Search
  • Follow NativePlanet
Share
» »సాంతానం కావాలా ఇక్కడికి వెళ్లండి?

సాంతానం కావాలా ఇక్కడికి వెళ్లండి?

హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో బ్రహ్మచారిణి దేవాలయం ఉంది.

హిందూపురాణాలను అనుసరించి బ్రహ్మచారిణీ పూజకు అత్యంత మహత్మ్యం ఉంది. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈ బ్రహ్మచారిణిని పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెవరవేరుతాయని చెబుతారు. ముఖ్యంగా సంతానం లేనివారికి వారి కోరిక తీరుతుందని చెబుతారు. ఇంతటి మహిమాన్వితమైన దేవతకు దేశంలో కేవలం ఒకే ఒక చోట దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసిలోని ఈ బ్రహ్మచారిణి దేవాలయం ఉంది. బ్రహ్మచారిణి దేవాలయం దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. వారణాసిలోని దుర్గాఘాట్ దగ్గరే ఈ బ్రహ్మచారిణి దేవాలయం ఉంది.

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

ఈ ప్రాంతం హిందూ ధార్మిక కార్యక్రమాలకు ప్రముఖ నిలయం. హిందూ ధర్మం ప్రకారం ధార్మికంగా ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. పార్వతీ దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేస్తుంటుంది.

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

అందులో భాగంగా మొదట కేవలం పళ్లు మాత్రమే తింటూ ఉంటుంది. అటు పై వాటిని కూడా వదిలి కేవలం నీటిని మాత్రం తాగి తపస్సు కొనసాగిస్తుంటుంది. ఆ రూపమే బ్రహ్మచారిణి అని పిలుస్తారు. నవరాత్రి రోజుల్లో రెండో రోజున పూజిస్తారు.

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ భక్తులు కిలోమీటర్లమేర నిలుచొని ఉంటారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి కొబ్బరినీరును నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పూల దండలతో పాటు తెల్లని వస్త్రాలను కూడా కానుకగా అందజేస్తుంటారు.

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

కొన్ని కిలోమీరట్ల మేర భక్తులు నిల్చొని ఉంటారు. దుర్గాదేవి రెండో రూపమే బ్రహ్మచారిణి రూపం అని అంటారు. ఈ దేవి కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ఉంటుంది. దుర్గాదేవిని ఈ బ్రహ్మచారిణి రూపంలో పూజించేవారికి సాక్షాత్తు పరమేశ్వరీ మాత ఆశిర్వాదం దొరుకుతుందని చెబుతారు.

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

ముఖ్యంగా కీర్తి అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. అందుకే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కాశి నుంచి మాత్రమే కాకుండా దేశంలోని చాలా ప్రదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

బ్రహ్మచారిణి దేవాలయం, వారణాసి

P.C: You Tube

ముఖ్యంగా నవరాత్రి రోజుల్లో ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సంతానభాగ్యం కోసం ఇక్కడ వేల మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయం మొత్తం నల్లటి గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ దేవాలయం వాస్తుశైలి ద్రవిడ వాస్తు శైలిని పోలి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X