Search
  • Follow NativePlanet
Share
» »ఈ బాబాకు గోడగడియారాలంటే ప్రీతి ఎక్కువ?

ఈ బాబాకు గోడగడియారాలంటే ప్రీతి ఎక్కువ?

బ్రహ్మ బాబా దేవాలయంలో కోరికలు నెరవేరిన తర్వాత గోడ గడియారాలను కానుకలుగా అందిస్తారు. ఈ దేవాలయం చరిత్ర, సమయం, ఎలా చేరుకోవాలో మీరు తెలుసుకోండి

భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానిది ఒక్కొక్క విశిష్టత. అయితే భక్తులు ఏ దేవాలయానికి వెళ్లినా తమ కోరికలను విన్నవించుకోవడానికే వెలుతారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోరికలు నెరవేరినప్పుడు వివిధ వస్తువులను ఆ దేవుడికి కానుకలుగా సమర్పిస్తారు. అటువంటి కోవకు చెందినదే బ్రహ్మ బాబా దేవాలయం. ఈ దేవాలయంలో కోరికలు తీరిన తర్వాత ఏమిస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాలో బ్రహ్మ బాబా అనే దేవాలయం ఉంది. ఇది ఒక చిన్న దేవాలయం. కుల, మత భేదాలు లేకుండా హిందువులు, క్రైస్తవులు, ముస్లీంలు, సిక్కులు ఈ దేవాలయాలకి వచ్చి పూజలు చేస్తారు.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తమ కోర్కెలను ఆ దేవుడి ముందు పెడుతారు. ఆ కోర్కెలు నెరవేరిన తర్వాత తమ మొక్కును చెల్లిస్తారు. ఆ మొక్కు గడియారాల రూపంలో ఉంటుంది.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం ఆవరణంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకు వేలాది సంఖ్యలో గడియారాలను మనం చూడవచ్చు. భక్తులు తమ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడకు వచ్చి గడియారాలను కడుతారు.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

మనకు కోరికలు తీరిన తర్వాత గడియారాలు, వాచ్‌లు కానుకలుగా ఇచ్చే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇందుకు సంబంధించిన స్థానికంగా ఒక కథనం వినిపిస్తుంది. చాలా ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తానకు డ్రైవర్‌గా ఉద్యోగం రావాలని కోరుకొన్నాడు. అతని కోరిక నెరవేరింది. దీంతో అతను తన చేతికి ఉన్న గడియారాన్ని కానుకగా అందించాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

మీకు కూడా ఏవైనా కోరికలు ఉంటే వెంటనే ఈ దేవాలయానికి వెళ్లండి. వెంటనే మీ ఆశలు నెరవేరుతాయి. బ్రహ్మ బాబా దేవాలయానికి ప్రతి నెలా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలోని చెట్టు చుట్టూ ఎటువంటి ఫెన్సింగ్ వేయరు. అదే విధంగా ఎవరూ కాపాలా కూడా ఉండరూ. అయినా కూడా ఈ చెట్టుకు కట్టిన గడియారాలను దొంగలించడానికి ఎవరూ కూడా సాహసం చేయక పోవడం గమనార్హం.

బ్రహ్మ బాబా దేవాలయం

బ్రహ్మ బాబా దేవాలయం

P.C: You Tube

ఇక్కడ వేసవి కాలంలో ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య మీరు ఈ దేవాలయానికి వెళ్లడం ఉత్తమం. చుట్టు పక్కల కూడా చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X