• Follow NativePlanet
Share
» »చితాబస్మంతో హోళి ఇక్కడ ప్రత్యేకం

చితాబస్మంతో హోళి ఇక్కడ ప్రత్యేకం

Written By: Beldaru Sajjendrakishore

భారత దేశం మొత్తం హోళిని ఎంతో ఆనందంగా జరుపుకుంటోంది. దేశం నలుమూలలా రంగులతో, లేదా రంగు నీళ్లతో మరికొంత మంది పువ్వులతో హోళిని జరుపుకొంటారు. అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం చితా బస్మంతో హోళిని జరుపుకొంటారు. ఈ వినూత్న హోళిని చూడటానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం అక్కడకు చేరుకుంటారు. దీనినే స్మశన హోళి అని కూడా అంటారు. ఇలా జరుపుకోవడం వల్ల అష్టదరిద్రాలు తొలిగిపోతాయని అక్కడి వారు చెబుతుంటారు. దశాబ్దల క్రితం మొదలైన ఈ వినూత్న హోళి ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. అన్నట్టు ఈ హోళి చూడటానికి సదరు ప్రాంతానికి చేరేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన కథనం

1. మణికర్ణిక ఘాట్ లో

1. మణికర్ణిక ఘాట్ లో

Image source

కాశీలోని ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాట్ లో శవభస్మంతో హోళిని జరుపుకుంటారు. నాగ సాదువులు ఒకరి పై మరొకరు ఈ భస్మాన్ని చల్లు కుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటారు.

2. పాన్, బంగ్ ఉండాల్సిందే...

2. పాన్, బంగ్ ఉండాల్సిందే...

Image source

ఈ హోళి సమయంలో నాగ సాదువులు పాన్, తో పాటు ఒక రకమైన మత్తును కలిగించే బంగ్ అనే పదార్థాన్ని తప్పక తీసుకుంటారు. వీటిని మహాదేవుని ప్రసాదంగా వారు భావిస్తారు.

3. ప్రపంచంలో మరెక్కడా లేదు

3. ప్రపంచంలో మరెక్కడా లేదు

Image source

ఇందు కోసం అప్పుడే దహనం చేసిన శవం యెక్క భస్మాన్ని తీసుకుని ఒకరి పై ఒకరు చెల్లు కొంటూ ఈ వినూత్న హోళిని జరుపుకొంటారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి హోళి జరగడాన్ని మనం చూడలేము.

4. విదేశీయులు కూడా

4. విదేశీయులు కూడా

Image source

ఈ శవ భస్మ హోళిని చూడటానికి దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. వీరిలో ఎక్కువగా విదేశీయులు ఉంటారు.

5. మొదట చితికి హారతి

5. మొదట చితికి హారతి

Image source

హోళి జరపుకోవడానికి ముందు నాగసాధువులు చితికి మంగళహారతి ఇస్తారు. అటు పై డమరుకాన్ని మోగిస్తూ హరహర మహాదేవ నామస్మరణ జరుగుతుంది. అప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక అలౌకి ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకుంటుంది.

6.దేవాలయంలో కూడా

6.దేవాలయంలో కూడా

Image source

ఈ భస్మాన్ని కాశి విశ్వేశ్వర నాథ దేవాలయంలోకి తీసుకువెళుతారు. మొదట ఈ భస్మంతో శివుడికి అర్చన చేసి అటు పై ఆ భస్మాన్ని ఊరేగింపుగా బయటికి తీసుకువస్తారు. దీన్ని నాగసాదువులు ఒకరికి మరొకరికొకరు పంచుకుంటారు. అటు పై దేవాలయంలో హారతి తర్వాత హోళి ఉత్సవం మొదలవుతుంది.

శవభస్మంతో అర్చన జరిగే దేవాలయం గురించిన కథనం కోసం...

7. ఎంతో పావనమైనది..

7. ఎంతో పావనమైనది..

Image source

మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

8. మరో కథనం ప్రకారం

8. మరో కథనం ప్రకారం

Image source

మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట.

9. అనేక దేవాలయాలు

9. అనేక దేవాలయాలు

Image source

విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి.

10.మసీదులు కూడా

10.మసీదులు కూడా

Image source

వారణాశిలో ఉన్న మసీదులలో ప్రధానమైనవాటిలో విశ్వేశ్వరాలయ సమీపంలో ఉన్న గ్యానవాపి మసీదు ఒకటి, తరువాత అలాంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు మరియు చుఖాంబా మసీదు మొదలైనవి.

11. అలా మొదలయ్యింది.

11. అలా మొదలయ్యింది.

Image source

ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తరువాత వారణాశిలో ప్రారంభమైన ముస్లిముల రాక ఇప్పటికీ పలు తరాలుగా కొనసాగుతూ ఉంది.

12ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి...

12ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి...

Image source

కాశీని వారణాసి లేదా బెనారస్ అని కూడా అంటారు. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం లక్నో నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలహాబాద్ నుంచి ఇక్కడకు 121 కిలోమీటర్ల దూరం.

Read more about: holi varanasi

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి