» »సీత పుట్టిన ఊరు ఎక్కడ ఉందో మీకు తెలుసా?

సీత పుట్టిన ఊరు ఎక్కడ ఉందో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

LATEST: డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఉదయంపూట బాలికగా సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూవుండే దేవీ విగ్రహం ఎక్కడ వుందో తెలుసా?

సీత పుట్టిన ఊరు ఎక్కడో చెబుతారా? అది మన దేశంలోనే ఉందా? సీతమ్మ పుట్టిన వూరు సీతమర్హి. ఇది మన బీహార్ రాష్ట్రంలో వుంది.

సీత + మహి సీతామాఢి అయింది. నాగలి చివరిభాగాన్ని సంస్కృతంలో సీత అంటారు. నాగలి చాలులో దొరికింది గనక ఆమె సీత అయింది.

నేషనల్ హైవేలో ముజుఫర్ పూర్ కు ఉత్తరంగా సీతమర్హి. వుంది. ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో పునౌరా అనే స్థలం వుంది. సీతాదేవి పసిపాపగా దొరికిన స్థలం ఇదే.

సీతాదేవి

సీతాదేవి

జనకమహారాజు పొలాన్ని ఎన్ని వరసలు దున్నాడో, ఎన్నో వరసలో సీతాదేవి లభించిందో ఇక్కడ మహత్తు చక్కగా వర్ణించి చెబుతారు.

PC:youtube

జనకపురి

జనకపురి

ఆ పాపను జనకుడు తన శిబిరంలో ఆరు రోజులుంచి తర్వాత జనకపురికి తీసుకువెళ్ళాడట.

PC:youtube

సీతమర్హి

సీతమర్హి

సీతమర్హి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్న జనకపురికి ఇప్పుడు నేపాల్ లో వుంది.

PC:youtube

చూడముచ్చట

చూడముచ్చట

జనకపురిలో జానకీమందిరం చూడముచ్చటగా వుంటుంది.

PC:youtube

విశాల ఆలయం

విశాల ఆలయం

ఈ విశాల ఆలయంలో జానకీదేవి, రాముడు, లక్ష్మణుడు దర్శనీయంగా వుంటారు.

PC:youtube

సీత పుట్టిన ఊరు

సీత పుట్టిన ఊరు

ఆ ప్రక్కన జానకీ తల్లిదండ్రులు, జనకుడు, సదానందుడు మున్నగు పురోహితుల విగ్రహాలు వున్నాయి.

PC:youtube

రంగభూమి

రంగభూమి

రాముడు శివధనుర్భాగం చేసిన స్థలాన్ని రంగభూమి అంటారు. ఇప్పుడిది ఒక పెద్ద మైదానం.

PC:youtube

రత్నసాగర మందిరం

రత్నసాగర మందిరం

సీతారాముల వివాహం రత్నసాగర మందిరం ఆలయం దగ్గరలోనే వుంది.

PC:youtube

శ్రీరామనవమి ఉత్సవాలు

శ్రీరామనవమి ఉత్సవాలు

విశేషమేమిటంటే సీతమర్హి. అన్న పేరే అధికంగా వినిపిస్తే, జనకపురిలో జానకి అనే పేరే వినిపిస్తుంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చేస్తారు.

PC:youtube

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

జాతీయ రహదారి 77 ఈ ప్రాంతాన్ని ముజఫర్పూర్ జిల్లా మరియు పాట్నాకు దక్షిణాన కలుపుతుంది. సీతమర్హికి సమీపంలోని జిల్లాలకు రహదారి కనెక్షన్లు ఉన్నాయి.
వీటిలో ప్రధాన ఉదాహరణలు జాతీయ రహదారి 77 మరియు జాతీయ రహదారి 104.

PC:google maps