Search
 • Follow NativePlanet
Share
» » ఓ ఊహా ప్రపంచం.. డిస్నిల్యాండ్!

ఓ ఊహా ప్రపంచం.. డిస్నిల్యాండ్!

ఫాంటసీతో తయారైన ఓ అద్భుత ప్రపంచంలా కనిపిస్తుంది డిస్నిల్యాండ్. పిల్లలకయితే ఇక్కడ గడిపే ప్రతిక్షణం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందనే చెప్పాలి. ప్రపంచంలోని మొదటి డిస్నిల్యాండ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. అలాంటి వినూత్నమైన సందర్శనా ప్రాంతాన్ని గూర్చి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే కాలిఫోర్నియా డిస్నీల్యాండ్ గురించి తెలుసుకుందాం రండి!

ఒకసారి వాల్ట్ డిస్ని అతని ఇద్దరు కూతుళ్లని తీసుకుని ఓ పార్కుకు వెళ్లాడు. అక్కడున్న మిగతా పిల్లల్లా వాల్ట్ పిల్లలు అక్కడ ఎంజాయ్ చేయలేకపోయారు. ఆ పార్కులో వాళ్లు చాలా బోర్గా ఫీలయ్యారు. అప్పుడే వాల్ట్ మనసులో ఒక ఆలోచన మొదలైంది. పిల్లల కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్ఠించాలని అనుకున్నాడు. అందులో పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలూ వాటిని వీక్షించేందుకు వీలుగా ఉండాలని అనుకున్నాడు. అతడి ఆలోచన రూపమే ఈ డిస్నిల్యాండ్. అందుకే ఈ డిస్నిల్యాండ్ను వాల్ట్ డిస్నిల్యాండ్ అని కూడా అంటారు. దీన్ని 17 జులై 1955లో వాల్ట్డిస్ని రూపుదిద్దారు. డిస్నిలో అడుగుపెడితే తప్పక చూడాల్సినవి డిమిక్కి, మినీ హౌస్, దిపూ, గుఫీ, ఫ్లూటో, ఫ్రిన్సెస్ టియానా, టింకర్బెల్తో పాటు విభిన్న కళాకృతులు ఉన్నాయి. డిస్నిల్యాండ్లో మొదటగా విక్టోరియా కాలంనాటి అమెరికా అందాలు కనిపిస్తాయి.

ఎడ్వంచర్ ల్యాండ్

https://pixabay.com/images/search/disney%20land/

ఎడ్వంచర్ ల్యాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండియానా జోన్స్ టెంపుల్ ఆఫ్ ద ఫార్బిడెన్ ఐ, ఒక చెట్టుపై ఉన్న టార్జాన్ ఇల్లు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. పైరెట్స్ ఆఫ్ది కరేబియన్, మౌంటెడ్ మెంసన్ న్యూ అర్లియన్స్ స్నన్వయర్ సందర్శకులను ఎంతగానో ఆకర్శిస్తాయి. క్రింటర్ క్రంటీలో ఎలుగుబంట్లు పాటలు పాడుతూ, విన్యాసాలను చేస్తూ పర్యాటకులకు దర్శనమిస్తాయి. దీంతోపాటు స్పాష్ మౌంబెన్, డార్క్ రైడ్స్ ఇక్కడి అందాలను నాలుగుదిక్కులా ప్రకాశింపజేస్తాయి. ఫాంటెసీ ల్యాండ్ అదనపు ఆకర్షణ. దీన్ని స్వప్ననగరి అని కూడా పిలుస్తారు. డార్క్ రైడ్స్, చిల్డ్రన్ రైడ్స్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.

మిక్కీటున్ టౌన్

https://pixabay.com/images/search/disney%20land/

టీవిలో కనిపించే మిక్కిమౌస్, మిన్నిమౌస్ను మీరిక్కడ దారిపొడవునా చూడొచ్చు. నడుస్తూ, తిరుగుతూ కేరింతలు కొడుతూ ఉండే మిక్కి మౌస్లు సందర్శకులను స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి. మిక్కిటున్ టౌన్లో ఈ కార్టున్ క్యారెక్టర్ల ఇల్లు ఇక్కడే ఉన్నాయి. డిస్నిల్యాండ్ మీకు ఎప్పటికి గుర్తుండిపోవాలంటే మీకు ఇష్టమైన కార్టూన్ని కొనేయండి. అలాగే, టుమారో ల్యాండ్ ప్రాంతం పేరు వినగానే మనకు అర్థమవుతుంది. టుమారో ల్యాండ్ అంటే రేపటి రోజు అని. రేపటిరోజు అనే ఆలోచనతో ఒక పార్కును తయారు చేశారు. రేపటిరోజు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా! అలాంటి ఆలోచనలోంచి పుట్టిందే ఈ టుమారో ల్యాండ్.

ఫాస్ట్ పాస్

https://pixabay.com/images/search/disney%20land/

ఫాస్ట్ పాస్ అనేది ఒక మిషన్. ఇది మనకిష్టమైన రైడ్ కోసం పట్టే సమయాన్ని చెబుతుంది. ఈ మిషన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే, లైన్లో నిలబడి మరి రైడ్కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని చూసేటప్పుడు సహజంగా ఎవరికీ బోర్కొట్టడు. ఒకవేళ అలసిపోయినట్లు అనిపించినా అక్కడే సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఏదైనా షో కి వెళ్లి ప్రశాంతంగా కూర్చుని సినిమా చూసి అలసటను దూరం చేసుకోవచ్చు.

బెస్ట్ స్ట్రీట్ఫుడ్

https://pixabay.com/images/search/disney%20land/

బెస్ట్ స్ట్రీట్ఫుడ్డిస్నిల్యాండ్ తిరిగేటప్పుడు ఆకలేస్తే అక్కడ చాలా వెరైటీ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. కార్న్ డాగ్స్, మిక్కిబెనియబ్స్, పినట్బటర్ సాండ్విచ్, పినట్బటర్, హైండ్మెడ్క్యాండీకెస్, మేటర్హెస్, మ్యాకురున్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి. వాటి రుచులు తప్పక ఆస్వాదించాల్సిందే. ఫెవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి ఆటోగ్రాఫ్బుక్, అక్కడి స్పెషల్ మూవెంట్లను బంధించడానికి మీతోపాటు కెమెరాలను ఖచ్చితంగా తీసుకెళ్లండి. కెమెరాతో పాటు ఎక్స్ట్రా మెమరీ కార్డ్ మర్చిపోవద్దు.

  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X