Search
  • Follow NativePlanet
Share
» »రూ.10వేలుకే ఈ ‘మే’ పర్యాటకం మీ సొంతం

రూ.10వేలుకే ఈ ‘మే’ పర్యాటకం మీ సొంతం

By Kishore

వేసవిలో చాలా మంది వివిధ ప్రాంతాలకు పర్యాటకానికి వెలుతుంటారు. అటువంటి ప్రాంతాల్లో హిల్ స్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకొన్నదని భావిస్తుంటారు. సరిగా ప్రణాళికను అమలు చేస్తే కేవలం రూ.10 వేల రుపాయలతోనే నైనిటాల్, కాంషిట్, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో మూడు రోజుల పాటు గడపడానికి వీలవుతుంది. ముఖ్యంగా వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఈ మే నెలలో అక్కడి వెళ్లి ప్రకృతిలో మమేకం కావాలనుకొనేవారికి ఈ కథనం బాగా నచ్చుతుంది. ఈ కథనంలో దేశంలోని ప్రముఖ ఐదు హిల్ స్టేషన్స్ అక్కడ వసతి, భోజన, రవాణ ఖర్చు తదితర వివరాలన్నీ వివరించాం. అంతేకాకుండా అక్కడ ప్రముఖ, ప్రాచుర్యం పొందిన హోటల్స్ పేర్లు కూడా ఇస్తున్నాం. ఖర్చు ఒక్కొక్కరికి ఒక రోజు చొప్పున మొత్తం మూడు రోజుల్లో ఎంత అవుతుందనేది సుమారుగా ఇచ్చాం. మరెందుకు ఆలస్యం వివరాలు చదువుకొని టూర్ కు ప్రాణాళిక సిద్ధం చేసుకోండి

ప్రపంచంలో పాతాళ శిలతో మలిచిన ఏకైక విగ్రహం...సందర్శిస్తే పెళ్లి ఆ పై శోభనం

ఖర్చు ఇలా

ఖర్చు ఇలా

2. ఎక్కడి నుంచి ప్రయాణం మంచిది. ఢిల్లీ నుంచి (445 కిలోమీటర్లు)

Image Source:

హొటల్స్......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,500 నుంచి రూ.2, 000

ఆహారం.......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,000. ముఖ్యంగా ఇక్కడ సోల్ కెఫె, టేస్ట్ ఆఫ్ స్పిరిట్, ద హిమాలయన్ కెఫే, కెఫే కుంచుమ్ టాప్ అనే రెస్టోరెంట్లు ఫడ్డీస్ కు బాగా నచ్చుతాయి.

రవాణా........రూ.ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు సుమారు రూ.500. మీరు ఫ్రెండ్స్ తో కలిసి వెలుతుంటే మినీ బస్సును బుక్ చేసుకోవడం మంచిది.

మూడు రోజులకు గాను మొత్తం ఖర్చు

వసతి ......రూ.4,500 నుంచి రూ.6,000

ఆహారం కోసం......రూ.3,000

వరాణా కోసం....రూ.1,500

మొత్తం........రూ.9,000

3.కొడైకెనాల్

3.కొడైకెనాల్

Image Source:

మీకు జలజలా రాలే జలపాతాలు, నిర్మలమైన సరస్సులు, పచ్చటి కొండకోనలన్నీ ఒకే చోట చూడాలని వాటి మధ్య సమయం గడపాలనుకొనేవారికి తమిళానడు రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా కొడైకెనాల్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాల నుంచి ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇక్కడి కొడై లేక్, పిల్లర్ రాక్ తదితర టూరిస్ట్ స్పాట్ లలో సైక్లింగ్ కు కూడా అవకాశం ఉంది.

5.కలింపోంగ్

5.కలింపోంగ్

Image Source:

డార్జిలింగ్ కు కూత వేట దూరంలో ఉన్న మరో హిల్ స్టేషన్ కలింపోంగ్. మిగిలిన హిల్ స్టేషన్స్ వలే అంతగా ప్రాచూర్యం పొందక పోయినా ప్రక`తిని ఆస్వాధించే వారికి ఈ కలింపోంగ్ తప్పక నచ్చుతుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ మంచి రవాణా, వసతి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

6. ఖర్చు ఇలా

6. ఖర్చు ఇలా

6. ఎక్కడి నుంచి ప్రయాణం మంచిది.........కలకత్తా (623.9 కిలోమీటర్లు)

Image Source:

హొటల్స్......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,500 నుంచి రూ.2, 500

ఆహారం.......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,000. ముఖ్యంగా ఇక్కడ ప్యారిస్ కలింపోంగ్, కెఫే రాఫుల్, ఆర్ట్ కెఫే, సూద్ గార్డెన్ రిసార్ట్, ఓక్లే ఓం రిసార్ట్ లు మంచి ఆహారాన్ని అందజేస్తాయి.

రవాణా........రూ.ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు సుమారు రూ.500 (టెంపోలు, ఆటోలు, మినీ బస్సులు)

మూడు రోజులకు గాను మొత్తం ఖర్చు

వసతి ........ రూ.4,500 నుంచి రూ.7,000

ఆహారం కోసం.......రూ.3,000

వరాణా కోసం.......రూ.1,500

మొత్తం........రూ.9,000 నుంచి రూ.12,000

7. నైనిటాల్

7. నైనిటాల్

Image Source:

అటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు ప్రక`తి అందాలను కూడా ఆస్వాధించాలనుకొనేవారికి నైనిటాల్ ఒక చక్కని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పపడే నైనాదేవి దేవాలయం, నైనీ సరస్సు, ఇక్కడే ఉంది. అదే విధంగా వేసవిలో కూడా మంచుకురిసే అద్భుతమైన సుందర ద`ష్యాలను చూడటానికి ఈ ప్రాంతం నిలయం.

8. ఖర్చు ఇలా

8. ఖర్చు ఇలా

8.ఎక్కడ నుంచి ప్రయాణం ఉత్తమం..........ఢిల్లీ (285 కిలోమీటర్లు)

Image Source:

హొటల్స్......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,000 నుంచి రూ.2, 500

ఆహారం.......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,000.

రవాణా........రూ.ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు సుమారు రూ.500 (ట్యాక్సీలు అద్దెకు దొరుకుతాయి. గంట ప్రకారం అద్దెకు తీసుకోవడం ఉత్తమం)

మూడు రోజులకు గాను మొత్తం ఖర్చు

వసతి ......... రూ.3,000నుంచి రూ.7,500

ఆహారం కోసం..........రూ.3,000

వరాణా కోసం..........రూ.1,500

మొత్తం.........రూ.7,5000 నుంచి రూ.12,000

9.కాంషిట్

9.కాంషిట్

Image Source:

ప్రపంచంలోనే పారాగ్లైండింగ్ కు ఇది చాలా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ అయిన కాంషిట్ అడ్వెంచర్ టూరిజంను ఇష్టపడే వారికి సదా ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఇక్కడికి దగ్గరగా ఉన్న లోనావాలా, ఖండాలా కూడా ప్రముఖ పర్యాటక కేంద్రాలు.

10. ఖర్చు ఇలా

10. ఖర్చు ఇలా

ఎక్కడ నుంచి ప్రయాణం ఉత్తమం.........పూనే (51.9 కిలోమీటర్లు)

Image Source:

హొటల్స్......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.1,000 నుంచి రూ.2, 500

ఆహారం.......ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు రూ.500.

రవాణా........రూ.ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు సుమారు రూ.500

మూడు రోజులకు గాను మొత్తం ఖర్చు

వసతి ............ రూ.3,000నుంచి రూ.7,500

ఆహారం కోసం..........రూ.3,000

వరాణా కోసం............రూ.1,500

మొత్తం..........రూ.7,5000 నుంచి రూ.12,000

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X