» »గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన మర్రి వృక్షం ఎక్కడ వుందో మీకు తెలుసా?

గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన మర్రి వృక్షం ఎక్కడ వుందో మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

మర్రి ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.

త్రిమూర్తులు మర్రిచెట్టు మీద ఉంటారని హిందువుల నమ్మకం. ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలో అతిపెద్ద మర్రిచెట్టు. ఇది అనంతపూర్ జిల్లాలో కదిరి దగ్గర కదిరి నుండి 27 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర అటవీశాఖ సమాచారం ప్రకారం ఇది 570 సంవత్సరాల చెట్టు. దీనికి 1650 (ఊడలు) వ్రేళ్లు ఉన్నాయి.

తిమ్మమ్మ మర్రిమాను కదిరి పట్టణానికి 35 కి.మీ మరియు అనంతపురం నగరానికి 100 కి.మీ దూరంలో గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరాలు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.


గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కిన మర్రి వృక్షం

1. చరిత్ర

1. చరిత్ర

బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు.

చిత్రకృప: Abdulkaleem md

2. చరిత్ర

2. చరిత్ర

భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది.

చిత్రకృప:wikimedia.org

3. 660 సంవత్సరాల నిండిన మర్రి వృక్షం

3. 660 సంవత్సరాల నిండిన మర్రి వృక్షం

ఇది 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేశారు. 1355 వూడలతో మర్రిమాను ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి.

చిత్రకృప:Rahul O R

4. మర్రి మహావృక్షం

4. మర్రి మహావృక్షం

తిమ్మమాంబ ప్రాతివత్య మహిమకు తిమ్మమ్మ మర్రిమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు. 15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు.

చిత్రకృప:Güldem Üstün

5. మర్రి మహావృక్షం

5. మర్రి మహావృక్షం

తిమ్మమ్మ గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాల వీరనాయకుని వివాహం చేసుకుంటుంది. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. అయితే కుష్ఠువ్యాధిగ్రస్తుడైన వీరనాయకుణ్ణి గంగరాజు వెలివేస్తాడు.

చిత్రకృప:John Jennings

6.పాతివ్రత్య మహిమ

6.పాతివ్రత్య మహిమ

అప్పుడు వూరిబయట ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ. తన పాతివ్రత్య మహిమతో గంగరాజును శపిస్తుంది. ఫలితంగా వాళ్లా కోటను వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతారు.

చిత్రకృప:r0wb0t

7. పక్షుల కిలకిలరావాలు

7. పక్షుల కిలకిలరావాలు

ఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ మర్రి వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను చకితుల్ని చేస్తుంది.

చిత్రకృప:Robyn Jay

8. 1992లో అటవీ శాఖ

8. 1992లో అటవీ శాఖ

మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు.

చిత్రకృప:Moyan Brenn

9. కైవారం ట్రస్టు

ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు.

10. 1434 లో సతీ సహగమనం

10. 1434 లో సతీ సహగమనం

ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి వుంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప మరియు మంగమ్మ లకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది" అని చెక్కబడింది.

చిత్రకృప:Roger W

11. పిల్లలు లేని దంపతులు

11. పిల్లలు లేని దంపతులు

తిమ్మమ్మ సతీ సహగమనం చేసిన చోట మొలచబడ్డ మొక్క ఈరోజు ఇంత పెద్ద మర్రిమానుగా వృద్ధి చెందింది అని భక్తులు భావిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.

చిత్రకృప:Beth Scupham

12.తిమ్మమ మర్రిమాను వృక్షము

12.తిమ్మమ మర్రిమాను వృక్షము

తిమ్మమ మర్రిమాను వృక్షము పైన ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాకుండా సాయంత్రము ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టుపై ఉండవు. ప్రస్తుతము ఈ వృక్షపు మొదలువద్ద మరొక మొక్క మొదలు ఆయ్యింది.

చిత్రకృప:Roger W