» »1000 సంవత్సరాల ఈ గుడిలో వున్న మిస్టరీ వింతలు మీకు తెలుసా?

1000 సంవత్సరాల ఈ గుడిలో వున్న మిస్టరీ వింతలు మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

ఆదిపత్య శివలింగం కొలువైన గుడి.దేశంలోనే అతిపెద్ద దేవాలయం.అంతేకాదు ఆశ్చర్యపోయే చాలా విశేషాలున్న దేవాలయం.అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. 1000సంవత్సరాలనాటి గుడి అది. అక్కడ కనిపించే ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎక్కడా సిమెంట్ లేదు.ఉక్కన్న మాటకు తావులేకుండా, ఉక్కనే పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా వుందా అనిపిస్తుంది.ఆశ్చర్యంతో పాటు ఆశక్తిని రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు.

13 అంతస్తులు కల్గిన ఏకైక పురాతన క్షేత్రం ఇది.దాదాపు 1000సంవత్సరాలక్రితం కట్టిన గుడి అంతేకాదు 13 అంతస్తులు కల్గిన ఏకైక పురాతన క్షేత్రం పురాతన క్షేత్రం.భారతదేశంలో అతిపెద్ద శివలింగం వున్న క్షేత్రం,దక్షిణ కాశీగా పేరొందింది.ఇక శివలింగం ఎత్తెంతుంటుందో తెలుసా?దాదాపు 3.7 మీటర్ల ఎత్తు కలిగివుంటుంది.శివలింగం మాత్రమే కాదు నంది విగ్రహం కూడా భారీస్థాయిలో వుంటుంది.విగ్రహం బరువే దాదాపు 20టన్నులు కలిగివుంటుంది.ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇది ఏకశిల విగ్రహం.

1000 సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

ఇది కూడా చదవండి: వెయ్యేండ్ల ఆ గుడిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు !

1. 13 అంతస్తుల గ్రానైట్ రాయి

1. 13 అంతస్తుల గ్రానైట్ రాయి

1. 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగివుంటుంది.ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు.పూర్తిగా గ్రానైట్ రాయితోనే కట్టారీ గుడిని.13 అంతస్తుల గ్రానైట్ రాయితో కట్టారంటే ఆనాటి టెక్నాలజీ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 80టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలైట్ అని చెప్పాలి.

pc:Arian Zwegers

2. గోపురం నీడ

2. గోపురం నీడ

13అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబట్టం అనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మిట్టమధ్యాహ్న సమయాన ఆ గోపురం నీడ ఎక్కడా పడదు.గుడి నీడ కనపడ్డా గోపురం నీడ మాత్రం చూడలేం.

pc:Jean-Pierre Dalbéra

 3.శభ్ధ పరిజ్ఞానం

3.శభ్ధ పరిజ్ఞానం

80టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికి ఎలా తీసుకెళ్ళారనేది అప్పటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.ఈ ఆలయప్రాంగణం దాదాపు ఫర్లాంగు దూరం వుంటుంది.అంటే చాలా విశాలంగా వుంటుంది.ఎక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు ప్రతిధ్వనించవు.అంటే అంత శభ్ధ పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు.

pc:PRORaj

4. టెక్నాలజీ

4. టెక్నాలజీ

ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు వున్నాయి.ఇవి తంజావూరులో వున్న కొన్ని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులున్నాయట.అందుకే అన్ని దారులని మూసేశారు.అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయమేమిటంటే ఈ గుడికి చుట్టూ వున్న రాతి తోరణాలలో 6మిల్లీ మీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించటం. అలా ఎందుకు పెట్టారనేది ఇప్పటికికూడా మిస్టరీయే.

pc:Varun Shiv Kapur

5. 1000 సంవత్సరాల గుడులు

5. 1000 సంవత్సరాల గుడులు

ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. 1000 సంవత్సరాల గుడులు దాదాపు పాడుపడిన స్థితిలో వుంటాయి.అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం !

pc:Varun Shiv Kapur

6. తంజావూర్ కు ఎలా వెళ్ళాలి?

6. తంజావూర్ కు ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం తంజావూర్ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం.. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తంజావూర్ కి 56 కి. మీ. దూరంలో ఉంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ పట్టణం, విజయవాడ తదితర నగరాల నుంచి నిత్యం ఇక్కడికి విమానాలు తిరుగుతూనే ఉంటాయి. రైల్వే స్టేషన్ తంజావూర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఒక ప్రధాన రైల్వే జంక్షన్ గా తీర్చిదిద్దబడినది. ఇక్కడికి నిత్యం రైళ్లు పరుగెడుతూనే ఉంటాయి. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.

pc:Varun Shiv Kapur

7. రోడ్డు సదుపాయం

7. రోడ్డు సదుపాయం

రోడ్డు సదుపాయం తంజావూర్ కి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. దగ్గరలోని తిరుచిరాపల్లి నుంచి నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. చెన్నై, మధురై తదితర ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. జల మార్గం తంజావూర్ కి దగ్గరలోని ఓడరేవు నాగపట్నం ఓడరేవు. ఇది తంజావూర్ కి 84 కి. మీ. దూరంలో తూర్పు వైపున ఉన్నది. అంతేకాక కరైకల్ ఓడరేవు నుంచి కూడా తంజావూర్ కి చేరుకోవచ్చు. ఇది కూడా సుమారుగా 94 కి. మీ. దూరంలో ఉన్నది.

ఇది కూడా చదవండి: బ్రిహదీస్వర దేవాలయం - చోళ రాజుల కీర్తి ప్రతిష్టల వైభవం!

pc:PROVarun Shiv Kapur