» »భక్తుడి కోసం ప్రవేశద్వారం దిశ మార్చకున్న శివుడి దేవాలయం ఇదే

భక్తుడి కోసం ప్రవేశద్వారం దిశ మార్చకున్న శివుడి దేవాలయం ఇదే

Written By: Kishore

కులం, మతం మానవుడు సృష్టించుకున్నవే. ఇవి మనష్యుల మధ్య కలహాలను సృష్టిస్తున్నాయి తప్పిస్తే మరెటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇదే విషయాన్ని ఆ పరమశివుడు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాడు. అటు వంటి ఘటన మహారాష్ర్టలోని అంబర్ నాథ్ లో కూడా జరిగింది. ఇక్కడి అంబర్ నాథ్ దేవాలయంలోని శివయ్య ఓ హరిజన భక్తుడి కోసం తూర్పు వైపున ఉన్న తన ప్రవేశ ద్వారాన్ని పడమర దిక్కుకు మార్చకున్నాడు. ప్రస్తుతం ఆ దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లు తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం..

1.పాండవులు నిర్మించారు

1.పాండవులు నిర్మించారు

Image source

స్థల పురాణాన్ని అనుసరించి పంచపాండవులు వనవాసం చేసే సమయంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. అంబర్ నాథ్ లో రాత్రి బస చేసిన సమయంలో శివుడి ఆజ్జ ప్రకారం ఒక రాత్రి లోపు శివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.

2. అలాగే వదిలివేస్తారు

2. అలాగే వదిలివేస్తారు

Image source

సూర్యస్తమయం తర్వాత పనులు మొదలు పెట్టి సూర్యోదయం లోపు శివుడి దేవాలయాన్ని నిర్మిస్తారు. అయితే గర్భగుడి గోపురం నిర్మించడానికి సమయం సరిపోదు. దీంతో దానిని అలాగే వదిలి వేస్తారు.

3. అందువల్లే పై కప్పు ఉండదు

3. అందువల్లే పై కప్పు ఉండదు

Image source

అందువల్లే ఈ అంబర్ నాథ్ దేవాలయంలో గర్భగుడి పై కప్పు ఉండదు. సూర్య కిరణాలు నేరుగా గర్భ గుడిలోని శివ లింగం పై పడుతాయి. ఈ లింగం పై బడిన తర్వాత సదరు కిరణాలకు అతీత శక్తులు వస్తాయని ఇక్కడి వారు భావిస్తుంటారు.

4. 20 మెట్లు దిగి వెళ్లాలి

4. 20 మెట్లు దిగి వెళ్లాలి

Image source

ఇక గర్భగుడిలో మూలవిరాట్టు భూ గర్భంలోపల ఉంటారు. ఆలయ గర్భగుడిలో 20 మెట్లు ఉంటాయి. వాటి గుండా కిందికి దిగి దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

5. దైవ లోకానికి రహస్య మార్గం

5. దైవ లోకానికి రహస్య మార్గం

Image source

ఇక ఈ గర్భగుడిలోపల నుంచి పాండవులు దైవ లోకానికి ఒక రహస్య మార్గం నిర్మించారని కూడా స్థలపురాణం చెబుతుంది. అందుకు తగ్గట్లే దేవాలయంలో ఓ భూ గర్భ మార్గాన్ని ప్రస్తుతం మూసివేశారు. వాడుకలో లేదు.

6. పున:నిర్మించారు..

6. పున:నిర్మించారు..

Image source

ఇక ఈ దేవాలయాన్ని శిలహర రాజు ఆయన కుమారుడైన ముమ్ముని పున:నిర్మించినట్లు ప్రస్తుత దేవాలయం ఉన్న చోట దొరికిన శిలాశాసనాలను అనుసరించి పురావస్తు శాస్త్రజ్జులు చెబుతున్నారు.

7.హరిజనుడిని గెండివేశారు

7.హరిజనుడిని గెండివేశారు

Image source

ముమ్ముని కాలంలో ఒక రోజు శివుడి భక్తుడైన హరిజనుడు దేవాలయంలోకి దైవ దర్శనానికి వస్తాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న భటులు ఆయన్ను మెడపట్టి బయటికి తోసివేయడమే కాకుండా వెనుకవైపు నుంచి దేవుడిని దర్శించుకోవాలని ఆదేశిస్తారు.

8.పడమరవైపునకు తిరిగాడు

8.పడమరవైపునకు తిరిగాడు

Image source

వారి ఆజ్జప్రకారం పడమర వైపునకు వెళ్లి శివుడి గురించి స్తుతిస్తాడు. దీంతో తూర్పు వైపున ఉన్న ప్రవేశ ద్వారం పడమర వైపునకు వెలుతుంది. అందుకు నిదర్శనం పడమర వైపున ఉన్న ప్రవేశ ద్వారం పై భాగం కొద్దిగా కిందికి ఉంటుంది.

9. అందరికీ ప్రవేశం

9. అందరికీ ప్రవేశం

Image source

ఇక శివలింగం కూడా ఇదే వైపునకు తిరిగి ఉంటుంది. నంది తూర్పు వైపునే ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ముమ్ముని ఆ రోజు నుంచి తన రాజ్యంలోని అన్ని దేవాలయాల్లోకి హరిజనులకు కూడా ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడని స్థానికులు చెబుతారు.

10. ఎక్కడ ఉంది

10. ఎక్కడ ఉంది

Image source

మహారాష్ట్ర రాజధాని ముంబైకు దగ్గరగా అంబర్ నాథ్ రైల్వేస్టేషన్ కు 2 కిలోమీటర్ల దూరంలో వడావన్ నదీ తీరంలో ఉంది. ఈ నదిని వాల్దుని అని కూడా పిలుస్తారు.

11. ఎలా చేరుకోవాలి...

11. ఎలా చేరుకోవాలి...

Image source

ముంబైకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైల్వే, విమానాయన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముంబై నుంచి అంబర్ నాథ్ కు రోడ్డు మార్గం ద్వారా గంట ప్రయాణం సుమారు 46 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

12. రైలు

12. రైలు

Image source

ముంబై నుంచి అంబర్ నాథ్ కు నిత్యం రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అంబర్ నాథ్ నుంచి దేవాలయానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి.

13. దగ్గర్లో చూడదగిన ప్రాంతాలు

13. దగ్గర్లో చూడదగిన ప్రాంతాలు

Image source

అంబర్ నాథ్ కు దగ్గర్లో టిట్వాల గణేష్ దేవాలయం, శక్తి ఆశ్రయం, దుర్గాడి ఫోర్ట్, మలాన్ ఘడ్, కొండేశ్వర్ దేవాలయం తదితరాలు ఉన్నాయి.

14.పూజలు

14.పూజలు

Image source

శివరాత్రి రోజున మూడు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచే కాకుండా దేశంలోని వేర్వేరు చోట్ల నుంచి కూడా ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ప్రతి పౌర్ణమి రోజున కూడా విశేష పూజలు జరుగుతాయి.