Search
  • Follow NativePlanet
Share
» »సంబరాల హోలీకి శుభాకాంక్షలు!!

సంబరాల హోలీకి శుభాకాంక్షలు!!

By Staff

ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానంఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం - బ్రహ్మంగారి కాలజ్ఞానం

ఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవుఈ జలపాతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు

హోలీ రానే వచ్చింది. హోలీ పండుగను దేశం మొత్తం అందరూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు,స్వీట్లు పంచుకుంటారు. దీనిని అందరు ముద్దుగా " రంగులపండుగ " అని పిలుస్తారు. కుల, మత, జాతి మరియు వర్ణ భేధం లేకుడా భారత దేశ ప్రజలు ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటారు. దోల్-పూర్ణిమగా పిలిచే ఈ రంగుల పండుగను విందులతో ఉల్లాసంగా జరుపుకొంటారు. ఆ రోజు, పొరపాటున మీరు కనక తెల్ల బట్టలు వేసుకు వీధుల్లోకి వచ్చారా??? ఇక అంతే సంగతులు!!..

హోలీ పండుగ సంబరాలు చూద్దామా!!

 ఎప్పుడు వస్తుంది?

ఎప్పుడు వస్తుంది?

హోలీ అనేది రంగుల పండుగ , హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము, పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, పౌర్ణమికి ఐదవ రోజున పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు.

Photo Courtesy: Ian Brown

 హోలికి ఇతర పేర్లు!!

హోలికి ఇతర పేర్లు!!

భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా, సంత-ఉత్సబ్ అని అంటారు.

Photo Courtesy: Limon 1032

బాగా జరుపుకునే ప్రాంతాలు!!

బాగా జరుపుకునే ప్రాంతాలు!!

హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.

Photo Courtesy: Max Schrader

ఎలా జరుపుకుంటారు!!

ఎలా జరుపుకుంటారు!!

హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

Photo Courtesy: Steven Gerner

 ఇంకా ఏమి చేస్తారు!!

ఇంకా ఏమి చేస్తారు!!

హోలీ రోజున దేశంలోని పలు ప్రాంతాల్లో లక్ష్మీ నారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, చంద్రపూజ వంటివి జరుపుతుంటారు. మన రాష్ట్రంలో కాముని పున్నమిగా ప్రసిద్ధి చెందిన ఈ హోలీ పండుగ రోజు (ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ) చంద్రుడు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడని ప్రతీతి. అందుచేత ఈ రోజున చంద్ర పూజ, సత్యనారాయణ స్వామి పూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

Photo Courtesy: Sskoslia786

ఆంధ్రప్రదేశ్ లో

ఆంధ్రప్రదేశ్ లో

హైదరాబాదు మరియు తెలంగాణ జిల్లాలో ఇది ప్రముఖంగా ఇతర ప్రాంతాలలోని పట్టణాలలో స్వల్పస్థాయిలో జరుపుకుంటారు.

Photo Courtesy: Arria Belli

పంజాబ్ లో

పంజాబ్ లో

పంజాబ్‌ లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు. ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకొంటారు. వాస్తవానికి, భారత దేశ మొత్తంలో ఆనంద్‌పూర్ సాహిబ్ లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది.

Photo Courtesy: FaceMePLS

ఉత్తర్ ప్రదేశ్ లో

ఉత్తర్ ప్రదేశ్ లో

హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు మరియు హోలీ పాటలను పాడుకుంటూ, పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ అంటూ పాడతారు.

Photo Courtesy: Bot

మథురలో మరియు బృందావన్ లో

మథురలో మరియు బృందావన్ లో

భగవంతుడైన కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో మరియు బృందావన్ లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు మరియు పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో ఆచార వ్యవహారాలతో భగవంతుడైన కృష్ణుడిని పూజిస్తారు.

Photo Courtesy: Steven Gerner

బీహార్ లో

బీహార్ లో

బీహార్‌ లో కూడా హోలీని అదే స్థాయిలో మరియు మనోహరంగా జరుపుకొంటారు. ఫాల్గున పూర్ణిమ పర్వ దినానికి ముందు రోజు, ప్రజలు పెద్ద మంటలను వెలిగిస్తారు.వారు పేడ పదార్థాలను, ఆరాడ్ మరియు రెడి చెట్ల యొక్క కలప మరియు హోలీక చెట్టు, పంటలను కోసిన తరువాత మిగిలిన పొట్టును మరియు అవసరం లేని కలపను పెద్ద మంటలలో వేస్తారు. హోలీ రోజున మంచి శృతితో జానపద పాటలను పాడతారు మరియు ప్రజలు డోలక్ యొక్క శబ్దానికి నాట్యం చేస్తారు.

Photo Courtesy: ZeePack

బెంగాల్ లో

బెంగాల్ లో

ఈ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు, పట్టణాల్లోని ముఖ్యమైన వీధులలో లేదా పల్లెల్లో కృష్ణుడి మరియు రాధా ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.ఆడవాళ్లు ఊగుతూ నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ భక్తి పాటలను పాడతారు. అప్పుడు పురుషులు రంగు నీటిని మరియు రంగు పొడి అబీర్ జల్లుకొంటారు. శాంతినికేతన్‌లో, హోలీ ఒక ప్రత్యకమైన సంగీత అభిరుచి కలిగి ఉంటుంది. సంప్రదాయమైన వంటకాలు మల్పోయే, కీర్ సందేష్, బాసంతి సందేష్ (సాఫ్రన్ యొక్క), సాఫ్ఫ్రన్ పాలు, పాయసం మొదలైనవి.

Photo Courtesy: Biswarup Ganguly

ఒరిస్సా లో

ఒరిస్సా లో

ఒరిస్సా ప్రజలు కూడా హోలీని ఇదే విధంగా జరుపుకొంటారు కానీ కృష్ణ మరియు రాధా విగ్రహాలకు బదులుగా పూరీలో ఉన్న జగన్నాధుడి విగ్రహాలను పూజిస్తారు.

Photo Courtesy: Ghosh.partha3

గుజరాత్ లో

గుజరాత్ లో

భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు. పల్లెల యొక్క కూడళ్ళలో, కాలనీలలో మరియు వీధులలో భోగీ మంటలను వేస్తారు. ప్రజలు భోగీ మంటల ముందు ప్రార్ధనలు చేస్తారు మరియు వారు అలా నృత్యం చేయటం మరియు పాటలు పాడటం వల్ల చెడు మన దరి చేరదని సూచనప్రాయంగా విశ్వసిస్తారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వారు అందరు హోలీ పండుగ రోజున అధిక ఉత్సాహముతో మంటల చుట్టూ నాట్యము చేస్తారు.

Photo Courtesy: Sheetal joshi72

అహ్మదాబాద్‌లో ప్రత్యేకం

అహ్మదాబాద్‌లో ప్రత్యేకం

దక్షిణ భారత దేశంలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగను వేసి వీధిలో వ్రేలాడదీస్తారు మరియు యువకులు ఆ కుండను పగులగొట్టడానికి ప్రయత్నిస్తారు అదేసమయములో వారిని ఆపుటకు అమ్మాయిలు వారిపై నీళ్ళను విసురుతారు, ఎందుకంటే కృష్ణుడు మరియు అతని స్నేహితులు వెన్నె దొంగతనము చేస్తున్నప్పుడు వారిని 'గోపికలు' ఆపినట్లు ఆపుతారు. కృష్ణుడు వెన్నె దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే వారిని ఎగతాళి చేస్తూ రంగులతో తడిసిన పురుషులు వీధులలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. చివరికి ఏ యువకుడైతే ఆ కుండను పగులగొడతాడో అతడిని హోలీ రాజుగా కిరీటాన్నిస్తారు.

Photo Courtesy: Harsha K R

గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలలో

గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలలో

కొన్ని ప్రదేశములలో, హిందూవుల ఆచారం ప్రకారం అమ్మాయిలు చీరను తాడుగా చేసి బావలను కొడుతూ రంగులను పూస్తూ ఆటపట్టిస్తారు, ఆమె కొరకు బావ ఆ రోజు సాయంకాలం తీపి తినుబండారాలను తీసుకొని వస్తాడు.

Photo Courtesy: Harsha K R

మహారాష్ట్ర లో

మహారాష్ట్ర లో

మహారాష్ట్రలో, హోలీ పౌర్ణిమను షింగా వలె కూడా జరపుకొంటారు. పండుగకు ఒక వారం ముందు, యువకులు చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న కలపను తీసుకువచ్చి అందరి ఇంటికి వెళ్లి డబ్బును పోగు చేస్తారు. హోలీ రోజున, ఒక ప్రదేశములో మంటకు చెక్కను పెద్ద కుప్పగా పోగు చేస్తారు. సాయంత్రం మంటలను వెలగిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తిను బండారాలను మరియు భోజనం అర్పిస్తారు. పూరణ్ పోలి అనేది రుచికరమైన తినుబండారం మరియు పిల్లలు "హోలీ రే హోలీ పురాణచి పోలి" అని పాడతారు. షింగా దౌర్భాగ్యాలన్నింటిని తొలగిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

Photo Courtesy: FaceMePLS

మణిపూర్ లో

మణిపూర్ లో

భారత దేశానికి ఈశాన్య దిశలో ఉన్న మణిపూర్‌ లో హోలీ పండుగను ఆరు రోజులు జరుపుకొంటారు. యువకులు సంప్రదాయక పద్ధతిలో తెలుపు మరియు పసుపు తలపాగాలను ధరించి రాత్రి వేళల్లో ఫాల్గునమాసము పౌర్ణమి రోజున 'తాబల్ చోంగ్‌‌బా' జానపద నృత్యాలతో జానపద పాటలతో అద్భుతముగా డోలును వాయిస్తారు.బాలురు అమ్మాయిలకు తమతో 'గులాల్' ఆట ఆడమని డబ్బు ఇస్తారు. వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. భోగీ మంటలకు ఎండు గడ్డిని మరియు రెమ్మలను ఉపయోగిస్తారు. పండుగ చివరి రోజు, కృష్ణుడి గుడి ఆవరణలో ఇంఫాల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఊరేగింపు చేస్తారు.

Photo Courtesy: rajkumar1220

కాశ్మీర్ లో

కాశ్మీర్ లో

కాశ్మీర్‌లో పౌరులు, భారత రక్షక దళ అధికారులు మరియు పాకిస్థాన్ రక్షణ దళాలు కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగు పొడిని మరియు రంగు నీళ్ళను విసురుకుంటూ, పాటలు పాడుకుంటూ, నృత్యము చేస్తూ, అధిక ఉత్సాహముతో పండుగను జరపుకొంటారు.

Photo Courtesy: vishal_04

హర్యానా మరియు ఢిల్లీ లో

హర్యానా మరియు ఢిల్లీ లో

ఈ ప్రాంతములో కూడా హోలీ ప్రత్యమైన పద్ధతిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరపుకొంటారు, ఈ పండుగను ఆనందముగా మరియు అత్యుత్సాహముతో జరపుకుంటారు. రాష్ట్రపతి భవన్ లో, రాష్ట్రపతి పిల్లలతో సరదాగా హోలీ ఉత్సవాలలో పాల్గొంటారు అంతేకాక దేశ ప్రశానీ కూడా తన అదికార నివాసంలో హోలీ పండుగను చిన్నారులతో కలసి ఉత్సాహంగా జరుపుకుంటారు.

Photo Courtesy: Todd vanGoethem

నేపాల్ లో

నేపాల్ లో

నేపాల్‌ లో హోలీ పండుగ రోజు జాతీయ సెలవు దినం. నేపాల్‌ లో, పండుగలలో ఒక గొప్ప పండుగగా హోలీని పరిగణిస్తారు. నేపాల్‌లో 80 శాతం ప్రజలు హిందువులు ఉన్నారు, చాలా వరకు హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా జరుపుకొంటారు మరియు దాదాపుగా ప్రతి ఒక్కరు ప్రాంతీయ భేదం లేకుండా జరుపుకొంటారు చివరికి ముస్లిములు, క్రైస్తవులు కూడా ఘనంగా జరుపుకొంటారు. హోలీ పండుగ రోజు హోలీ పండుగను ప్రజలు తమ చుట్టుప్రక్కల వారిపై రంగులను జల్లుకుంటూ రంగు నీరును పోసుకుంటారు. చాలా మంది ప్రజలు వారి పానీయాల్లో మరియు ఆహారంలో గంజాయి కలుపుకొంటారు. వివిధ రంగులతో ఆడుకోవటం వల్ల వారి యొక్క బాధలు తొలగిపోయి, రాబోయే జీవితం ఆనందముగా ఉంటుందని నమ్ముతారు.

Photo Courtesy: FlickreviewR

ప్రపంచంలో భారతీయులతో పాటుగా సంబరాలు జరుపుకుంటూ

ప్రపంచంలో భారతీయులతో పాటుగా సంబరాలు జరుపుకుంటూ

సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.

Photo Courtesy: bobistraveling

చివరగా...

చివరగా...

మొత్తానికి హోలీ పండుగ వ్రతం చేసుకునే పెద్ద వాళ్ళకు భక్తిని పంచుతూ, చిన్నారులకు, యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబరాలను పంచిపెడుతోంది. కాబట్టి ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం..!

Photo Courtesy: Steven Gerner

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X