Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత అందాలు...చిరపుంజి జలపాతాలు!!

అద్భుత అందాలు...చిరపుంజి జలపాతాలు!!

స్థానికులు చిరపుంజి లేదా సోహ్ర అని పిలుస్తారు. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల మేఘాలయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజి మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఎత్తుపల్లాల కొండలు, అనేక జలపాతాలు, బంగ్లాదేశ్ మైదానాలతో విస్తృత దృశ్యం మరియు స్థానిక గిరిజన జీవనవిధానం ఒక సంగ్రహావలోకనం చిరపుంజీ పర్యటనకు వెళ్లినప్పుడు చిరస్మరణీయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మవ్స్మై జలపాతం,నోహ్కలికై జలపాతం,దైన-త్లేన్ జలపాతం జెట్ వంటి జలపాతాలు ఇరుకైన తొట్లలోకి కొండలు క్రిందికి పడి మరపురాని ఒక చిత్రంను సృస్టిస్తాయి.

నోహ్కాలికై జలపాతం

చుట్టూ పచ్చని అడవి... మధ్యలో తెల్లటి తాడులా కనిపించే జలపాతం... దానివెనక దాగున్న విషాధగాధ.. ఇవన్ని తెలుసుకోవాలంటే మేఘాలయలోని చిరపుంజికి వెళ్ళవలసిందే!!....

చిరపుంజి దగ్గరలోని ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉండేటిది. ఆ కుటుంబంలో పాప, భర్త మరియు భార్య ఉండేవారు. ఒక ప్రమాదంలో భర్త చనిపోతాడు. భార్య అయిన కాలికై గత్యంతరం లేక మరో పెళ్లి చేసుకుంటుంది. రెండో భర్తకి పాప అంటే నచ్చదు అందుకని ఎలాగైనా విడిపించుకోవాలని చూస్తాడు. ఒకరోజు భార్య లేని సమయం చూసి పాపను చంపేస్తాడు. భార్య పాప గురించి ఆరా తీసేసరికి నిజం చెబుతాడు. అప్పుడు కాలికై పరిగెత్తుకొని వెళ్ళి కొండపై నుంచి దూకేస్తుంది. అప్పుడే అక్కడ ఒక జలపాతం ఏర్పడిందని అక్కడున్న స్థానికులు చెబుతారు. ఇది! నోహ్కాలికై జలపాతం యొక్క చరిత్ర.

స్థానిక భాషలో నోహ్ అంటే దూకటం అని అర్థం. కాలికై అంటే చనిపోయిన అమ్మాయి పేరు. చిరపుంజి వద్దనున్న ఈ ప్రాంతం మాత్రం వేలాది పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటున్నది. దీని గొప్పతనం ఏంటంటే ఏకంగా 1100 అడుగుల ఎత్తులో ఉండి, దేశంలో ప్రముఖ జలపాతాలలో ఒకటిగా నిలిచింది. 1100 అడుగుల ఎత్తు అంటే మీకు తెలుసా? 100 అంతస్తులు అన్నమాట. 100 అంతస్తుల మీద నుంచి నీటిధార కిందికి పడుతుంది అని!! అలాంటి సుందర దృశ్యాన్ని చూడటానికి రెండుకళ్లు చాలవు.

మనకు తెలిసినంతవరకు సాధారణంగా జలపాతాలు నదుల నుంచి ఏర్పడతాయి. కానీ ఇక్కడున్న ఈ జలపాతం మాత్రం కొండలపై నున్న వాగులు, వంకలు, సరస్సుల నుంచి పుట్టుకొని వస్తుంది. ఇలా ఆ జలధార కిందకు పడీ..పడీ ఒక గుంట ఏర్పడింది. ఆ గుంట ఎండాకాలంలో ఏమో ఆకుపచ్చగా, చలికాలంలో ఏమో నీలం రంగులో కనిపించడం మరో రకమైన అద్భుత వింత. పచ్చని చెట్ల మీదనుంచి దూకే ఈ జలధార ఒక తెల్లని తాడు మాదిరి గొలుసుల్లాగా పెనవేసుకొని కిందకు పడుతుంటే భలే ఆనందంగా ఉంటుంది.

అద్భుత అందాలు...చిరపుంజి జలపాతాలు!!

త్రాడు వలె కిందకు పడుతున్న నీటిధార

Photo Courtesy:Sun-anda

మవ్సమై జలపాతం

మవ్సమై జలపాతం మేఘాలయలో ఉన్న అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ఇది మవ్సమై గ్రామానికి అతి చేరువలో చిరపుంజి మార్గంలో ఉంది. మవ్సమై జలపాతం 315 మీటర్ల ఎత్తు నుండి క్రిందికి తీవ్ర రూపంలో పడుతుంది. భారతదేశంలో నాలుగవ ఎత్తైన జలపాతంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ జలపాతంను "ఏడు ఈశాన్య జలపాతం"అని ప్రముఖంగా పిలుస్తారు. అయితే ఒక మేఘావృతం ఉన్నరోజు మీరు నిజంగానే మరొక అద్భుతం మీ అడుగుల క్రింద మరియు జలపాతాలు చుట్టూ క్లౌడ్ కదలికను చూడవచ్చు.

అద్భుత అందాలు...చిరపుంజి జలపాతాలు!!

ధారాళంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం

Photo Courtesy:Dennis Wright

దైన్-త్లేన్ జలపాతం

దైన్-త్లేన్ జలపాతం చిరపుంజి సమీపంలో ఉన్న మరొక అద్భుతమైన జలపాతంగా ఉంది. ఇది ఒక "త్లేన్" లేదా ఆ ప్రాంతంలో గుహలలో నివాశమున్న ఒక భారీ సర్పం (పైథాన్) నుండి దానికి ఆ పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ అందమైన జలపాతంను చూడటానికి వస్తారు. సమీపంలో త్లేన్ తో యుద్ధంను వివరించే సహజ రాక్ చెక్కడంను చూడవచ్చు. దీనిని అవినీతి,దురాశ మరియు చెడు యొక్క చిహ్నంగా భావిస్తారు. చిరపుంజి మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరంలో దైన్-త్లేన్ జలపాతం ఉన్నది. ఇక్కడ చేరుకోవడానికి ఉత్తమ మార్గం షిల్లాంగ్ నుండి ఒక పర్యాటక బస్సు లేదా క్యాబ్.

చేరుకోవడం ఎలా?

విమాన మార్గం

షిల్లాంగ్ దగ్గర దేశీయ విమానాశ్రయం ఉంది. దీని పేరు షిల్లాంగ్ విమానాశ్రయం. చిరపుంజికి 95 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయంకి దేశంలోని ప్రధాన నగరాల నుంచి విమాన సర్వీసులు ఉన్నాయి.

రైలు మార్గం

గౌహతి రైల్వే స్టేషన్ చిరపుంజికి 150 కి. మీ. దూరంలో ఉన్నది. గౌహతి రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని నగరాల నుంచి అనుసంధానించబడింది.

బస్సు మార్గం

చిరపుంజి షిల్లాంగ్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడకు చేరుకోవడానికి 2 గంటలు సమయం తీసుకుంటుంది. షిల్లాంగ్ మరియు చిరపుంజీ మధ్య రోడ్ రవాణా కొరకు ప్రైవేట్ వాహనాలు మరియు ప్రభుత్వ రవాణా అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X