» »తలరాత మార్చే బ్రహ్మ దేవుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

తలరాత మార్చే బ్రహ్మ దేవుని ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?

Posted By: Venkata Karunasri Nalluru

ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్ని దేవస్థానాలకు వెళ్ళినా మా తల రాత మారట్లేదు, మా జీవితంలో ఇంక వెలుగు రాదా? అని బాధపడుతున్నవారు ఎవరైనా సరే తిరుపత్తూరులోని శ్రీ బ్రహ్మపురేశ్వర ఆలయంకు తప్పకుండా వెళ్ళాలి.

తిరుపత్తూరు తిరిచ్చి నుంచి 30కి.మీ ల దూరంలో వుంది. సమయపురం నుంచి 10 కి.మీ ల దూరంలో వుంది. బ్రహ్మపురేశ్వర ఆలయం అంటే బ్రహ్మే ఈశ్వరుని పూజించినాడు కనుక బ్రహ్మపురేశ్వర ఆలయం అని పేరు వచ్చింది.

తలరాత మార్చే బ్రహ్మ దేవుని ఆలయం

1. ఆలయ చరిత్ర

1. ఆలయ చరిత్ర

బ్రహ్మ తనకి తానే సృష్టికర్తనని, ప్రపంచంలో వున్న అన్ని జీవరాసులను తానే సృష్టిస్తున్నాడని గర్వంతోనున్నప్పుడు శివుని ద్వారా తన ఐదవ తలను పోగొట్టుకోవటం జరిగింది. అలాగే సృష్టించగల శక్తులను కూడా పోగొట్టుకోవటం జరిగింది.

PC: youtube

2. ఆలయ చరిత్ర

2. ఆలయ చరిత్ర

అప్పుడు తన యొక్క తప్పును తెలుసుకుని ఎన్నో చోట్ల తిరుగుతూ సూర్యభగవానుడుని ప్రార్థించటం జరిగింది. ఆ ప్రార్థనలలో భాగంగా ఈ తిరుపత్తూరు వచ్చి అక్కడ స్వయంభూగా వెలసిన శివలింగాన్ని ప్రార్థించటం జరిగింది.

PC: Jagadeeswarann99

3. బ్రహ్మతీర్థం

3. బ్రహ్మతీర్థం

అంతేకాకుండా దగ్గరలో వున్న కోనేరు నుంచి నీళ్ళు తీసుకునివచ్చి అభిషేకించుట జరిగింది. అందువలన ఈ తీర్థాన్ని బ్రహ్మతీర్థం అంటారు.

PC: Jagadeeswarann99

4. బ్రహ్మపురేశ్వరుడు

4. బ్రహ్మపురేశ్వరుడు

ఈ విధంగా తను పూజించిన తర్వాత బ్రహ్మదేవుని ప్రార్థనలను మెచ్చుకున్న శివుడు అమ్మవారుతో సహా ఇక్కడ దర్శనమిచ్చి తనని తన యొక్క పాపవిముక్తి గావించి అలాగే మరలా సృష్టించగల శక్తులను బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించటం జరిగినది. అందువలన ఇక్కడ శివుడ్ని బ్రహ్మపురేశ్వరునిగా పిలవబడటం జరుగుతుంది.

PC: Gayathrie pk

5. బాధలన్నీ తొలగిపోతాయి

5. బాధలన్నీ తొలగిపోతాయి

అలా బ్రహ్మపురేశ్వరుడిని ప్రార్థించి బ్రహ్మ సొంతగా తన తలరాతను తాను మార్చుకున్నాడు. అందువలన ఇక్కడ శివుడు బ్రహ్మకి ఒక వరం ఇవ్వటం జరిగినది. ఆ వరం ఏమిటంటే ఎవరైతే తన తలరాత బాగోలేదని బాధపడుతుంటారో వాళ్ళు వచ్చి దర్శించినట్లయితే వాళ్ళ బాధలన్నీ తొలగిపోతాయి అలాగే వాళ్ళ తలరాత కూడా మారుతుందని స్థల పురాణంలో చెప్పబడినది.

PC:youtube

6. జీవితంలో టర్నింగ్ పాయింట్

6. జీవితంలో టర్నింగ్ పాయింట్

కాబట్టి ఎవరైతే వాళ్ళ తలరాత మారాలనుకుంటున్నారో, వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ రావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించాలి.

PC:youtube

7. దేవీ బ్రహ్మ సంపత్ గౌరి

7. దేవీ బ్రహ్మ సంపత్ గౌరి

ఇక్కడ అమ్మవారు బ్రహ్మని అనుగ్రహించినందువలన 'దేవీ బ్రహ్మ సంపత్ గౌరి' గా పిలవబడుతున్నారు. ఇక్కడ బ్రహ్మ తామర పుష్పంలో పద్మాసనాసీనుడై వున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో పసుపుతో అలంకరించబడి వుంటుంది.

PC:youtube

8. యోగాలో రాణింపు

8. యోగాలో రాణింపు

ఎవరైనా బ్రహ్మకు అభిషేకం చేయాలని కోరుకుంటారో వారు తప్పకుండా ఉదయం ఎనిమిది గంటలలోపే ఆలయానికి చేరుకోవాలి. ఆరు గంటలలోపే వెళ్తే ఎవరైతే యోగాలో రాణించాలనుకుంటున్నారో వారందరూ గురువారం రోజు తప్పకుండా దర్శించాలి.

PC:youtube

9. ఫాదర్ అఫ్ యోగా

9. ఫాదర్ అఫ్ యోగా

ఈ దేవాలయం ప్రక్కనే మహర్షి పతంజలివారి జీవసమాధిని చూడవచ్చును. పతంజలిగారు యోగసూత్రాలను రచించారు. అంతేకాకుండా వారిని "ఫాదర్ అఫ్ యోగా"గా పిలుస్తారు.

PC:youtube

10. జీవసమాధి

10. జీవసమాధి

పతంజలిగారు సాక్షాత్తూ ఆదిశేషుని అవతారంగా చెప్పబడుతారు. అందువలన ఎవరైనా సరే యోగ గురించి తెలుసుకోవాలనుకుంటే వారు పతంజలి యొక్క జీవసమాధి ముందు ఐదు నిముషాలు మెడిటేషన్ చేయటం ద్వారా ఆ అనుభూతిని గ్రహిస్తారు.

PC:youtube

11. తిరుపత్తూరు దగ్గర చూడవలసినవి

11. తిరుపత్తూరు దగ్గర చూడవలసినవి

కాశీవిశ్వనాథ్ ఆలయం: తిరుపత్తూరు దగ్గరలో ఒక అర కి.మీ దూరంలో వున్న కాశీవిశ్వనాథ్ ఆలయం వున్నది. ఈ ఆలయంలో రేగరపద మహర్షివారి జీవసమాధిని కూడా దర్శించుకోవచ్చును.

PC:youtube

12. భిక్షనాగర్ కోయిల్

12. భిక్షనాగర్ కోయిల్

భిక్షనాగర్ కోయిల్ ప్రాధాన్యత ఏమిటంటే ఎవరైతే ఆకలిబాధలు పడుతున్నవారికి, జీవితాంతం వారికి ఆకలిబాధలు లేకుండా, తిండికి లోటు లేకుండా వుండాలని కోరుకునేవారు దర్శించవచ్చును.

PC:youtube

13. తిరుకండియూర్

13. తిరుకండియూర్

ఈ ఆలయం పాపనివృత్తి ఆలయంగా చెప్పబడుతున్నది.

సమయపురం మారియమ్మవారి ఆలయం: ఈ ఆలయం తమిళనాడులోనే అతి పెద్ద ఆలయం.

PC:youtube

14. శ్రీరంగం రంగనాథస్వామివారి ఆలయం

14. శ్రీరంగం రంగనాథస్వామివారి ఆలయం

ఈ క్షేత్రం 108 దివ్యక్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా చెప్పబడుతున్నది.

తిరునైకావల్ ఆలయం: ఈ ఆలయంలో పంచభూత లింగాలలో ఒక్కటైన జలలింగాన్ని దర్శించుకోవచ్చును.

PC:youtube

15. ఒరయూరు

15. ఒరయూరు

ఈ ఆలయంలో వెక్కాళి అమ్మన్ ను దర్శించుకోవచ్చును.

గునశీలం: ఈ ఆలయంలో ప్రసన్న వేంకటాచలపతి కొలువైవున్నారు. ఏవరైతే భూతప్రేత పిశాచాలతో బాధపడుతున్నట్లయితే వాటి నుంచి బయటపడాలనుకుంటే అటువంటి వారు ప్రసన్న వేంకటాచలపతిని దర్శించుకోవచ్చును.

PC:youtube