Search
  • Follow NativePlanet
Share
» »వారణాసి నగరంలో కళ్ళుమిరుమిట్లు గొలిపే దీపావళి వెలుగులు !

వారణాసి నగరంలో కళ్ళుమిరుమిట్లు గొలిపే దీపావళి వెలుగులు !

By Venkatakarunasri

దేవదీపావళి అనేది దేవతలు కార్తిక పౌర్ణిమ లేదా కార్తిక మాసం లో వచ్చే పౌర్ణమి నాడు ఆచరించే దీపావళి పండుగ. పవిత్రమైన ఈ వారణాసి నగరంలో దీపావళి ఉత్సవాలు మాత గంగా నది, మరియు కాశి విశ్వనాథుడి కి ప్రార్ధనలుగా చేయబడతాయి. దేవ దీపావళి ని గంగ మహోత్సవం చివరి రోజున నిర్వహిస్తారు. సుమారు పది లక్షల మట్టి ప్రమిదలు ఒత్తులతో వెలిగించి గంగా నది ఒడ్డున నీటిలో వదులుతారు.

వారణాసి నగరం భారతదేశం లో ఒక అద్భుత ప్రాఛీన ఆధ్యాత్మిక ప్రదేశం. పూర్వకాలంలో ఈ పట్టణాన్ని బెనారస్ లేదా కాశి అని పిలిచేవారు. ఎన్నో టెంపుల్స్, ఘాట్స్, మందిరాలు, నిరంతరం ప్రవహించే గంగా నది, లతో వారణాసి ఇండియాలోని ఇతర నగరాల కంటే కూడా ప్రసిద్ధి పొంది ప్రతి ఒక్కరకూ తెలిసిన నగరంగా పేరు పడింది. ఈ కారణంగానే విదేశీ పర్యాటకత కూడా ఇక్కడ అభివృద్ధి చెందినది.

ఈ సమయంలో సాయంత్రపు గంగా హారతి రోజూ కంటే కూడా అతి వైభవంగా జరుగుతుంది. వారణాసి గురించి ఎవరికి ఎన్ని అపోహలు ఉన్నప్పటికీ ఈ పూజలలో పాల్గొంటే చాలు అవి తొలగి పోతాయి. వారు వారణాసి మహిమను తప్పక నమ్ముతారు. ఈ సమయంలో ఇక్కడ 84 ఘాట్ లలో జరిగే పూజలు, వేడుకలు మంత్రాల ప్రభావం మిమ్ములను మంత్రముగ్ధులను గావించి ఆనందింప చేస్తాయి.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

దేవ దీపావళి ఉత్సవ నిర్వహణ ఉత్తర ప్రదేశ్ టూరిజం శాఖ నిర్వహిస్తుంది. అనేక కష్ట నష్టాలకు ఓర్చి అందరిని ఆనందింప చేస్తుంది. ఈ ఉత్సవాలకు టూరిస్ట్ లు ప్రపంచ నలుమూలల నుండి వస్తారు. వీరందరకూ వసతులు, ఇతర సౌకర్యాలు ఒక కమిటీ నిర్వహిస్తుంది.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

లక్షల కొలది దీపాలతో వెలిగే ఘాట్ లు చూసేవారికి కన్నుల పండువగా వుంటాయి. వారణాసి చరిత్రలో ఈ ప్రమిదల దీపాలు నదిలో వదలటం ఇటీవలి కాలంలో మొదలైనప్పటికి, ప్రతి సంవత్సరం వీటి సంఖ్య పెరిగి భక్తులలో మరింత ఆనందాన్ని నింపుతోంది. భక్తులు గంగా మాతను తలచుకొని వారి వారి కోరికలు తీర్చమంటూ ఈ దీపాలను నదిలోకి జారవిడుస్తారు.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

ఈ ఉత్సవాల నిర్వహణ లో గంగకు ఇచ్చే హారతి కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా వుంటాయి. వారణాసిలో ఇవి ప్రధాన ఘట్టాలు. ఈ రకమైన గంగా హారతి పండుగ అయిదు రోజులూ అట్టహాసంగానే జరుగుతుంది.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

దశాశ్వమేద ఘాట్ లో గంగా హారతి ఉత్సవం జరుగుతూండగా, పోలీస్ సిబ్బంది మరియు సైనికా అధికారులు, అమర్ జవాన్ జ్యోతి వద్ద మృత వీరుల సమాధిలకు పూల దండలు వేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తారు. దేశం కొరకు ప్రాణాలు అర్పించిన వారికి సైనిక వందనాలు చేసి శ్రావ్య సంగీతాలతో మరణించిన వారిపై భక్తి శ్రద్ధలు చాటుతారు.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

కర్పూర హారతులు, అగర వత్తులు, దీపాలు, మొదలైన వాటి తో నిర్వహించే మంత్ర సమేత ప్రార్ర్ధనలు అక్కడ కల 84 ఘాట్ లలో ప్రతిధ్వనిస్తాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో కలిగే భావా వేశం వర్ణించ నలవి కాదు.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

కార్తిక పౌర్ణమి నాడు అంటే, దేవా దీపావళి రోజున గంగా నది స్నానం జీవిత కాలంలో చేసిన పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. తాము పవిత్రులమైనామని భావిస్తారు. ఇదే విస్వాశం తో హైందవులు కార్తీక పౌర్ణమి స్నానాలను ఇతర నదులలోను, సమీప సముద్రాల లోను కూడా చేస్తారు.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

దేవ దీపావళి పండుగ సమయంలో భారత దేశ సంస్కృతి ప్రతిబింబించే విధంగా భారతీయ సంస్కృతి కి తగినట్లు అనేక కళలను ప్రదర్శిస్తారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యాలు, గీతాలు, భజనలు చేస్తారు. వీటిలో ఎంతోమంది ప్రసిద్ధ కళాకారులు పాల్గొంటారు.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

భారత దేశంలోని ప్రతి వేడుక ఒకే విధంగా కనపడి నప్పటికీ, విభిన్నంగా వుంటాయి. ప్రతి పండుగ దానికి సంబంధించిన అంశాలతో, ఆచారాలతో వైవిధ్యత చూపుతుంది. అయితే, ప్రతి పండుగకూ, సంగీతం, దీపపు వెలుగులు, వివిధ రకాల రంగులు అన్ని పండుగలకూ హై లైట్ గా వుంటాయి. కార్తీక పౌర్ణమి రోజున జరిగే దేవ దీపావళి కూడా ఈ పండుగల వంటిదే, కాని విభిన్నమైనది.

వారణాసిలో దీపావళి !

వారణాసిలో దీపావళి !

వారణాసి సందర్శించడానికి ఉత్తమ సమయం

వారణాసి సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ మరియు మార్చి మధ్య ఉంది.

వారణాసి ఎలా చేరాలి?

వారణాసి ఎలా చేరాలి?

వారణాసి ని విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరవచ్చు. సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది.

రోడ్డు మార్గం

బస్సుల ద్వారా లక్నో (5hrs), కాన్పూర్ (5hrs) మరియు అలహాబాద్ (2hrs) వంటి నగరాలు నుండి వారణాసిని చేరుకోవచ్చు. బస్సులు సాధారణంగా నెమ్మదిగా మరియు అసౌకర్యంగా ఉండుట వలన మీరు రైలు లేదా విమాన మార్గాల ద్వారా వస్తే ప్రయాణం సులువుగా సాగుతుంది.

రైలు మార్గం

రైలు మార్గం

వారణాసి లో వారణాసి జంక్షన్ మరియు మొఘల్ సారాయ్ జంక్షన్ అనే రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇవి నగరంనకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై మరియు కోలకతా వంటి నగరాలు నుండి వారణాసికి ప్రతి రోజు అనేక సర్వీసెస్ ఉన్నాయి.

విమాన మార్గం

విమాన మార్గం

వారణాసి కి సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అదే విధంగా ఢిల్లీ, లక్నో, ముంబై, ఖజురహో మరియు కోలకతా వంటి భారతీయ నగరాలతో ప్రత్యక్ష విమానాలు ద్వారా అనుసంధానించబడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X