Search
  • Follow NativePlanet
Share
» »ఎండమండిపోతుంటే చల్లగాలులు కావాలా

ఎండమండిపోతుంటే చల్లగాలులు కావాలా

By Beldaru Sajjendrakishore

చాలా పాఠశాలల్లో ఏడాది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు అయిపోయిన వెంటనే పిల్లలు టూర్ వెళ్లాలని పట్టుపట్టడం ఎప్పుడూ జరిగేదే. ఇక కర్ణాటకలో అప్పుడే ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. మరో పది ఇరవై రోజుల్లో వేసవి కాలం రాబోతోంది. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఉద్యాన నగరంగా పేరుగాంచిన బెంగళూరులో కూడా ఈ వేసవిలో ఉక్కపోత ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో అటు పిల్లల కోరికా తీర్చిలన్నా, ఇటు ఈ ఉక్కపోతల నుంచి కొద్ది రోజుల పాటు దూరంగా చల్లని ప్రాంతాలకు టూర్ వెళ్లడమే ఉత్తమమైన మార్గం. సువిశాల కర్ణాటక భౌగోళిక ప్రాంతంలో అనేక చల్లని ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పర్వత ప్రాంతాలు కాగా, మరికొన్ని పచ్చటి అటవీ ప్రాంతాలు. అటు వంటి పర్యాటక ప్రాంతాల వివరాలు, బెంగళూరు నుంచి ఎంత దూరం ఉంది, దగ్గర్లో ఉన్న మరికొన్ని చూడదగిన ప్రాంతాలు తదితర వివరాలు నేటివ్ ప్లానెట్ మీ కోసం తీసుకువస్తోంది. మరెందుకు ఆలస్యం రానున్న వేసవికి మీ టూర్ షెడ్యూల్ ను ఇప్పుడే ఫిక్స్ చేసుకొని ఆ మేరకు సమాయత్తమవ్వండి...

1. కూర్గ్

1. కూర్గ్

Image source

భారత దేశంలోనే అత్యుత్తమైన పర్వత ప్రాంతంలో కర్ణాటకలోని కూర్గ్ కూడా ఒకటి. భారత దేశపు స్కాట్ ల్యాండ్ గా పిలువబడే కూర్గ్ ఏడాది మొత్తంలో ఎప్పడైన సందర్శించడానికి అనుకూలమే. అయితే వేసవిలో కూడా ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. అందువల్లే కేవలం కర్ణాటక వారే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడకు ఎక్కువగా వస్తూ ఉంటారు. కూర్గ్ లోని బారాపోల్ నదీ జలాలు రివర్ రాఫ్టింగ్ తదితర సహాసక్రీడలకు అనుకూలాంగా ఉంటాయి. బెంగళూరు నుంచి కూర్గ్ కు 243 కిలోమీర్లు దూరం కాగా ప్రయాణ సమయం ఐదున్నరగంటలు.

2.నాగర్ హోల్

2.నాగర్ హోల్

Image source

నాగర్ హోల్ జాతీయ ఉద్యాన వనం ఒక అటవీ ప్రాంతం. 643 చదరపు కిలోమీర్ల మేర ఉన్న ఉద్యానవనంలో కనుచూపు మేర పచ్చదనమే కనిపిస్తుంది. ఇక్కడ ఉదయం, సాయంకాలం సఫారీ మరిచిపోలేని అనుభూతి. వేసవి కాలంలో ఇక్కడ పర్యాటకుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లను చేస్తారు. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 30 సెంటీగ్రేట్ వరకూ ఉంటుంది. అయితే పచ్చని చెట్ల నీడలో అంత వేడమి మనకు అభువంలోకి రాదు. ఇక బెంగళూరు నుంచి నాగర్ హోల్ కు 225 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు ఐదున్నర గంటలు.

3.ఆగుంబే

3.ఆగుంబే

Image source

శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని ఒక చిన్న గ్రామం పేరు ఆగుంబే. దీనిని దక్షిణభారత దేశపు చిరపుంజీ అని అంటారు. ఈ హిల్ స్టేషనలో వేసవిలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. ట్రెక్కింగ్ చేయానికి కూడా ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది. ఔషదగుణాలు కలిగిన అనేక మూలికలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. బెంగళూరు నుంచి ఆగుంబే నుంచి బెంగళూరుకు 346 కిలోమీటర్ల దూరం ఉండగా ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు.

4.కెమ్మనగుడి

4.కెమ్మనగుడి

Image source

కర్ణాటకలో ముఖ్యమైన హిల్ స్టేషనల్లో ఒకటైన కెమ్మనగుడి చిక్కమగళూరు జిల్లా తరికెర తాలూకాలో ఉంది. సముద్ర మట్టానికి 1434 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం క్రిష్ణరాజేంద్ర ఒడయార్ వేసవి విడిదిగా కూడా ఉండేది. అందువల్ల ఈ ప్రాంతాన్ని క్రిష్ణరాజేంద్ర హిల్ స్టేషన్ అని కూడా అంటారు. ఇక్కడ సూర్యాస్తమయాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇక్కడ వేసవిలో కూడా ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. ఇక బెంగళూరు నుంచి కెమ్మనగుడికి 292 కిలోమీటర్ల దూరం కాగా ప్రయాణ సమయం 5 గంటల 40 నిలభై నిమిషాలు.

5.బండీపూర్

5.బండీపూర్

Image source

కర్ణాటకలోని చామరాజనగర్ లోని గుండ్లు పేట తాలూకాలో బండీపూర్ ఉంది. ఇది పులుల అభయారణ్యం. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. ఇక్కడ ఉదయం, సాయంత్రం సఫారీ అందుబాటులో ఉంటుంది. మైసూరు నుంచి ఊటి వెళ్లే మార్గంలో బండీపూర్ వస్తుంది. అందువల్ల బండీపూర్ వెళ్లేవారు అటు మైసూరుతో పాటు ఇటు ఊటీని కూడా సందర్శిస్తుంటారు. ఇక బెంగళూరు నుంచి బండీపూర్ కు 224 కిలోమీటర్ల దూరం కాగా ప్రయాణ సమయం నాలుగున్నర గంటలు.

6.కుద్రేముఖ్

6.కుద్రేముఖ్

Image source

చిక్కమగళూరు జిల్లాలో ఉన్న పర్వతశ్రేణి ప్రాంతమే కుద్రేముఖ్. ఒక వైపు నుంచి చూస్తే గుర్రం ముఖం ఆకారంలో ఈ ప్రాంతం కనిపిస్తుంది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. కన్నడలో ఖుద్రే అంటే గుర్రం ముఖ్ అంటే ముఖము అని అర్థం. ఈ హిల్ స్టేషన్ లో ఎండాకాలం ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీ గ్రేట్ ను దాటదు. అందువల్ల చాలా మంది ఈ ప్రాంతాన్ని తమ సమ్మర్ టూరిస్ట్ ప్లేస్ గా ఎంపిక చేసుకుంటారు. కుద్రేముఖ్ కు 99 కిలోమీటర్ల దూరంలోనే మంగళూరు విమానాశ్రయం ఉంది. ఇక బెంగళూరు నుంచి కుద్రేముఖ్ కు 332 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం దాదాపు ఏడు గంటలు.

7.చిక్కమగళూరు

7.చిక్కమగళూరు

Image source

కర్ణాకలోని ప్రముఖ హిల్ స్టేషన్స్ లలో చిక్కమగళూరు కూడా ఒకటి ఈ పర్వత ప్రాంతం కాఫీ తోటలకు చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. సముద్ర మట్టానికి 1,090 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వత శ్రేణి చుట్టు పక్కల అనే క పర్యాటక ప్రాతాలు కూడా ఉన్నాయి. దీంతో వేసవిలో చిక్కమగళూరుతో పాటు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను కూడా చూసిరావొచ్చన్న ఉద్దేశంతో చాలా మందిఇక్కడికి వెలుతుంటారు. బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు దాదాపు ఏడు గంటల ప్రయాణం. దూరం 290 కిలోమీటర్లు.

8.కబిని

8.కబిని

Image source

కావేరి నదీ ఉపనది అయిన కబినిని కపిల అని కూడా పిలుస్తారు. మైసూరు జిల్లా నరసీపుర వద్ద ఇది కావేరి నదిలో కలుస్తుంది. ఆ ప్రాంతం వేసవిలో కూడా కొంత చల్లగానే ఉంటుంది. వేసవిలో నదీ జలాల్లో రివర్ రాఫ్టింగ్ వంటి క్రీడలకు ఈ ప్రాంతం ఎంతో ఉత్తమమైనంది. బెంగళూరు నుంచి ఇక్కడకు 148 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 3.30 గంటలు.

9.కక్కేబే

9.కక్కేబే

Image source

కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మడికేరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం పేరే కక్కేబే. వేసవిలోనే కాకుండా ప్రతి వీకెండ్ కు ఇక్కడ ఎక్కువ మంది పర్యటాకలు వస్తూ ఉంటారు. ఈ ఏడాది కర్ణాటకలో బాగానే వర్షాలు పడినందువల్ల ఇక్కడికి దగ్గర్లోని చలువరాయ వాటర్ ఫాల్స్ కూడా కనువిందు చేయనుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ట్రెక్కింగ్ కు కూడా అవకాశం ఉంటుంది. బెంగళూరు నుంచి కక్కేబేకు 266 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 5 గంటల 46 నిమిషాలు.

10.తడియండామోల్

10.తడియండామోల్

Image source

కొడుగు జిల్లాలో తడియండామోల్ అతి ఎతైన పర్వత శిఖరం. ఇక కర్ణాటకలోనే ఇది మూడో అతి ఎతైన శిఖరం. ఇక్కడ వేసవిలో కూడా శీతాకాలం లాంటి ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో చాలా మంది కర్ణాటక వాసులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకలు ఇక్కడకు వేసవిలో ఎక్కువగా వస్తుంటారు. బెంగళూరు నుంచి తడియండామోల్ కు దాదాపు ఆరు గంటల ప్రయాణం కాగా దూరం 272 కిలోమీటర్లు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X