Search
  • Follow NativePlanet
Share
» »24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం

24 గంటలూ గన్ మెన్లతో సెక్యూరిటీ పొందుతున్న అత్యంత పవిత్రమైన వృక్షం

భోది వృక్షం గురించిన కథనం.

సాధారణంగా వీఐపీలకు, అత్యంత ముఖ్యమైన సినిమా స్టార్లకు, వారి పిల్లలకు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని భావిస్తేవారికి పోలీసు రక్షణ కల్పించడం చూస్తుంటాం. ఆ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి ఆయుధాలు ధరించిన వక్తులు రక్షణగా ఉంటారు. అయితే దేశంలో ఒకే ఒక పవిత్రమైన చెట్టుకు రక్షణగా గన్ మెన్లు రక్షణగా ఉంటున్నారు. అది కూడా 24 గంటలూ. అయితే ఆ వృక్షం ఎక్కడ ఉంది? అక్కడకు ఎలా వెళ్లలి తదితర వివరాలు మీ కోసం...

ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?ఈ నారసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా సందర్శించారా?

వినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడువినాయకుడు ఇక్కడ గజముఖుడు కాదు, మనిషి ముఖమే కలిగి ఉంటాడు

కొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసాకొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా

వీఐపీ ట్రీట్మెంట్

వీఐపీ ట్రీట్మెంట్

P.C: You Tube

దేశంలోనే మొదటి వీఐపీ ట్రీట్మెంట్ అందుకొంటున్న చెట్టు ఇదే. 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అడుగుల ఎత్తైన ఫెన్సింగ్ మధ్య ఈ చెట్టు ఉంటుంది. అత్యంత పవిత్రంగా భావించడం వల్లే స్థానిక ప్రభుత్వం ఈ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

బెంగళూరులో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చూడకుండే చాలా మిస్ అవుతారు.బెంగళూరులో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చూడకుండే చాలా మిస్ అవుతారు.

24 గంటలూ ఇక్కడ గన్ మెన్లు

24 గంటలూ ఇక్కడ గన్ మెన్లు

P.C: You Tube

రోజులో 24 గంటలూ ఇక్కడ గన్ మెన్లు కాపలాగా ఉంటారు. అదేమిటి ఒక చెట్టుకు ఇంతటి రక్షణ ఎందుకని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. అందుకు సంబంధించిన వివరాలన్నీ మనం ఈ కథనంలో తెలుసుకొందాం. ఇందు కోసం క్రీస్తు పూర్వం కాలానికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్ఇక్కడ ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి భాయ్, భాయ్

బోధి వృక్షం

బోధి వృక్షం

P.C: You Tube

అంతటి రక్షణ కలిగిన చెట్టు బోధి వృక్షం. అవును మీ ఆలోచన సరైనదే. గౌతమ బుద్ధుడికి ఈ చెట్టుకిందనే జ్జానోదయం అయ్యింది. అందువల్ల బౌద్ధులకు ఈ చెట్టు ఎంతో పవిత్రమైనది. దీనిని కేవలం బౌద్ధులే కాకుండా మిగిలిన మతాలకు చెందిన వారు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తున్నరు.

ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...ఈ సరోవరంలోని నాగమణి కోసం ఆశపడి చాలా మంది...

భోపాల్ దగ్గర్లోని సాంచి

భోపాల్ దగ్గర్లోని సాంచి

P.C: You Tube

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గర్లోని సాంచి, సలామత్ పుర మధ్య ఉన్న చిన్న గుట్ట మీద ఈ చెట్టు ఉంది. దీనిని అత్యంత జాగ్రత్తతో చూసుకొంటున్నారు. ఈ చెట్టు దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వరు. వారు వీఐపీ, వీవీఐపీ అయినా సరే ముందస్తు అనుమతి తీసుకుకోవాల్సిందే.

అప్పటి శ్రీలంక అధ్యక్షుడైన రాజపక్సే

అప్పటి శ్రీలంక అధ్యక్షుడైన రాజపక్సే

P.C: You Tube

2012 డిసెంబర్ లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడైన రాజపక్సే ఈ చెట్టును నాటారు. అరోజు నుంచి మొదలు ఇప్పటి వరక ఆ చెట్టును కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తున్నారు. ఈ గుట్ట పైకి ముందస్తు అనుమతి లేకుండా ఎవరిని పంపించరు. ఈ చెట్టుకు సంబంధించిన ఒక్క ఆకు లేదా కొమ్మును కూడా ఎవరూ తీసుకువెళ్లడానికి వీలులేదు.

ప్రత్యేకమైన ట్యాంకులో

ప్రత్యేకమైన ట్యాంకులో

P.C: You Tube

ఈ చెట్టుకు సాంచి నగర పాలికే నుంచి ప్రత్యేకమైన ట్యాంకులో నీటిని సరఫరా చేస్తున్నారు. ఎట్టి పరిస్థుతుల్లోనూ నీరు, ఎరువు తదితరాలు తక్కువ కాకుండా చూస్తుంటారు. ఈ బోధి చెట్టు సంరక్షణకు అవసరమైన నిపుణులను ఒక్కొక్కసారి శ్రీలంక నుంచి కూడా ఇక్కడికి రప్పిస్తుంటారు.

నిపుణులు

నిపుణులు

P.C: You Tube

ఇక ఈ చెట్టును రక్షించడానికి వీలుగా నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కలెక్టర్ నేరుగా చూస్తుంటాడు. కనీసం నెలకు ఒకసారైనా అక్కడికి వెళ్లా ఆ చెట్టును చూసి వస్తుంటారు. ఇందుకు సిబ్బందిని కూడా కేటాయించడం గమనార్హం

క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో

క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో

P.C: You Tube

బుద్ధునికి జ్జానోదయం అయిన బోధి చెట్టు చిన్న కొమ్మును క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో భారత్ నుంచి శ్రీలంకకు తీసుకువెళ్లారు. అక్కడ అనురాధాపురంలో నాటి సంరక్షించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి

లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి

P.C: You Tube

ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి అక్కడికి పర్యాటకులు వెలుతున్నారు. ఆ చెట్టును అక్కడి వారు పరమ పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇక ప్రస్తుతం ఆ చెట్టు కొమ్మనే తిరిగి భారత దేశానికి తీసుకువచ్చారు. అందువల్ల ఈ చెట్టును పరమ పవిత్రమైనదిగా భావిస్తూ రక్షిస్తున్నారు.

ప్రత్యేక బడ్జెట్ ను

ప్రత్యేక బడ్జెట్ ను

P.C: You Tube

ప్రతి ఏడాది ఈ చెట్టు సంరక్షణ కోసం స్థానిక ప్రభుత్వం లక్షల రుపాయలు ఖర్చు చేస్తోంది. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించడం గమనార్హం. ముందస్తు అనుమతి తీసుకొని ఈ గుట్ట పైకి వెళ్లవచ్చు. అయితే దూరం నుంచి మాత్రమే ఆ చెట్టును సందర్శించి వెనుతిరగాల్సి ఉంటుంది.

రామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనేరామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనే

రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...రావణాసురుడు తన తలలను తెగ నరుక్కొన్నది ఇక్కడే...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X