Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయాల్లో కూడా సరస్వతి దేవి కొలువై ఉంది, సందర్శిస్తే చదువులో మీ పిల్లలే...

ఈ దేవాలయాల్లో కూడా సరస్వతి దేవి కొలువై ఉంది, సందర్శిస్తే చదువులో మీ పిల్లలే...

భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సరస్వతి దేవాలయాల గురించి కథనం.

విద్యకు, జ్జానానికి అధిదేవత సరస్వతి దేవి. ముఖ్యంగా విద్యార్థులను బడిలోకి పంపించడానికి ముందు సరస్వతి దేవికి పూజచేయడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. మరికొంతమంది ఆ దేవత కొలువై ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేకంగా అక్షరాభ్యాస పూజలు చేయిస్తూ ఉంటారు.

అందువల్లే పాఠశాలలు పున:ప్రారంభమయ్యే సమయంలో ఈ సరస్వతి దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే భారత దేశంలో లక్ష్మీ, పార్వతి దేవితో పోలిస్తే సరస్వతి దేవికి ఉన్న దేవాలయాలు చాలా తక్కువే. వాటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో భారత దేశంలో వివిధ చోట్ల ఉన్న సరస్వతి దేవాలయాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం...

సర్వతి దేవి దేవాలయం బాసర

సర్వతి దేవి దేవాలయం బాసర

P.C: You Tube

భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన సరస్వతి దేవాలయం బాసరలోని జ్జాన సరస్వతి దేవాలయం. అదిలాబాద్ లోని బాసరలో గోదవరి తీరంలో ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతి రోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు.

వేదవ్యాసుడు

వేదవ్యాసుడు

P.C: You Tube

వేదవ్యాసుడు మూడుపిడికిళ్లతో చేసిన కుప్పలు మహాలక్ష్మి, సరస్వతి, కాళి మాత విగ్రహాలుగా రూపాంతరం చెందాయని చెబుతారు. ఇక్కడ సరస్వతి దేవి పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తారు. చేతిలో వీన కూడా ఉంటుంది.

అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం

P.C: You Tube

తమ పిల్లలను బడిలోకి పంపించడానికి ముందు చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి అక్షరాభాస్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తద్వార వారికి చదువు బాగా వస్తుందని నమ్మకం. ఇందుకోసం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

పానచిక్కడ్ సరస్వతి దేవాలయం

పానచిక్కడ్ సరస్వతి దేవాలయం

P.C: You Tube

కేరళలోని పానచిక్కడ్ లో ఉన్న సరస్వతి దేవాలయం కూడా ప్రాచూర్యం చెందినది. ఈ దేవాలయాన్ని దక్షిణ మూకాంబికా దేవి దేవాలయం అని కూడా అంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యన జరిగే
సరస్వతి పూజ చాలా ప్రాచూర్యం చెందినది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. దాదాపు వెయ్యి ఏళ్లకు పూర్వ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.

పుష్కర్ లోని సరస్వతి దేవాలయం.

పుష్కర్ లోని సరస్వతి దేవాలయం.

P.C: You Tube

పుష్కర్ అన్న తక్షణం మనకు బ్రహ్మ దేవాలయమే గుర్తుకు వస్తుంది. అయితే రాజస్థాన్ లోని పుష్కర్ లో సరస్వతి దేవాలయం కూడా ఉంది. ప్రతి ఏడాది ఈ దేవాలయాన్ని కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. ఈ దేవాలయం భారతీయ శిల్ప కళకు ప్రత్యక్ష నిదర్శనం.

బిట్స్ పిలాని క్యాంపస్

బిట్స్ పిలాని క్యాంపస్

P.C: You Tube

రాజస్థాన్ లోని బిట్స్ పిలాని క్యాంపస్ లో సరస్వతి దేవి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని బిర్లా కుటుంబం నిర్మించింది. మొత్తం 70 స్తంభాలతో, భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా ఈ దేవాలయం నిర్మాణం కొనసాగింది. ఈ దేవాలయంలో గర్భగుడి, ప్రదక్షిణ మంటపం, అంతరాలం, ధ్యాన మంటపం, ఆరాధన మంటపం పేరుతో ఐదు భాగాలుగా ఈ దేవాలయం మొత్తం తెల్లటి మార్బల్ రాతి నిర్మాణం.

విద్యా సరస్వతి, వరంగల్

విద్యా సరస్వతి, వరంగల్

P.C: You Tube

హంసవాహనంతో కూడిన సర్వతిని తెలంగాణలోని వరంగల్ లో విద్యా సరస్వతి పేరుతో కొలుస్తున్నారు. కంచి శంకరమఠం ఈ దేవాలయం నిర్వహణను చూస్తోంది. ఈ దేవాలయానికి చుట్టూ విద్యాగణపతి, శనీశ్వర దేవాలయం తదితర దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో వేదాలను అభ్యసింపజేస్తారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఈ వేదాలను చదువుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X