Search
  • Follow NativePlanet
Share
» »చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన - మరువలేని అనుభూతి!

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన - మరువలేని అనుభూతి!

బదరీ నాథ్, రామేశ్వరం, ద్వారక, పూరి పుణ్య క్షేత్రాల సందర్శన ఒక మరువలేని మధురానుభూతి ని ఇస్తుంది. ముస్లిం మతస్తులకు జీవితంలో మక్కా సందర్శన ఎంత ప్రాముఖ్యమో, హిందువులకు ఈ చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్శన అటువంటిది. హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే ఈ నాలుగు పుణ్య క్షేత్రాలను సందర్శించి మోక్షం పొందాలనుకుంటారు.

అయితే, చాలా మంది ఇటీవల ప్రసిద్ధి చెందిన ఉత్తరా ఖండ్ లోని చోటా చార్ ధాం సందర్శన ను చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్శన అని భావిస్తారు. కాని చార్ ధాం క్షేత్ర సందర్శన కు మీరు దేశం నలుమూలలూ ప్రయాణించ వలసి వుంది. చార్ ధాం అంటే అర్ధం హిందూ దేశం లోని నాలుగు మూలలలోను కల నాలుగు పీటాల సందర్శన అని చెప్పాలి.

అవి ఉత్తర భారత దేశంలోని బదరినాథ్ లో కల బదరినాథ్ టెంపుల్, దక్షిణాన రామేశ్వరంలోని రామనాథ స్వామి టెంపుల్, పడమటి భాగంలోకల ద్వారక లోని ద్వారకాదీష్ టెంపుల్ , తూర్పు భాగంలోని పూరిలో కల జగన్నాథ టెంపుల్. దేశం నలుమూలలలోని ఈ నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శనలో చేసే ప్రయాణం మీకు దేశం అంతా ప్రయాణిన్చామనే భావనతో అనేక అనుభూతులు ఇచ్చి ఒక గొప్ప యాత్రగా మీ మదిలో నిలిచి పోతుంది. ఈ రకమైన దీర్ఘ ప్రయాణంలో మీ అనుభవాలు మరింత అధికమవుతాయి. ఈ ప్రయాణాలు కాలి నడకన చేస్తే, భగవంతుడు మరింత ఆశీర్వదిస్తాడు. అయితే నేటి రోజుల్లో కల ఆధునిక ప్రయాణ సాధనాలు ఈ చార్ ధాం యాత్రను అతి తేలిక ప్రయానంగా చేసాయి. మీరు వేగవంతమైన ఈ ప్రయాణ సాధానాలు ఉపయోగించి మరింత ఆనందించవచ్చు కూడాను.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన
చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన !

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన !

సాంప్రదాయం మేరకు, చార్ ధాం యాత్ర ముందుగా పూరి ని దర్శించటం తో మొదలవుతుంది. పూరి నుండి యాత్ర సవ్యమైన దిశలో సాగి పోతుంది. ఈ చార్ ధాం యాత్రకు మూల పురుషుడు, జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యుల వారని పలువురు విశ్వశిస్తారు. ఇది మూడు వైష్ణవ, ఒక శివ క్షేత్ర దర్శనలతో ముగుస్తుంది.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన!

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన!

బదరి నాథ్ ను బదరి నారాయణ అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ బదరీ నాథుడు గా ఉత్తరాఖండ్ లోని బదరినాథ్ లో వెలిశాడని నమ్ముతారు. దీనినే చోటా చార్ ధాం యాత్ర అని కూడా వర్ణిస్తారు. ఈ ప్రదేశం సాధారణంగా, ఇక్కడి చలి వాతావరణం కారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి నవంబర్ వరకూ మాత్రమే యాత్ర కు తెరచి వుంటుంది. హిందూ తీర్థ యాత్రలలో బదరి నాథ్ యాత్రను గొప్ప యాత్రగా భావిస్తారు.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన!

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన!

రామేశ్వరంలోని రామనాథ స్వామి టెంపుల్ ఇండియా లోని దేవాలయాలలో కెల్లా అతి పొడవైన ప్రాకారం కలిగినదిగా చెపుతారు. ఈ ప్రాకారం 1212 స్తంభాలతో సుమారు 3850 అడుగుల పొడవు కలిగి అందమైన దేవాలయం కలిగి వుంటుంది. ఈ దేవాలయాన్ని పాండ్య రాజుల పాలనలో విస్తరించటం జరిగిందని చెపుతారు. ఈ క్షేత్రం శివుడి 12 జ్యోతిర్ లింగ దేవాలయాలలో ఒకటిగా కూడా చెపుతారు.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన

ద్వారక పట్టణం సుమారు 2500 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. గుజరాత్ లోని ద్వారకలో ద్వారకాదీష్ టెంపుల్ కలదు. ద్వారకాదీష్ అంటే ద్వారక యొక్క స్థాపకుడు అని అర్ధం. మహాభారత యుద్ధం తర్వాత శ్రీ కృష్ణుడు పాలించిన ద్వారక పట్టణం మునిగి పోవటంతో దాని జ్ఞాపకార్ధం ఇక్కడ ద్వారకాదీష్ టెంపుల్ నిర్మించారు. జగత్ మందిరంగా చెప్పబడే ఈ దేవాలయం సుమారు 72 స్తంభాలు కలిగి వుంటుంది. దీని ఉత్తర ప్రవేశ ద్వారాన్ని ‘మోక్ష ద్వారం' అని, దక్షిణ దిక్కున కల ద్వారాన్ని ‘స్వర్గ ద్వారం'అని అంటారు.

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన!

చార్ ధాం పుణ్య క్షేత్రాల సందర్సన!

ఓడిషా లోని పూరిలో కల జగన్నాథ టెంపుల్ ప్రతి సంవత్సరం జరిగే దాని రధ యాత్రకు ప్రసిద్ధి. ఈ కోస్తా తీర ప్రాంతంలో సంవత్సరం పొడవునా పండుగ వాతావరణమే. హిందువులకు ఈ క్షేత్రం ఒక పుణ్య క్షేత్రం. ఈ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేయబడే ఒక సుదర్శన చక్రం కలదు. ఆభరణాలతో అలంకరించబడి రత్నవేది గా పిలువబడే వేదిక పై మూడు ప్రధాన విగ్రహాలు అంటే శ్రీ జగన్నాథుడు, బలభద్ర మరియు మాత సుభద్రల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ నుండే చార్ ధాం యాత్ర మొదలవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X