Search
  • Follow NativePlanet
Share
» »గోవా లో నీటి క్రీడలకు ప్రసిద్ధి ... ఈ బీచ్ !!

గోవా లో నీటి క్రీడలకు ప్రసిద్ధి ... ఈ బీచ్ !!

కాలన్ గూటే బీచ్ గోవా అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. కండోలిం మరియు బాగా బీచ్ ల మధ్యన కల ఈ బీచ్ పర్యాటకులకు స్వర్గం తలపిస్తుంది.

By Mohammad

బీచ్ : కాలన్ గూటే

ఎక్కడ ఉంది - గోవా

ప్రసిద్ధి : నీటి క్రీడాలు, షాపింగ్, సముద్ర వంటకాలు

కాలన్ గూటే బీచ్ గోవా అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ. కండోలిం మరియు బాగా బీచ్ ల మధ్యన కల ఈ బీచ్ పర్యాటకులకు స్వర్గం తలపిస్తుంది. ఎన్నో పార్కింగ్ ప్రదేశాలు. రుసుము చెల్లించి హాయిగా మీ వాహనం రక్షించుకోవచ్చు. బైక్ లేదా కార్ లో వచ్చి ఆనందించవచ్చు.

ఇక్కడి దుకాణాలలో దుస్తులు, అనేక ఇతర వస్తువులు, చెప్పులు, గోవా మేగజైన్లు వంటివి ఎన్నో కొనుగోలు చేయవచ్చు. అన్నీ అందుబాటు ధరలలో ఉంటాయి. కాలన్ గూటే లో డ్రైఫ్రూట్లు అధికంగా లభిస్తాయి. నోరూరించే జీడిపప్పు వేపుడు, ప్లెయిన్, సాల్ట్ రుచులలో దొరుకుతుంది. కాలన్ గూటే బీచ్ నీటి క్రీడలకు ప్రసిద్ధి. బీచ్ ప్రవేశిస్తే చాలు అనేకమంది బ్రోకర్లు టికెట్లతో ప్రత్యక్షమవుతారు.

కాలన్ గూటే బీచ్

కాలన్ గూటే బీచ్

చిత్రకృప : Uspn

క్లబ్ క్యూబనా

గోవాలో పార్టీలు చేసుకోవాలంటే, క్లబ్ క్యూబనా మంచి ప్రదేశమని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. ఆసియాలో ఈ ప్రదేశం ఒకటే రాత్రంతా తెరచి ఉండే ప్రదేశంగాను అంటే, రాత్రంతా ఆనందించినప్పటికి ఏ పోలీస్ జోక్యం లేదా ఏ దుండగుల దాడి ఉండవని చెపుతారు. పార్టీలు చేసుకోవాలంటే అధిక సంఖ్య జనాలను కూడా ఈ ప్రదేశం వసతి చేయగలదు.

ఇక్కడ జరిగే పార్టీలలో అపుడపుడు మీరు ఒక హాలీవుడ్ లేదా బాలీవుడ్ సెలిబ్రిటీలను కూడా చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశమధ్య భాగంలోనే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ మరియు జాకుజ్జి సముద్ర తీరం అంతా కనపడుతూ ఒక కొండపై ఉండే ఓపెన్ ఎయిర్ నైట్ క్లబ్ వంటివి కూడా కలవు. కొన్ని ప్రాంతాలలో తాటి చెట్లు కూడా ఉండి మీకు బయలు ప్రాంతంలో ఉన్న భావనలు కలిగిస్తాయి. ఆకర్షణీయమైన డేన్స్ ఫ్లోర్ కూడా కలదు. ఈ ప్రదేశాన్ని అధిక సంఖ్యాకులు ఇష్ట పడతారు. ఆహారాలు తక్కువ ఇస్తారన్న పేరున్నప్పటికి, మీరు చక్కటి బీర్, వైన్ వంటి పానీయాలు తాగుతూ ఆనందించేయవచ్చు.

మే డీ డియుస్ చర్చి

మే డీ డియుస్ చర్చి

చిత్రకృప : Joel's Goa Pics

మే డీ డియుస్ చర్చి

మే డీ డియుస్ అంటే దేముడి తల్లి అని అర్ధం. ఈ చర్చి మోటుగా నిర్మాణం కలిగి ఉంటుంది. నార్త్ గోవాలో చాలా ప్రసిద్ధి. ఎన్నో చర్చిలు కల గోవా రాష్ట్రంలో నార్త్ గోవాలోని అనేక ఆకర్షణలలో ఈ చర్చి మరొక ఆకర్షణ. బాగా కాలన్ గూటే, కండోలిం ప్రాంతాలకు ఇది దగ్గరగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : గోవా అందం ... అదరహో !

ప్రవేశం ద్వారం ఎంతో పెద్దదిగా ఉండి వెండి గంటలు వేలాడటం ఆకర్షణగా ఉంటుంది. ఫొటోగ్రాఫర్లకు ఎంతో ప్రియమైన ప్రదేశం. ఈ చర్చిలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్య దేవత నొస్సా సెన్ హోరా విగ్రహం ఉంటుంది. దీనిని పురాతన గోవాలోని మే డి డియూస్ చర్చి శిధిలాలనుండి రవాణా చేసి ఇక్కడ ప్రతిష్టించారు.

గోవా షాపింగ్

గోవా షాపింగ్

చిత్రకృప : Klaus Nahr

కాలన్ గూటే ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు.

రైలు ప్రయాణం

గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.

విమాన ప్రయాణం

దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X