Search
  • Follow NativePlanet
Share
» »విగ్రహం చెక్కకుండానే వెలసిన దేవుడు ఆలయ రహస్యం !

విగ్రహం చెక్కకుండానే వెలసిన దేవుడు ఆలయ రహస్యం !

భక్తుల కోసం దేవుడు వివిధ రూపాలలో, వివిధ ప్రదేశాలలో వెలసి వారిని దుష్టశక్తుల నుండి కాపాడుతాడని భక్తుల కోసం రక్షణగా వుంటాడని,వారు కోరుకున్న కోర్కెలు తీర్చుటాడని మనం ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణఇతిహాసాలలో

By Venkatakarunasri

భక్తుల కోసం దేవుడు వివిధ రూపాలలో, వివిధ ప్రదేశాలలో వెలసి వారిని దుష్టశక్తుల నుండి కాపాడుతాడని భక్తుల కోసం రక్షణగా వుంటాడని,వారు కోరుకున్న కోర్కెలు తీర్చుటాడని మనం ఎన్నో గ్రంథాలు, ఎన్నో పురాణఇతిహాసాలలో పెద్దల ద్వారా తెలుసుకున్నాం. అలా భక్తుల కోసం మన్యంకొండలో వెలసాడు శ్రీ వేంకటేశ్వరుడు. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి, పేదల తిరుపతి, మన్యంకొండ అని పిలుస్తారు.
ఈ ఆలయం గురించి మరింత సమాచారం ప్రస్తుత వ్యాసంలో తెలుసుకుందాం.

శ్రీ వేంకటేశ్వరుడు తన భక్తులను దుష్టుల నుండి కాపాడటం కోసం ... వారి పాపాలను హరించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాలలో వెలుస్తుంటాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి 'మన్యంకొండ'. మన్యంకొండ ను భక్తులు 'పేదల తిరుపతి' అని, 'రెండవ తిరుపతి' అని, 'తెలంగాణ తిరుపతి' అని, 'చిన్న తిరుపతి' అని, 'పాలమూరు తిరుపతి' అని పిలుస్తుంటారు.

పేదల తిరుపతి అని ఎందుకు అంటారంటే తీరితే తిరుపతి.....తీరకుంటే మన్యంకొండ అన్నట్లు పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేనివారు, తీరికలేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు.

ఎక్కడ ఉంది ?

ఎక్కడ ఉంది ?

ఈ క్షేత్రం మహబూబ్ నగర్ కు 17 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ - రాయచూర్ వెళ్లే మార్గంలో కలదు. సిద్దులు, మునీశ్వరులు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని అందుకే అప్పట్లో దీనిని 'మునుల కొండ' అని పిలిచారని, ఆతర్వాత అరణ్యప్రాంతంలో ఉండటంతో 'మన్యంకొండ' గా పేరు నిలిచిపోయిందని ఇక్కడివారు చెబుతారు.

కేశవయ్య అనే ముని

కేశవయ్య అనే ముని

కేశవయ్య అనే ముని నిద్రిస్తుండగా శ్రీనివాసుడు కలలో కనిపించి కృష్ణా నదీ తీరంలో మునులకొండ లో స్వయంభూగా వెలుస్తానని నన్ను ధూపదీప నైవేద్యాలతో కొలచమనీ చెప్పాడట.ఆ తర్వాత కేశవయ్య ఈ ప్రాంతానికి చేరుకొని స్వామివారికి ఇక్కడ పూజలుచేయటం ప్రారంభించాడు.

మునులకొండలో స్వయంభూ

మునులకొండలో స్వయంభూ

అలాగే ఇంకొక కథనం ప్రకారం తిరుపతికి కాలినడకన వెళ్లి తిరిగివస్తున్న ఒక ముసలావిడ అలిసిపోయి ఈవిధంగా స్వామికి విన్నవించుకుంది.స్వామీ నీ దర్శనానికి ఇంతదూరం రాలేకపోతున్నామనీ,దగ్గరగా దర్శనం ప్రాప్తించమనీ కోరగా మునులకొండలో స్వయంభూగా వెలిసానని అక్కడ నుండి స్వయంగా దర్శనం చేసుకోమని చెప్పినట్లు ఆలయ కధనం.

ఆలయ ప్రత్యేకత

ఆలయ ప్రత్యేకత

ఇక్కడ స్వామివారు ఆదిశేషుని పడగ నీడలో లక్ష్మీసమేతుడై వున్నాడు. తిరుమలలో స్వామి వారిని కాలినడక మార్గం,ఘాట్ రోడ్ మార్గం ద్వారా వెళ్లి ఏడుద్వారాలూ దాటుకుని ఎలాఅయితే దర్శించుకుంటామో మన్యంకొండలోనూ అలాగే చేరుకోవాలి.

ఆలయప్రత్యేకత

ఆలయప్రత్యేకత

ఎటువంటి శిల్పులు చెక్కకుండానే ఇక్కడ స్వామివారి ఆలయంలో స్వయంభూగా వెలిసారు. అలాగే ఇక్కడ వుండే కోనేరుని ఎవ్వరూ తవ్వలేదు.అలాగే ఎవ్వరూ చెక్కలేదు.ఇదే ఈ ఆలయప్రత్యేకత.

భక్తుల విశ్వాసం

భక్తుల విశ్వాసం

కొన్ని ఏళ్ల తర్వాత ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు.ఇక్కడ తలనీలాలు సమర్పించుకుని స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే స్వామి కోరినకోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం

కలలో కనిపించిన శ్రీనివాసుడు

కలలో కనిపించిన శ్రీనివాసుడు

మునీశ్వరులు,సిద్ధులు, కొన్ని వందల ఏళ్లక్రితం తపస్సు చేసుకున్న ప్రాంతం. ఒక వ్యక్తికి శ్రీనివాసుడు కలలో కనిపించి నేను ఇక్కడే కొలువైవుంటానుఅని చెప్పిన ప్రాంతమే మన్యంకొండ.

ప్రముఖ పుణ్యక్షేత్రము

ప్రముఖ పుణ్యక్షేత్రము

మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమిటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రము. పేదల తిరుపతిగా పేరిపొందిన మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మార్గము నుండి 4 కిమీ లోపలికి ఉంది.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఎత్తయిన కొండపై, ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నాడు

మన్యంకొండ అనగా

మన్యంకొండ అనగా

మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేవస్థానం దేవాదాయ శాఖ అధీనంలో ఉంది.

చరిత్ర

చరిత్ర

కేశవయ్య అనే మునికి వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి మన్యంకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని, నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ అంతర్థానం అయ్యారని స్థలపురాణం తెలుపుతుంది. ఆ మరుసటి రోజు కేశవయ్య మన్యంకొండను ప్రచారంలోకి తెచ్చాడు.

మన్యంకొండ అనే పేరు ఎలా వచ్చింది?

మన్యంకొండ అనే పేరు ఎలా వచ్చింది?

ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఎత్తయిన కొండపై ఘాట్‌రోడ్ నిర్మించి ప్రస్తుత స్థితిలోకి తీసుకువచ్చినవాడు అలహరి రామయ్య. కోనేరు మరియు మంచినీటి బావిని కూడా నిర్మించాడు. ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునులకొండగా పిలువబడిననూ కాలక్రమేణా పేరు మన్యంకొండగా స్థిరపడింది.

రెండవ తిరుపతి

రెండవ తిరుపతి

మన్యంకొండ దేవస్థానానం రెండవ తిరుపతిగా పేరుగాంచింది. తీరితే తిరుపతి.....తీరకుంటే మన్యంకొండ అన్నట్లు ..... పాలమూరు పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేనివారు, తీరికలేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు.

గుట్టపైకి బస్సులు

గుట్టపైకి బస్సులు

బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైకి బస్సులు వెళ్తాయి. మామూలు రోజులలో రాయచూరు ప్రధాన రహదారిపై దిగి అక్కడి నుంచి ప్రవేటు వాహనాలను ఆశ్రయించవలసి ఉంటుంది. ఇటీవల కొండపైకి వెళ్ళడానికి ఉన్న ఘాట్‌రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచారు.

స్వామివారి మహిమలు

స్వామివారి మహిమలు

కొండపై గల స్వామి వారికి ఎక్కడ లేని ప్రత్యేకతలు ఉన్నాయి. చెయ్యని పాదాలు, తవ్వని కోనేరు, కట్టని గుడి, ఉలితో చెక్కని విగ్రహం లా స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తాడు. అందుకే ఈ దేవాలయానికి ఎక్కడలేని ప్రతేకత సంతరించుకుంది

స్వామివారి మహిమలు

స్వామివారి మహిమలు

కొండ దిగువన ఉన్న అలివేలు మంగమ్మ అమ్మవారిని తప్పక దర్శించాలి. కొండ మార్గాన ఒకవైపు శ్రీవారి అడుగులు కనిపిస్తాయి. బహుశా శ్రీవారు ఇదే దారిన కొండపైకి చేరుకొనిఉంటారు. కొండపై పరిసరాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా ఉత్సవాలు మాఘశుద్ధ దశమి నాడు ప్రారంభమై మాఘ బహుళ విదియ వరకు ఎనిమిది రోజులు పాటు నిర్వహిస్తారు. ఆ సమయంలో రోజుకోరోజు ఉత్సవమూర్తిని అలంకరిస్తారు, కళ్యాణోత్సవం జరిపిస్తారు.

వసతి సదుపాయాలు

వసతి సదుపాయాలు

యాత్రికులు బస చేయటానికి సత్రాలు ఉన్నాయి. ఇక్కడ సత్రాలు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ఏసీ గదులు, డీలక్స్ గదులు కోరుకొనేవారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ లో బస చేయవచ్చు.

మన్యంకొండ ఎలా చేరుకోవాలి ?

మన్యంకొండ ఎలా చేరుకోవాలి ?

మహబూబ్ నగర్ నుండి రాయచూర్ వెళ్లే బస్సులలో ఎక్కితే మన్యంకొండ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి రాయచూర్, నారాయణపేట, ఆత్మకూర్ వెళ్లే బస్సులలో ఎక్కినా మన్యంకొండ వెళ్ళవచ్చు.

మన్యంకొండ ఎలా చేరుకోవాలి ?

మన్యంకొండ ఎలా చేరుకోవాలి ?

మన్యంకొండలో రైల్వే స్టేషన్ కలదు. గద్వాల్, కాచిగూడ, సికింద్రాబాద్, గుంటూరు ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. కొండ కింద నుండి పైకి చేరుకోవటానికి ఉచిత బస్సులు, ఆటోలు, ప్రవేట్ వాహనాలు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X