Search
  • Follow NativePlanet
Share
» »బిహార్‌లోని మహాత్మా గాంధీ సేతును చూశారా?

బిహార్‌లోని మహాత్మా గాంధీ సేతును చూశారా?

భారత దేశం గురించి చెప్పాలంటే చెప్పలేనన్ని విశేషాలు ఉన్నాయి. మన దేశం ఒక సమ్మీలిత సాగరం. ఈ దేశంలో ఎవ్వరైనా జీవించవచ్చు, దేశం మొత్తం మీద ఎక్కడైనా తిరగేయొచ్చు. ఇక్కడ లెక్కలెన్ని అనుభూతులు అనుభవించవచ్చు.

మీరే చెప్పండి ..! ఉదాహరణకి ఈఫిల్ టవర్ చూస్తే మీరేమంటారు ?? అబ్బో ఎంత ఎత్తుగా ఉందో అని అంటారా? లేదా?, అలాగే మన రాష్ట్రం లో ఉన్న శ్రీశైలం డ్యామ్ ని చూస్తే ఎంత లోతైనదో అని, నాగార్జున సాగర్ ని చూస్తే ఎంత పొడవైనదో అని అంటుంటాము. ఇలాగే మన భారత దేశంలో కూడా చెప్పుకుంటూ పోతే లోతైనవి, పొడవైనవి, పెద్దవి ... ఇలా ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో హాజీపూర్ లోని మహాత్మాగాంధీ సేతు ఒకటి. మరి దీని గురించి ఒకసారి తెలుసుకుందామా ..

నోరూరించే లిచ్చీ, అరటి పండ్లకు బాగా ప్రసిద్ధి

హాజీపూర్ – అద్భుతమైన ఆనందకర ప్రదేశం! హాజీపూర్ పట్టణం, బీహార్ జిల్లాలోని వైశాలి కి ప్రధాన కార్యాలయం, ఇది ఔదార్యం కలిగిన అరటిపండ్ల ఉత్పత్తికి పేరుగాంచింది. ఈ ప్రదేశం నోరూరించే లిచ్చీ, అరటి పండ్లకు బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ పట్టణం బీహార్ లోని అభివృద్ది చెందిన పట్టణాలలో ఒకటిగా చెప్పబడుతుంది. హాజీపూర్ పర్యటన పర్యాటకుల మాప్ లో కోరుకున్న గమ్య స్థానాలలో ఒకటి.

గంగానది హాజీపూర్ పర్యటనకు నిజమైన అందాన్ని తెచ్చిపెట్టింది.

గంగానది హాజీపూర్ పర్యటనకు నిజమైన అందాన్ని తెచ్చిపెట్టింది.

బెంగాల్ రాజు హాజీ ఇయాస్ శహ్ హాజీపూర్ ను కనుగొన్నాడు. ప్రాచీన కాలంలో ఈ నగరాన్ని ఉక్కకల అని పిలిచేవారని నమ్మకం. ఈ పట్టణంలో నాగరిక రైల్వే జోనల్ కార్యాలయం ఉంది. పశ్చిమాన గండక్ నది, దక్షిణాన నారాయణాద్రి లతో చుట్టబడి ఉన్న అతిశయమైన గంగానది హాజీపూర్ పర్యటనకు నిజమైన అందాన్ని తెచ్చిపెట్టింది.

హాజీపూర్ ప్రముఖ పర్యాటక ప్రదేశాలు

హాజీపూర్ ప్రముఖ పర్యాటక ప్రదేశాలు

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే హాజీపూర్ పర్యటన అపారమైన గొప్పతనంతో, అద్భుతమైన ఆలయాలను కలిగిఉంది. రా౦చౌర మందిర౦, కున్ హార ఘాట్, నేపాలీ మందిరం, మహాత్మాగాంధీ సేతు, హేలబజర్ వద్ద మహా ప్రభుజి భైటక్ జి, సోనెపూర్ ఉత్సవం, వైశాలి మహోత్సవం వంటి ఎన్నో ప్రసిద్ధ ఆకర్షణలతో ఈ నగరం సందర్శనకు అద్భుతమైన ప్రదేశంగా పేరొందినది.

మహాత్మా గాంధీ సేతు

మహాత్మా గాంధీ సేతు

గంగా నదిపై ఒక వంతెన "హోలీస్ట్ రివర్" అనేది భారతదేశంలో అతి పొడవైన నది వంతెన. మహాత్మా గాంధీ సేతు 5.575 కి.మీ. పొడవు, 25 m (82 ft)వెడల్పు కలిగి ఉంది మరియు ప్రపంచంలో అతి పొడవైన సింగిల్ నది వంతెనలలో ఒకటి, పాట్నాను బీహార్, హజీపూర్ తో కలుపుతుంది. ఉత్తర బీహార్ రాష్ట్రంలోని గంగానదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి.. పాట్నా- హాజీపూర్ ప్రాంతాలను కలుపుతుంది. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన. 1982లో ఆవిష్కరించిన ఈ బ్రిడ్జి పొడవు 5,575 మీటర్లు. 48 స్తంభాలచే ఆధారపడి ఉంది.దీనిని వేలాది మంది ప్రజలు సందర్శించారు.

ఇండియాలో కెల్ల పొడవైన రోడ్డు బ్రిడ్జ్ ఎవరు నిర్మించారు

ఇండియాలో కెల్ల పొడవైన రోడ్డు బ్రిడ్జ్ ఎవరు నిర్మించారు

ఇండియాలో కెల్ల పొడవైన రోడ్డు బ్రిడ్జ్ మహాత్మా గాంధీ సేతు. సేతు అంటే వారధి, వంతెన మరియు బ్రిడ్జ్ అని అర్థం. కాంక్రీటు, స్టీలుతో నిర్మించిన గిడ్డార్ బ్రిడ్జ్ ఇది. ఈ రోడ్డు వంతెన బీహార్ రాష్ట్రంలో ప్రవహించే గంగా నది మీద, పాట్నా మరియు హజిపూర్ మధ్య నిర్మించినారు. ఈ వంతెన ఈ ప్రాంత మొత్తంలో వేగవంతమైన రవాణాకు, మంచి రద్దీ నిర్వహణకు ఒక ఆస్థి. దీనిని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించింది. ఈ వంతనెను నిర్మించిన వారు గామన్ ఇండియా లిమిటెడ్.

Photo Courtesy: Chandravir Singh

సందర్శించే సమయం:

సందర్శించే సమయం:

ఈ నగరాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సమయం. సెలవులు గడపాలని కోరుకునే వారికి ఇది సరైన ప్రదేశం. వివిధ రకాలుగా ఆనందాలను అందించే ఈ నగరంలో మీరు చాలా సమయం గడపవచ్చు. సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

ఇది కేవలం మూడు రకాల రవాణా సౌకర్యం మాత్రమే కాదు..4 రకాలుగా అనుసంధానించబడినది

రైల్వే కనెక్టివిటీ అద్భుతమైనది మరియు నగరంలో సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది.

పాట్నా విమానాశ్రయం రహదారి ద్వారా నగరానికి బాగా అనుసంధానించబడి ఉంది.

అదనంగా, నగరం యొక్క సముద్ర రవాణా వ్యవస్థ పట్టణ రవాణా వ్యవస్థకు ఒక వజ్ర కిరీటం.

ఈ నగరం దేశంలోని మిగిలిన ప్రాంతాలకు జాతీయ మరియు రాష్ట్ర రహదారుల ద్వారా అనుసంధానించబడి ఉంది. ఇది హజీపూర్ నుండి పాట్నా మరియు సోనేపూర్ వరకు నిర్మించిన వంతెన ద్వారా నదికి అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X