» »యోగి వేమన జీవ సమాధి అయింది ఏ ఊరిలో మీకు తెలుసా?

యోగి వేమన జీవ సమాధి అయింది ఏ ఊరిలో మీకు తెలుసా?

By: Venkata Karunasri Nalluru

తెలుగువాడై పుట్టిన ప్రతి వాడు కూడా వేమన పద్యాన్ని పఠించనివాడు వుండడు అనేది సందేహం కానీ అతిశయోక్తి కానీ లేదుగా మరిప్పుడు మనం యోగి వేమన గురించి తెలుసుకుందాం. ఆయన పద్యాలు చదువుకోని తెలుగు విద్యార్థులుండరు. చదువురాని వారికి కూడా అలవోకగా ఆయన పద్యాలు కంటస్థం.

1789ప్రాంతంలో ఆయన తమ ఊరిలోనే జీవసమాధి అయ్యారన్నది అక్కడి వారి విశ్వాసం.దీనిపై చాలా అభ్యంతరాలున్నపటికీ వూరి జనం మాత్రం వేమనకి గుడి కట్టి ఆరాధిస్తున్నారు.ఇది యదార్ధం.

యోగి వేమన జీవ సమాధి అయింది ఏ ఊరిలో మీకు తెలుసా?

1. జీవన సత్యాలు

1. జీవన సత్యాలు

ఎన్నో జీవన సత్యాలను పద్యాలుగా మనకందించిన యోగి వేమన.వందల ఏళ్లనాడే అన్ని మతాల డాంబికాచారాలను,మూఢనమ్మకాలను కడిగిపారేసిన యోగులు కలకాలం పూజనీయులే.అలాంటి యోగికి గుడి కట్టి ఆరాధిస్తున్న వూరి గురించి తెలుసుకుందాం.

PC:youtube

2. వేమన గుడి

2. వేమన గుడి

అనంతపురం జిల్లా గాండ్ల పెంట మండలం కటారిపల్లి వాసులు వేమన గుడి నిర్మించారు.1789ప్రాంతంలో ఆయన తమ ఊరిలోనే జీవసమాధి అయ్యారన్నది అక్కడి వారి విశ్వాసం.దీనిపై చాలా అభ్యంతరాలున్నపటికీ వూరి జనం మాత్రం వేమనకి గుడి కట్టి ఆరాధిస్తున్నారు.ఇది యదార్ధం.

PC:youtube

3. జీవసమాధి

3. జీవసమాధి

వేమన వూరిలో జీవసమాధి పొందటం ఇక్కడి వారు గౌరవంగా భావిస్తుంటారు.అందుకే కటారు పల్లిలో దాదాపుగా ప్రతి ఇంటిలో ఒక్కరికైనా వేమన పేరుపెట్టుకుని అభిమానాన్ని చాటుకుంటారు.

PC:youtube

4. పద్యాలు

4. పద్యాలు

ఆలయ ప్రాంగణంలోని భవన ప్రాకారాలలో 150కి పైగా వేమన పద్యాలు చెక్కారు.వాటిలో మనకు తెలియనివి చాలా పద్యాలుంటాయి.

PC:youtube

5. సజీవసమాధి

5. సజీవసమాధి

కదిరికి 15 కి.మీ ల దూరంలో వున్న మండల కేంద్రం నల్ల చెరువులో కూడా వేమనకు మరో ఆలయం వుంది.కటారుపల్లిలో సజీవసమాధి అయినతర్వాత లేచి ఆయన ఇక్కడ వెళ్ళినట్లు నమ్మకం.

PC:youtube

6. వేమన భావాలు

6. వేమన భావాలు

అందుకే అక్కడ గుడికట్టినట్లు చెబుతారు.బెంగుళూరుకు చెందిన నారాయణరెడ్డి వేమన భావాలు ప్రజలకు దగ్గర చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు.

PC:youtube

7. యోగివేమన ఆశ్రమం

7. యోగివేమన ఆశ్రమం

అందులోభాగంగా బెంగుళూరులోనూ, కటారుపల్లి గ్రామంలో కూడా యోగివేమన ఆశ్రమం నిర్మించారు.దీనికి విశ్వవేమన కొండ అని నామకరణం చేశారు.వేమన జీవిత చరిత్ర పుస్తకాలు, పద్యాల సిడీలని ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో వుంచారు. ఇక వేమన గుడికి సమీపంలో వున్న తిమ్మన మర్రి మాను చూడటానికి సందర్శకులు వస్తుంటారు.కదిరి శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శించుకొనటానికి పుతపర్తికి వచ్చే భక్తులు,పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఆ సమాఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఆ ఊరిపై దృష్టి సారించింది.

PC:youtube

Please Wait while comments are loading...