Search
  • Follow NativePlanet
Share
» »ఈ భద్రకాళీ ఆలయ గుహలో ఇప్పటికీ వారు ఆ పూజలు చేస్తున్నారా? అందుకే విజయం కొంతమందికే...

ఈ భద్రకాళీ ఆలయ గుహలో ఇప్పటికీ వారు ఆ పూజలు చేస్తున్నారా? అందుకే విజయం కొంతమందికే...

వరంగల్ లోని భద్రకాళీ దేవాలయం గురించి కథనం

ఇక్కడ ఉన్న భద్రకాళీ స్వయంభువుగా చెబుతారు. పూర్వం ఎర్రని నాలుక బయటికి వచ్చి చాలా రౌద్రంగా కనిపించేవారు. ఇక అప్పటి రాజులు తాము యుద్ధానికి వెళ్లే సమయంలో విజయం సమకూర్చాలని పేర్కొంటూ కొన్ని ప్రత్యేక తాంత్రిక పూజలు చేసేవారని పురాణాలు కాదు చరిత్ర చెబుతోంది.

ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అందువల్లే ఇప్పటికీ ఆ దేవాలయంలో పరిసరాల్లో ఉన్న గుహల్లో కొంతమంది సిద్ధులు ప్రత్యేక సందర్భాల్లో కొంతమందికి విజయం చేకూర్చాలని రహస్యంగా పూజలు నిర్వహిస్తున్నట్లు చెబుతారు.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ పూజలు ఎక్కువగా జరుగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి స్థాయి కథనం మీ కోసం...

శతాబ్దాల చరిత్ర

శతాబ్దాల చరిత్ర

P.C: You Tube

వరంగరల్,హన్మకొండలకు మధ్యలో ఓ కొండమీద కొలువైన భద్రకాళి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 625 లో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

కాకతీయుల కాలం నాటికి ముందే

కాకతీయుల కాలం నాటికి ముందే

P.C: You Tube

ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆయంల కాకతీయుల కాలంనాటికే ఎంతో ప్రాభవాన్ని సంతరించుకొందని చెబుతారు. అంటే అంతకు ముందే ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు అర్థం చేసుకోవచ్చు.

అటు పై మాత్రమే యుద్ధానికి

అటు పై మాత్రమే యుద్ధానికి

P.C: You Tube

పూర్వం రాజులు ఈ అమ్మవారిని సందర్శించిన తర్వాతన యుద్ధానికి వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి భద్రకాళి మాతను దర్శించుకొన్న తర్వాతనే వేంగి పై విజయం సాధించాడని చెబుతారు.

ఏక శిలా విగ్రహం

ఏక శిలా విగ్రహం

P.C: You Tube

అటు పై భద్రకాళి ఆలయాన్ని పూర్తి చేశాడని చెబుతారు. అందుకు ఆధారంగా కొన్ని ఉదాహరణలు చూపిస్తారు. అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఒక శిల మీద చెక్కారు.

చతురస్రాకారం

చతురస్రాకారం

P.C: You Tube

ఈ విధంగా ఏకశిలలో విగ్రహాన్ని చెక్కడం చాళుక్యుల పంప్రదాయంలో కనిపిస్తుంది. ఇక రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్త్రాకారంలో ఉన్నాయి.

చాళుక్యుల కాలంలో

చాళుక్యుల కాలంలో

P.C: You Tube

అయితే కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఈ కారాణాల వల్ల చాళుక్యుల కాలంలోనే ఈ దేవాలయం నిర్మించబడిందని చెబుతారు. అయితే కొంతమంది కాకతీయు కాలంలో అని వాదిస్తున్నారు.

 కొన్ని గ్రంధాల్లో

కొన్ని గ్రంధాల్లో

P.C: You Tube

ముఖ్యంగా క్రీస్తుశకం 1550-1600 మధ్య రాసిన ప్రతాపరుద్ర చరిత్రతో పాటు మరికొన్ని గ్రంథాల్లో అమ్మవారి ప్రస్తావన వచ్చింది. అందువల్ల ఈ ఆలయానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు.

దిగ్విజయ యాత్ర

దిగ్విజయ యాత్ర

P.C: You Tube

ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయాత్రకు బయలుదేరినప్పుడు భద్రకాళిని పూజించి హనుమకొండ వెలుపల ఉన్న తోటలో సేనలను విడిది చేసినట్లు ప్రతాపరుద్రీయంలో వర్ణించారు.

గుహలు

గుహలు

P.C: You Tube

ఆలయం దగ్గర గుహలు ఉన్నాయి. అందులో ఇప్పటికీ కొంతమంది సిద్దులు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కొంతమంది విజయం చేకూర్చాలని కొన్ని తాంత్రిక పూజలు చేస్తున్నట్లు స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు.

చాలా రౌద్రంగా

చాలా రౌద్రంగా

P.C: You Tube

ఇక మొదట్లో ఈ ఆలయంలో అమ్మవారు చాలా రౌద్రంగా కనిపించేవారు. ముఖ్యంగా ఎర్రని నాలుక బయటికి వచ్చి సాధారణ ప్రజలు చూడలేకుండా ఉండేవారు

అందువల్లే యుద్ధంలో

అందువల్లే యుద్ధంలో

P.C: You Tube

అంత రౌద్రంగా ఉండటం వల్లే రాజులు ఈమెను అర్ఛించి యుద్ధంలో గెలిచేవారని చెబుతారు. ఇక కాకతీయుల సామ్రాజ్య పతనం అనంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయింది.

నవాబుల పాలనలో శిథిలం

నవాబుల పాలనలో శిథిలం

P.C: You Tube

అటు పై హైదరాబాద్ సంస్థానంలో నవాబుల పాలన, రజకార్ల దుశ్చర్యల ఫలితంగా ఈ దేవాలయం పూర్తిగా శిథిలమై పోయింది.

1950 తర్వాత

1950 తర్వాత

P.C: You Tube

క్రీస్తుశకం 1950లో ఈ దేవాలయంలో స్థానిక వ్యాపారి మనన్ లాల్ సమేజా ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ పనులు బాగా జరిగాయి. అంతేకాకుండా అంతకు ముందున్న రౌద్ర రూపం స్థానంలో ఈ అమ్మవారిని శాంతి స్వరూపంగా నెలకొల్పారు.

 ప్రసన్నంగా మార్చారు

ప్రసన్నంగా మార్చారు

P.C: You Tube

ముఖ్యంగా రౌద్ర స్వరూపిణి అయిన అమ్మవారి నోటిలో అమ`త బీజాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. అంతే కాకుండా అమ్మవారి గుడిలో శ్రీ చండీయంత్ర ప్రతిష్టాపన చేసి ప్రతి ఏడాది శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలు పునరుద్ధరించారు.

తొమ్మది అడుగుల ఎత్తు

తొమ్మది అడుగుల ఎత్తు

P.C: You Tube

దీంతో అమ్మవారు శాంతి స్వరూపంగా మరిపోయారని చెబుతారు. ప్రస్తుతం ఈ విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పుతో బ`హదాకారంలో ఉంటుంది.

ఎనిమిది చేతులు

ఎనిమిది చేతులు

P.C: You Tube

మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి. కుడివైపసున ఉన్న నాలుగు చేతుల్లో ఖడ్గం, ఛురిక, జపమాల, ఢమరుకం ఉండగా, ఎడమవైపున ఉన్న నాలుగు చేతుల్లో గంట, త్రిశూలం, మస్తకం, పాత్ర ఉన్నాయి.

పశ్చిమాభిముఖంగా

పశ్చిమాభిముఖంగా

P.C: You Tube

అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటారు. ఆలయం ముందు భాగంలో మహామండపం, ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం ఉండగా, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయుడు, నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయం ఉన్నాయి.

యాగశాల

యాగశాల

P.C: You Tube

ఈ ఆలయ ప్రాంగణంలో యాగశాలను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి పరిసర ప్రాంతల్లో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చే వరప్రదాయినిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరును అందిస్తోంది.

 శాకాంబరి ఉత్సవాలు

శాకాంబరి ఉత్సవాలు

P.C: You Tube

ఇక్కడ ఆలయంలో ఆషాడం తర్వత జరిగే శాకాంబరి ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుల చెల్లించుకొంటారు.

15 రోజుల పాటు

15 రోజుల పాటు

P.C: You Tube

పక్షం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 86 రకాల కూరగాయలూ, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని చూడముచ్చటగా అలంకరిస్తారు. ఈ ఉత్సవాల చివరి రోజైన ఆషాఢ పూర్ణిమ రోజు దాదాపు లక్షమంది భక్తులు విచ్చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X