. ల దూరంలో కలదు. 5 వ శతాబ్దం నాటి దేవరాని - జేతాని టెంపుల్ కారణంగా ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయ్యింది. తాల గ్రామ ను అమెరి - కాపా గ్రామ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ లో సుమారు 7 అడుగుల పొడవు మరియు 4 అడుగుల వెడల్పు కల అద్భుత విగ్రహం ఒకటి కలదు. ఈ విగ్రహం చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వస్తారు. అనేక సంవత్సరాలు గడిచి నప్పటికీ ఈ మాతకు పేరు పెట్ట లేదు. తాల గ్రామ అక్కడ కల రుద్రశివ మరియు అక్కడే ప్రవహించే మనియారి నది కి కూడా ప్రసిద్ధి.

ఆచనక్మార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి, బిలాస్ పూర్

ఆచనక్మార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి, బిలాస్ పూర్

పురావస్తు ప్రదేశాలు మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలు మాత్రమే కాక బిలాస్ పూర్ లో వన్య జీవనం కల ప్రసిద్ధ ప్రదేశాలు కూడా కలవు. ఇక్కడ దట్టమైన అడవులు, అనేక కొండలు మరియు నదులు కలవు. ఆచనక్మార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి చత్తీస్ ఘర్ లోని ప్రసిద్ధ సాన్క్చురి లలో ఒకటి. ఇది అనేక అంతరించి పోతున్న జంతువులకు నిలయంగా కలదు. ఇక్కడ మీరు చిరుతలు, బెంగాల్ టైగర్, అడవి ఎద్దు, చిరుత, నాలుగు కొమ్ములు కల లేడి, చింకారా మొదలైనవి చూడవచ్చు.
Photo Courtesy: Koshy Koshy

బిలాస్ పూర్ ఎలా చేరాలి ?

బిలాస్ పూర్ ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం
బిలాస్ పూర్ విమానాశ్రయం చాకర్ భట్ట లో కలదు. ఇక్కడకు తరచు విమాన సేవలు లేవు. బిలాస్ పూర్ నుండి ఇది 10 కి. మీ. ల దూరం. ఇక్కడకు 11 5 కి. మీ. ల దూరంలో కల రాయ్ పూర్ ఎయిర్ పోర్ట్ కు విమాన సేవలు తరచుగా కలవు. దేశం లోని అన్నిప్రధాన నగరాల నుండి రాయ్ పూర్ కు విమానాలు నడుస్తాయి.
ట్రైన్ ప్రయాణం
బిలాస్ పూర్ రైలు స్టేషన్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కు జోనల్ హెడ్ గా కలదు. కనుక ఇది చత్తీస్ ఘర్ కు ఒక పెద్ద స్టేషన్. ఇది ఇండియా లో నాల్గవ ప్రసిద్ధ కూడలి. భోపాల్ ద్వారా ప్రయాణించే రాజ దాని ఎక్స్ ప్రెస్ న్యూ ఢిల్లీ కి కలుపు బడింది. బిలాస్ పూర్ ద్వారా ప్రయాణించే మరికొన్ని రైళ్ళు కూడా కలవు.
రోడ్డు ప్రయాణం
రాయ్ పూర్ మరియు రాయ్ ఘర్ లు ఎన్ హెచ్ 20 0 ద్వారా బిలాస్ పూర్ కు కలుపబదినాయి. జాతీయ రహదారుల ద్వారా కోల్కత్త మరియు ముంబై కలుపు బడినాయి. అంబికా పూర్ మరియు వారణాసి లు ఎన్ హెచ్ 11 1 ద్వారా కలుపు బడ్డాయి. అనేక రాష్ట్ర రహదారుల ద్వారా బిలాస్ పూర్ ఇతర రాష్ట్రాలకు కలుపు బడి వుంది. బిలాస్ పూర్ లో పర్యటించేందుకు బస్సు లు మరియు టాక్సీ లు లభ్యంగా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X