Search
  • Follow NativePlanet
Share
» »విజయవాడ టు కొండపల్లి.. ప్రయాణపు ముచ్చట్లు

విజయవాడ టు కొండపల్లి.. ప్రయాణపు ముచ్చట్లు

''అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఎత్తయిన కొండమీద ఓ పే...ద్ద రాజకోట. ఆ కోట చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది.'' అంటూ చిన్నతనంలో అమ్మ చెప్పిన రాజుల కథలు ఎంతమందికి గుర్తున్నాయి. మరి ఆ కథలో అమ్మ చెప్పిన అలాంటి కోటను నిజంగా చూడాలని ఉందా? అయితే పదండి! కొండకోనల నడుమ శిథిలాల మాటున దాగి ఉన్న ఒకప్పటి కొండపల్లి ఖిల్లాను చుట్టేద్దాం. అక్కడున్న అద్భుత కళాకృతుల సజీవ చరిత్రను తెలుసుకుందాం.

మా ఆశలు ఆవిరయ్యాయి:

https://www.google.co.in/search?q=Vijayawada,+Kondapalli,+Bhavani+Island+native+planet&dcr=0&sxsrf=ALiCzsbUtFrCnWIMap4SzJkYnwK140ZhBg:1655525761573&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwj7lb2Hkrb4AhVCTGwGHc8TD9wQ_AUoA3oECAIQBQ&biw=1538&bih=722&dpr=1.25#imgrc=lUSzWApQuMaViM

విజయవాడకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపల్లి ఖిల్లా. అదే ఈ రోజు మనం చేరాల్సిన గమ్యస్థానం. ఉదయం తొమ్మిదిగంటలకు ప్రయాణం మొదలుపెట్టాం. కృష్ణానదీ తీరం నుండి దుర్గగుడి మీదుగా వెళ్ళాలి. నది మధ్యలో పచ్చని ప్రకృతి అందాలతో కనిపించే భవానీ ద్వీపపు సోయగాలను కనులారా ఆస్వాదించాలి. ఇదీ మా మొదటి ప్రణాళిక. అలా మనసులో అనుకుని గుడి దగ్గరకు వెళ్ళామో, లేదో! 'ఈ రోజు ఫ్లై ఓవర్పై వాహనాలకు అనుమతి లేదు' అంటూ ఓ పెద్ద బోర్డు కనిపించింది. ఆ బోర్డు చూడగానే మా ఆశలు ఆవిరయ్యాయి. చేసేదిలేక, బోర్డులో సూచించిన మార్గంలోనే వెళ్ళాం. అలా బ్రాహ్మణవీధి, చిట్టినగర్ చేరుకున్నాం. పూలపొదలు అల్లుకున్నట్లు కొండకు ఇరువైపులా కనిపిస్తున్నాయి అక్కడి నివాసాలు. అంతేకాదండోరు! కొండను తొలచి నిర్మించిన సొరంగమార్గం భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడి నుండి ఐదు నిమిషాలు ముందుకు సాగగానే హైవే రోడ్డు ప్రత్యక్షమయ్యింది. 'హమ్మయ్యా! ఈ మాయదారి ట్రాఫిక్లో ఇంతసేపూ ఊపిరి బిగబట్టి చేసిన ప్రయాణానికి ఓ నమస్కారం' అని మనసులో అనుకున్నాం.

ఫెర్రీ పేరు పేపర్లో వినడమే తప్ప:

https://www.google.co.in/search?q=Vijayawada,+Kondapalli,+Bhavani+Island+native+planet&dcr=0&sxsrf=ALiCzsbUtFrCnWIMap4SzJkYnwK140ZhBg:1655525761573&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwj7lb2Hkrb4AhVCTGwGHc8TD9wQ_AUoA3oECAIQBQ&biw=1538&bih=722&dpr=1.25#imgrc=lUSzWApQuMaViM

హైవే రోడ్డుపై గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా హాయిగా ముందుకుసాగాం. దారిపొడవునా భారీ వాహనాల స్పీడు చూసి, మమ్మల్ని భయపెట్టేలా ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపించింది. అలా ఓ ఇరవై కిలోమీటర్లు ముందుకు వెళ్ళాం. ఇబ్రహీంపట్నం జంక్షన్ ఎదురైంది. మా రోడ్డు మార్గంలో ఖిల్లాకు సంబంధించిన ఎలాంటి బోర్డూ కనిపించలేదు. దారి తెలియకపోవడంతో చెట్టుకింద కూర్చున్న ఓ పెద్దాయన దగ్గరకు వెళ్ళాం. 'ఖిల్లాకు వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి?' అని అడిగాం. 'ఇలా నేరుగా మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్ళాలి' అని చెప్పాడు ఆ పెద్దాయన. ఆయన చూపించిన మార్గంలోనే బయలుదేరాం. అంతలో ఆ పెద్దాయన 'ఏందబ్బాయిలూ! అంతదూరం వెళుతున్నారుగా! పక్కనే ఉన్న పడవల రేవు(ఫెర్రీ) చూడకుండా బోతున్నారే..?' అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఫెర్రీ, ఈ పేరు పేపర్లో వినడం తప్ప నేరుగా ఎప్పుడూ చూడలేదు. పక్కనే అన్నారు కదా! అని అటువైపుగా అడుగులు వేశాం.

కుటుంబ సమేతంగా సాయంత్ర సమయంలో:

https://www.google.co.in/search?q=Vijayawada,+Kondapalli,+Bhavani+Island+native+planet&dcr=0&sxsrf=ALiCzsbUtFrCnWIMap4SzJkYnwK140ZhBg:1655525761573&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwj7lb2Hkrb4AhVCTGwGHc8TD9wQ_AUoA3oECAIQBQ&biw=1538&bih=722&dpr=1.25#imgrc=lUSzWApQuMaViM

పరిశుభ్రమైన సీసీ రోడ్డులో ప్రశాంతమైన వాతావరణం. అలా ఓ కిలోమీటర్ లోపలకు వెళ్ళాం. పచ్చని చెట్లమధ్య నిండుకుండలా కనిపిస్తున్న కృష్ణానది ఎదురైంది. ఆప్యాయంగా పలకరిస్తూ వెళుతున్న చిన్న కెరటాలపై సేదదీరుతున్నట్లు పదుల సంఖ్యలో ఉన్న మరబోట్లు కనువిందు చేశాయి. ఇక్కడ వారాంతాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పటిష్టంగా నిర్మించిన ఈ ఘాట్ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్పీడ్ బోట్, సింగల్ బోట్, స్లో బోట్ ఇలా వివిధ రకాల బోట్లు అందుబాటులో ఉన్నాయి. బోటు ప్రయాణం చేయాలనుకునేవారికోసం లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. కుటుంబ సమేతంగా సాయంత్ర సమయంలో ప్రశాంతంగా గడిపేందుకు ఫెర్రీ ఓ అనువైన ప్రదేశమనే చెప్పాలి. ఓవైపు కృష్ణానది అందాలు.. మరోవైపు పచ్చని పచ్చికబైళ్లు ఆ అందాలను ఆస్వాదించేందుకు రెండు కళ్లూ సరిపోలేదు. ఈ కాంక్రీట్ నగరానికి అనుకుని ఉన్న ఇంతటి ప్రకృతి రమణీయతను కనులారా చూడటం మా అదృష్టంగా భావించాం. సమయం లేకపోవడంతో మా గమ్యస్థానం కొండపల్లికి పయణమయ్యాం. ఆ ముచ్చట్లు రెండోభాగంలో..!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X