» »1000 ఏళ్ల కాలం నాటి శివాలయమా? అయితే చూడాల్సిందే!

1000 ఏళ్ల కాలం నాటి శివాలయమా? అయితే చూడాల్సిందే!

Posted By: Venkata Karunasri Nalluru

LATEST: మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?

దేనుపురీశ్వరర్ ఆలయం చెన్నై సమీపంలో మదంపాక్కంలో ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవంగా పూజలందుకుంటున్నాడు. దేనుపురీశ్వరర్ ఆలయంను "దేనుపురీశ్వర మరియు త్రిపురీశ్వర" అని కూడా అంటారు. సంస్కృతంలో ధేనువు అంటే ఆవు అని అర్థం. ఇక్కడ ఒక ఆవుకు మోక్షాన్ని ప్రసాదించబడిన స్థలం కనుక దీనికి "దేనుపురీశ్వరర్" అనే పేరు వచ్చింది. చెన్నై నుండి దేనుపురీశ్వరర్ ఆలయం చేరుకొనుటకు వేలచ్చేరి తాంబరం ముఖ్య రహదారి మీదుగా 1 గంట 21 ని లు సమయం పడుతుంది.

ఈ ఆలయంను చోళుల కాలంలో నిర్మించారు. చెన్నైలో ఇటువంటివి కొన్ని ఇతర చోళ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయంను మొదటి కులోత్తుంగ చోళుని హయాంలో రాళ్ళతో ఏకీకృతం చేశారు. ఇక్కడ చోళ శిల్పాలతో చెక్కిన స్తంభాలు వున్నాయి. ఇక్కడ గల శాసనాలు మరియు విజయనగర సామ్రాజ్యం నాటి శిల్పాలు కూడా చూడవచ్చును.

దూరం: 30.3 కి.మీ దూరం వుంది.

రాఘవేంద్రస్వామి గుడిలో అంతుచిక్కని మహిమలు 

రూట్ మ్యాప్

1. పురాణకథనం

1. పురాణకథనం

కపిలుడు తన ఎడమ చేతితో శివలింగంకు పూజలు చేసి పాపం చేయడం వల్ల మరుజన్మలో ఆవుగా పుట్టినాడు అని చెబుతారు. ఆవు ఆలయ ప్రదేశంలో వున్న ఒక శివలింగం మీద ప్రతి రోజూ భక్తితో పాలు పోస్తూ వుండేది. పశువుల కాపరి ఆవు పాలు వృధా చేస్తోందని తలచి శివలింగాన్ని త్రవ్వగానే శివుడు కనిపించి కపిలుడు (ఆవు)కు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పశువుల కాపరిని క్షమిస్తాడు. పురాణం ప్రకారం రాజుకు ఈ ఘటన జరిగినట్లు ఒక కల వచ్చి ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది.

2. ధేనుకంబళ్

2. ధేనుకంబళ్

దేనుపురీశ్వరర్ సతీమణి ధేనుకంబళ్ కూడా ఈ ఆలయంలో పూజలందుకుంటున్నది. ఇక్కడ శివలింగము రూపంలో దేనుపురీశ్వరర్ విగ్రహం ఉంది. ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా వుంది. ప్రత్యేక గర్భగుడిలో దక్షిణ దిశలో ధేనుకంబళ్ కొలువైవున్నది.
pc :Booradleyp1

3. ఆలయ నిర్మాణం

3. ఆలయ నిర్మాణం

ఈ ఆలయంను చోళుల కాలంలో నిర్మించారు. చెన్నైలో ఇటువంటివి కొన్ని ఇతర చోళ ఆలయాలు కూడా వున్నాయి. ఆలయంను మొదటి కులోత్తుంగ చోళుని హయాంలో రాళ్ళతో ఏకీకృతం చేశారు. ఇక్కడ చోళ శిల్పాలతో చెక్కిన స్తంభాలు వున్నాయి. ఇక్కడ గల శాసనాలు మరియు విజయనగర సామ్రాజ్యం నాటి శిల్పాలు కూడా చూడవచ్చును.
pc : Booradleyp1

4. ఆలయ పునరుద్ధరణ

4. ఆలయ పునరుద్ధరణ

భారతదేశం యొక్క పురావస్తు సర్వే ఆధ్వర్యంలో ఆలయాన్ని పునరుద్ధరించారు. మెరుగుదలలు ఆలయ ముందరి భాగంలో వున్న మండపం మరియు అమ్మాం పుణ్యక్షేత్రం యొక్క దెబ్బతిన్న పైకప్పు ఉపరితలంను తొలగించి మరియు నూతన నిర్మాణం చేపట్టారు.
pc : Booradleyp1

5. జాతీయ ప్రాముఖ్యత

5. జాతీయ ప్రాముఖ్యత

పురాతన కట్టడాల మరియు పురావస్తు స్థలాలు (సవరణ మరియు ధ్రువీకరణ) 2010 చట్టం ప్రకారం జాతీయ ప్రాముఖ్యత గల ఒక స్మారకంగా ఈ ఆలయం పేర్కొనబడినది.
pc : Booradleyp1

6. సాంస్కృతిక ప్రాధాన్యత

6. సాంస్కృతిక ప్రాధాన్యత

15 వ శతాబ్దం తమిళ కవి అరుణగిరినాథార్ తన కవిత్వంలో ఈ ఆలయంను గురించి ప్రస్తావించారు. ఇక్కడ వివిధ పండుగలైన ప్రదోష, పంగుని ఉత్తిరం మరియు నవరాత్రులతో సహా ఈ దేవాలయములో జరుపుకుంటారు. భక్తులు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.
pc : Simply CVR

7. సిత్రేరి చెరువు

7. సిత్రేరి చెరువు

రాజు నిర్మించిన సరస్సు స్థానంలో నేడు రాజాకిల్పాక్కం ఉంది మరియు సిత్రేరి (చిన్న చెరువు అని అర్థం) గ్రామంను ఇప్పుడు మదంబాక్కం అని పిలుస్తారు.
pc : Simply CVR

8. శివలింగం

8. శివలింగం

నేడు కూడా మనం ఆ పశువుల కాపరి భూమిని త్రవ్వినప్పుడు శివలింగానికి తగిలిన దెబ్బని చూడవచ్చును.
pc : Simply CVR

9. విజయనగర రాజులు

9. విజయనగర రాజులు

ఈ ఆలయ గోడల పైన వున్న అనేక శిల్పాలు విజయనగర రాజులు కూడా చెక్కించారు. అంతేకాకుండా ఈ ఆలయానికి భూములు, పశువులు, ఆభరణాలు మొదలైనవి ఇచ్చిన వైనం విజయనగర రాజుల వైభవానికి చిహ్నాలు.
pc : Simply CVR

10.పెద్ద చెరువు

10.పెద్ద చెరువు

ఈ ఆలయానికి ప్రక్కనే దండిగా నీటితో నిండి వున్న ఒక పెద్ద చెరువు నీరు నిండి ఉంది. ఈ ఆలయ చుట్టూ నివసిస్తున్న ప్రజలకు నీటి వనరుగా పనిచేస్తుంది.
pc : Simply CVR

11. మదంబాక్కం

11. మదంబాక్కం

ఈ పురాతన గ్రామం ఇప్పుడు మదంబాక్కం అని పిలువబడుతోంది. గతంలో ఉలగుయ్యవంద చోళ, చతుర్వేది మంగళం అని పిలిచేవారు.
pc : Simply CVR

12.శరబేశ్వరర్ స్వామి

12.శరబేశ్వరర్ స్వామి

శరబేశ్వరర్ స్వామి నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని దించాలని ఎత్తిన శివుని యొక్క మరొక రూపం.
pc: Booradleyp1

13. ఇక్కడ జరిపే పూజలు

13. ఇక్కడ జరిపే పూజలు

ఇక్కడ శరబేశ్వరర్ స్వామికి ఆదివారాలు రాహు కాల సమయాలలో వందల కొలది భక్తులు వచ్చి పూజలు చేస్తారు.
pc: Booradleyp1

14. ఆలయం

14. ఆలయం

ఈ ఆలయ రాజాకిల్పాక్కం సమీపంలో తాంబరం మరియు మెదవాక్కం మధ్య నెలకొని వుంది.
pc: Booradleyp1

15. దేవాలయ దర్శన వేళలు

15. దేవాలయ దర్శన వేళలు

ఉదయం: 6.00 గంటల నుండి 12:00 గంటల వరకు మరియు సాయంత్రం 5:00 గంటల నుండి 8:30 గంటల వరకు
pc: Booradleyp1