Search
  • Follow NativePlanet
Share
» »దిఘ - సేదతీర్చే హాలిడే కేంద్రం !!

దిఘ - సేదతీర్చే హాలిడే కేంద్రం !!

By Mohammad

పర్యాటక స్థలం : దిఘ
రాష్ట్రం : పశ్చిమ బెంగాల్
సమీప నగరం : కోల్కత్త - 180 కి.మీ.

ఎన్నో ఏళ్ళుగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా, ఖరగపూర్, తీరం వెంబడి ఉన్న ఇతర చిన్న పట్టణాల వాసులకు దిఘ ఒక గొప్ప ప్రవేశద్వారంగా ఉంది. దిఘ పర్యాటక రంగ నిర్వాహకులు ఎంతో అభివృద్ది చెంది, బాగా పెద్దగా, చక్కగా ఉన్న అసలు బీచ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో జంట బీచిలను అభివృద్ది చేసారు. అసలు బీచిలా కాకుండా, హోటల్లు దూరంగా ఉండి, ట్రాఫిక్ ను చక్కగా నిర్వహించడం వలన శీతాకాలంలో దీనిపై పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల ప్రభావం పడలేదు.

న్యూ దిఘ బీచ్

న్యూ దిఘ బీచ్

చిత్రకృప : Biswarup Ganguly

సేదతీర్చే హాలిడే కేంద్రం

మధ్యాహ్నం వేళల్లో ఆనందించడానికి దిఘ బీచ్ ఒక గొప్ప ప్రదేశం. ఈ బీచిలోను, చుట్టూ ఉన్న అంగళ్ళు చక్కటి సీ ఫుడ్ ను అందించడానికి పేరొందాయి. దిఘ పర్యటన, వసతి సౌకర్యం, ప్రయాణం అన్ని కలిపి కొన్ని వేల రూపాయల కంటే ఎక్కువ కాదు. పాత బీచ్ నుండి కొత్త బీచి కు వెళ్లేదారి పొడవునా క్యాషురైన తోటలతో, ఉత్క౦ఠభరితమైన మహాసముద్రం దృశ్యాలను అందిస్తుంది. దిఘ కు దగ్గరగా పరమశివునికి చెందిన ఆలయం ఉంది.

ఉదయపూర్ బీచ్

ఇది దిఘ లోని అత్యంత ప్రసిద్ధ బీచిలలో ఒకటి. బహుశ ఈ ఆసక్తికరమైన బీచి విశిష్ట లక్షణం దీని సగ భాగం పశ్చిమ బెంగాల్ లో ఉండగా, మిగిలిన సగభాగం ఒరిస్సాలో ఉండటం అనే నిజం. క్షితిజానికి పైన పొడవుగా పెరిగిన క్యాషురైన తోటలు, తూర్పు కనుమల సహజ వాలులతో కలసి ఒక అద్భుతమైన దృశ్యాలను అందిస్తూ, ఈ ప్రాంతాన్ని దిఘలోనూ, చుట్టుపక్కల ఒక తప్పని సరిగా చూడవలసిన ప్రాంతంగా మార్చాయి.

అక్వేరియంలో గోల్డెన్ ఫిష్

అక్వేరియంలో గోల్డెన్ ఫిష్

చిత్రకృప : Adityamadhav83

మరైన్ అక్వేరియం

మధ్యాహ్న సమయాలను గడపడానికి పిల్లలకు ఎంతో మంచి ప్రదేశం. ఇది ఈ ప్రాంతంలోని అక్వేరియంలలో ఇది ఒక్కటే సమగ్రంగా పనిచేసే అక్వేరియం, నిరంతరం సముద్రపు నీరు ప్రవహించే వ్యవస్థను స్థాపించారు. ఇది ఏడాద౦తా సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. ఇక్కడ ఉన్న అనేక ప్రదర్శకాలు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచుతాయి.

మెరైన్ ప్రవేశం : ఉచితం

టైమింగ్స్ : మంగళవారం తప్ప ప్రతి రోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు తెరుస్తారు.

శంకరపూర్

మీకు చేపలు పట్టడం ఇష్టం అయితే, ఇంతకు ముందు ఈ అనుభవం ఉంటే, శంకరపూర్ మీరు వెళ్ళవలసిన ప్రాంతం. మత్స్యకారులు, తెల్లవారుజాముననే సముద్రంలోనికి వెళ్తారు. ఈ ప్రాంతంలోని మంచి చేపలలో కొన్ని శంకరపూర్ నుండి వస్తాయి. ఇది కేవలం దిఘ నుండి 166 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దిఘ గేట్

దిఘ గేట్

చిత్రకృప : Daschaitanya

దిఘలో షాపింగ్

బీచ్ లో మంచి భోజనం, చల్లటి పానీయాలు, చవకైన, సాంప్రదాయ, స్థానిక షాపింగ్ ను అందించే అనేక అంగళ్లు, దుకాణాలు ఉంటాయి. దిఘలో అన్ని వయసుల ప్రజల కోసం ఏదో ఒకటి ఉంది. ముందుగానే తెలిపినట్టుగా, సమగ్ర కారకాలు ఖర్చు, దూరం. మీరు మీ వారాంతాన్ని ఎలా గడపాలనుకొన్న, మీరు కోల్కతా, ఖరగ్పూర్ ల నుండి ఒక చిన్న ప్రవేశద్వారం కోసం చూస్తున్నట్లయితే, ఈ దిఘ కంటే మంచిది, సులువైనది ఏది లేదు.

ఇది కూడా చదవండి : సిలిగురి - ఈశాన్య భారతావనికి ముఖ్య ద్వారం !!

దిఘ ప్రదేశానికి చేరుకోవడం ఎలా ?

రోడ్డు మార్గం

దిఘ చేరుకోవటానికి కోల్కతా, ఖరగ్పూర్ నుండి రోజువారీ బస్సులు కలవు. కోల్కతా నుండి ఇక్కడికి చేరుకోవటానికి 5 గంటల సమయం పడుతుంది. దూరం : 182 కి.మీ.

రైలు మార్గం

దిఘలో రైల్వే స్టేషన్ ఉంది (టర్మినల్ రైల్వే స్టేషన్). హౌరా రైల్వే స్టేషన్ దిఘ కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్. స్టేషన్ బయట టాక్సీ లేదా ప్రభుత్వ బస్సులలో ఎక్కి దిఘ చేరుకోవచ్చు.

వాయు మార్గం

దిఘ కు సమీపాన 188 కి.మీ. ల దూరంలో కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు మాట్లాడుకొని దిఘ బీచ్ సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X