Search
  • Follow NativePlanet
Share
» »శృంగార తీరాల్లో ఈ పరిమళాలు ఆస్వాధించారా?

శృంగార తీరాల్లో ఈ పరిమళాలు ఆస్వాధించారా?

By Kishore

గోవా అంటే ప్రతి మొదట ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది బీచ్ లలో అర్థనగ్నంగా, నగ్నంగా ఉండే విదేశీయులు, వారిని ఫొటోలు తీసే ఫొటో గ్రాఫర్లు. అటు పై మద్యం. వివిధ దేశాలతో పాటు స్థానికంగా తయారయ్యే మద్యం. ఇక సాయంకాల సమయంలో హోరెత్తించే డీజే మ్యూజిక్ కు ఒళ్లు తెలియకుండా ఊగే యువత. అయితే అదే గోవాలో ఆధ్మాత్మికతకు నిలయమైన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పురాణ ప్రధాన్యత అంటే రామాయణ కాలం నాటివి కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా భగవతి దేవాలయం, మంగేశ్ ఆలయం, లక్ష్మీ నరసింహ దేవాలయం వంటివి ఎన్నో ఉన్నాయి. గోవాలో కేవలం హిందూ దేవాలయాలే కాకుండా జైన దేవాలయం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకొందాం.

ఇక్కడ శివుడికి పాలు అంటే ఇష్టం లేదు? సందర్శిస్తే మీ శత్రువును జయించే

1. శ్రీ సప్త కోటేశ్వర దేవాలయం

1. శ్రీ సప్త కోటేశ్వర దేవాలయం

Image Source:

గోవాలోని అనేక ముఖ్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి శ్రీ సప్తకోటేశ్వర ఆలయం ఒకటి. మొఘల్, యురోపియన్ ఆర్కిటక్షర్ తో నిర్మించబడింది. పొడవైన దీప గోపురంలు ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఏడాదికి ఒకసారి జరిగే గోకులాష్టమి అనే ఉత్సవంలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఎక్కడ ఉంది: నర్వే, బిచోలిమ్, సౌత్ గోవా, గోవా - 403714

సందర్శించే సమయం: 6:00 నుండి 7:00 గంటల వరకు, అన్ని రోజులు

పనాజి నుండి దూరం: 37 కిలోమీటర్లు

2. మారుతీ దేవాలయం

2. మారుతీ దేవాలయం

Image Source:

గోవాలోని ప్రసిద్ధ ఆలయాల జాబితాలో మారుతి ఆలయం కూడా ఒకటి. దీనికి పురాణ ప్రాధాన్యత కూడా ఉంది. అనేక మంది చరిత్ర కారులు ఈ దేవాలయానికి వచ్చి దీని చరిత్రను తెలుసుకొని వెలుతుంటారు.

ఎక్కడ ఉంది: ఆర్టీవో సర్కిల్ సమీపంలో, పోండా-పనాజీ హైవే, పోండా, గోవా 403401

సమీప ఆకర్షణలు: రీస్ మేగోస్ ఫోర్ట్, మహాలక్ష్మీ దేవాలయం, గోవా స్టేట్ మ్యూజియం, పనాజిం హెరిటేజ్ వాక్

సందర్శించే సమయం: 5:00 నుండి 8:00 గంటల వరకు

3. మహాలక్ష్మీ దేవాలయం

3. మహాలక్ష్మీ దేవాలయం

Image Source:

గోవా లోని అత్యంత ముఖ్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి మహాలక్ష్మీ దేవాలయం మొదటి వరుసలో ఉంటుంది. ఇది పనాజీ గ్రామ దేవత. ఈ అద్భుతమైన దేవాలయపు గర్భగుడిలో 18 భక్తి ప్రధాన చిత్రాలు ఉంటాయి. ఇందులో కొన్ని వేల సంవత్సరాల క్రితం గీసినవి కూడా ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ దేవత తల పై శివలింగం ఉండటం ప్రధాన ఆకర్షణ.

ఎక్కడ ఉంది.: బందేవేడ్, పోండా, నార్త్ గోవా, గోవా

ప్రధాన ఆకర్షణలు: నవరాత్రి మరియు చైత్ర పూర్ణిమ యొక్క పండుగలు

సందర్శించే సమయంలో : ఉదయం 6:30 నుంచి 8:30 వరకు

Image Source:

Image Source:

Image Source:

గోవాలో అత్యంత పురాతన కట్టడాల్లో మహాదేవ టెంపుల్ కూడ ఒకటి. ఈ దేవాలయం నిర్మాణ శైలిని మనం మరెక్కడా చూడలేము. ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ పరిరక్షణలో ఉంది. పరమశివుడిని ఇక్కడ ప్రధానంగా పూజిస్తారు.

ఎక్కడ ఉంది. భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం, సాంగెమం, సుర్లా, గోవా 403406 దగ్గర

ప్రధాన ఆకర్షణలు: మహాశివరాత్రి పండుగ

5. శాంతి దుర్గ ఆలయం

5. శాంతి దుర్గ ఆలయం

Image Source:

గోవాలో మొత్తం మూడు చోట్ల శాంతి దుర్గ ఆలయాలు ఉన్నాయి. అవి కాప్లెం, పేమమ్, క్వీపెమ్ అనే మూడు ప్రాంతాల్లో శాంతి దుర్గ పేరుతో మూడు ఆలయాలు ఉన్నాయి. అయితే క్వీపెమ్ ప్రాంతంలో ఉన్న దేవాలయం ప్రాచీనమైనదే కాకుండా మత సామరస్యానికి చిహ్నంగా ఉంది. ఇక్కడ దుర్గా మాతను అటు హిందువులతో పాటు క్రైస్తవులు కూడా పూజిస్తారు.

ఎక్కడ ఉంది. క్వీపెమ్, సౌత్ గోవా, గోవా - 403703

ప్రధాన ఆకర్షణలు: ఏడాదికి ఒకసారి జరిగే జాత్ర

6. దామోదర ఆలయం

6. దామోదర ఆలయం

Image Source:

కుషావతి నదీ తీరంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రధానంగా శివుడిని పూజిస్తారు. దీనితో పాటు గణపతి, కుమారస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. కుషావతి నదిలో స్నానం చేయడం వల్ల చర్మరోగాలు నయమవుతాయని నమ్ముతారు.

ఎక్కడ ఉంది: శాంగొమ్, దక్షిణ గోవా, గోవా

మార్గోవ్ నుంచి : 22 కిలోమీటర్లు

7. మహల్సా దేవాలయం

7. మహల్సా దేవాలయం

Image Source:

గోవాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే దేవాలయాల్లో మహల్సా దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలో ప్రతి రోజూ ఉదయం నిర్వహించే హారతి చూడటానికి వందల సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ హారతిని చూడటం వల్ల మనస్సులోని కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం.

ఎక్కడ ఉంది: శ్రీ మహల్సా సంస్థాన్, మార్దోల్, ప్రిరోల్, గోవా

సమీప ఆకర్షణలు: సీతా కోక చిలుకల సంరక్షణ కేంద్రం, శ్రీ నాగేష్ టెంపుల్, శాంత దుర్గా టెంపుల్, ఓల్డ్ గోవా, మంగుళి టెంపుల్ మరియు ఉటోర్డా బీచ్.

8. మంగూశి దేవాలయం

8. మంగూశి దేవాలయం

Image Source:

ఉత్తర గోవాలో ఉన్న ఈ దేవాలయం నిర్మాణంలో ఆధునిక భావాలు కనబడుతాయి. అయితే సంప్రదాయాలన్నీ పురాతన భారతీయ సంప్రదాయాలకు అద్ధం పడుతాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇక్కడ నిలువుగా ఉన్న స్తంభం పై వెలిగించే వేలాది దివ్వెలను చూడటం మరిచిపోలేని అనుభూతి.

ఎక్కడ ఉంది. మంగోశి, ప్రియోల్, పోండా, నార్త్ గోవా 403001

వార్షిక ఉత్సవాలు: రామ నవమి, నవరాత్రి, మహా శివరాత్రి ఉత్సవాలు

9. శ్రీ నాగేష్ దేవాలయం

9. శ్రీ నాగేష్ దేవాలయం

Image Source:

గోవాలోని అత్యంత పురాతన దేవాలయాల్లో నాగేష్ దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ ఉన్నటు వంటి సరస్సు మధ్యలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో పడే కాంతి చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1413 లో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ దేవాలయం నిర్మాణంలో ఎటువంటి మార్పులు రాలేదు.

నగర: డాన్సివాడో, పోండా, గోవా 403401

స్థాపన సంవత్సరం: క్రీస్తు శకం 1413లో

ప్రధాన ఉత్సవాలు: శివరాత్రి

10. బ్రహ్మ దేవాలయం

10. బ్రహ్మ దేవాలయం

Image Source:

సుమారు ఐదో శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది. మూడు ముఖాలతో కలిగిన ఈ దేవాలయంలోని విగ్రహాన్ని దర్శించుకున్నవారందరికీ అపారమైన తెలివి తేటలు వస్తాయని ప్రజలు నమ్ముతారు.

ఎక్కడ ఉంది : వోల్పో, సతరి జిల్లా, గోవా

దగ్గర్లో ఉన్న చూడదగిన ప్రాంతాలు..అనేక బీచ్ లు

11. కామాక్షి దేవాలయం

11. కామాక్షి దేవాలయం

Image Source:

ఈ విశ్వంలోని దేవతలను స`ష్టించినది కామాక్షి అమ్మవారని స్థానికులతో ఈ దేవాలయం పూజారులు చెబుతారు. ఈ దేవాలయం దాదాపు 16వ శతాబ్దంలో నిర్మించారు. చుట్టూ కొబ్బరి చెట్లతో ఈ దేవాలయం చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

ఎక్కడ ఉంది. శిరిడా, సౌత్ గోవా

12. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

12. లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం

Image Source:

గోవాలో అత్యంత పురాతన దేవాలయాల్లో లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కూడా ఒకటి. గోవాలోని వెల్లింగ్ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలో భక్తుల తాకిడి కొంత తక్కువగానే ఉంటుంది. దేవాలయం ముందు ఉన్న సరస్సు ఎప్పటికీ ఎండిపోదని చెబుతారు.

13. రామ్ నాథ్ దేవాలయం

13. రామ్ నాథ్ దేవాలయం

Image Source:

ఈ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత ఉంది. శ్రీ లంకలో ప్రవేశించడానికి ముందు శ్రీ రాముడు ఇక్కడ శివుడిని పూజించారని పురాణ కథనం. ఇక్కడ ఉన్న అనేక దేవతా విగ్రహాలు భారతీయ శిల్పకళకు అద్ధం పడుతాయి.

14.శ్రీ భగవతి దేవాలయం

14.శ్రీ భగవతి దేవాలయం

Image Source:

ఈ దేవాలయానికి దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రవేశ ద్వారం ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. నార్త్ గోవాలోని పెర్నమ్ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం దసరా సమయంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

15.రుద్రేశ్వర్ దేవాలయం

15.రుద్రేశ్వర్ దేవాలయం

Image Source:

గోవాలో రుద్రేశ్వర్ దేవాలయం అతిప్రాచీనమైనది. ఈ దేవాలయం దగ్గర్లో అనేక జలపాతాలు ఉంటాయి. ముఖ్యంగా శివరాత్రి, దసర ఉత్సవాల సమయంలో ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఎక్కడ ఉంది: రుద్రేశ్వర్ కాలనీ, సన్క్విలిమ్, నార్త్ గోవా జిల్లా, గోవా, 403505

పనాజి నుండి దూరం: 45 కిలోమీటర్లు

16. దిగంబరనాథ్ దేవాలయం

16. దిగంబరనాథ్ దేవాలయం

Image Source:

గోవాలో ఉన్న ఏకైక జైన దేవాలయం ఇదే. ఇక్కడ దేవాలయాన్ని పూర్తిగా తెల్లని గ్రానైట్ తో నిర్మించారు. ఇక్కడ కేవలం శాఖాహారం మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ వసతి సౌకర్యం కూడా యాత్రికులకు కల్పిస్తారు.

ఎక్కడ ఉంది: రోసరీ ఛాపెల్ దస్సాలిమ్, స్వామి చిన్మయానంద రోడ్, అవెంగ్ మార్గోవ్, మార్గోవ్, గోవా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more