Search
  • Follow NativePlanet
Share
» » కేరళ హౌస్ బోట్ ఆనందాలు !

కేరళ హౌస్ బోట్ ఆనందాలు !

కేరళ రాష్ట్రం అనేక అందమైన ప్రదేశాలు కలిగి వుంది. దీని అందాలకు ముగ్ధులై ఈ రాష్ట్రాన్ని' దేముడి స్వంత దేశం' అని కూడా అంటారు. బోటు విహారాలకు కేరళ ప్రసిద్ధి. ప్రస్తుతం ఇంత ఆకర్షణీయంగా అభివృద్ధి చెందిన ఈ బోట్ల ను , మొదట్లో వివిధ సరకులను అంటే రైస్, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి రవాణా చేసేందుకు ఉపయోగించేవారు. ఈ బోట్లను 'కెట్టు వల్లంస్' అనేవారు.

ఈ కేరళ హౌస్ బోట్లను కాయర్ మరియు వెదురుతో తయారు చేస్తారు. ఈ బోటు లను ఇక్కడివారు అనేక తరాలు ఉపయోగిస్తారు. నేటి రోజులలో ఈ బోటు లు రెండు లేదా మూడు అంతస్తులు కూడా కలిగి విలాసవంత హాళ్ళు, బెడ్ రూములు, వంట గదులు, బాత్ రూములు కూడా కలిగి ఉంటున్నాయి. చెక్క నేలలలను కాయర్ మాట్ లతో రూఫ్ లను కొబ్బరి చెట్ల కాండం తో అలంకరిస్తారు.

సాయంత్రం అయ్యేసరికి వీటిలో సోలార్ దీపాలు వెలుగుతాయి. అలెప్పి మరియు కుమరకోమ్ లలో కల ఈ హౌస్ బోట్లు బ్యాక్ వాటర్స్ లో నిరంతరం విహరిస్తూ వుంటాయి. దీనిలో వసతి పొందే వారు ఆధునిక సౌకర్యాల కొరత ఏ మాత్రం భావించరు. సుఖవంతమైన బెడ్ రూమ్, బాల్కనీ మంచి వసతులు కల లివింగ్ రూమ్, ఆధునిక బాత్ రూమ్, ఒక అదనపు కిచెన్ వంటి సౌకర్యాలతో కేరళలో మీ సెలవులను ఆనందంగా గడిపేయవచ్చు. ఇక్కడ కొన్ని బోటు విహార వివరాలు పేర్కొంటున్నాం పరిశీలించండి.

 కేరళ లో హౌస్ బోటు జల విహారాలు !
కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

లేక్ ల్యాండ్ క్రుఇసేస్ సంస్థ బ్యాక్ వాటర్ టూరిజంలో అగ్రగామి. సౌకర్యవంతమైన, ఆధునిక వసతులు అందిస్తుంది. మంచి నాణ్యత కల, లక్సరీ, డీలక్స్ మరియు సూపర్ లక్సరీ హౌస్ బోటు లను అందిస్తుంది. వీటిలో వివిధ దేశాల ఆహారాలే కాక, క్రమశిక్షణ కల సిబ్బంది ఇచ్చే అతి చక్కని గౌరవ మర్యాదలు కూడా స్వీకరించవచ్చు. వీరికి చెందిన ఈ బోటు లలో వెంబనాడ్ లేక్ తీరంలో ప్రయాణిస్తూ మంత్ర ముగ్ధులను చేసే సుందర దృశ్యాలను చూడవచ్చు.

 కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

కుమరకోమ్ లోకల శివ గంగ హౌస్ బోట్స్ సంస్థ మీకు సింగల్, డబల్ లేదా ట్రిపుల్ బెడ్ రూమ్ వసతులు కల బోటు లను ఇస్తుంది. వీటిలో మీరు ఏ.సి మరియు నాన్ ఏ.సి. రూములు కూడా ఎంపిక చేయవచ్చు. డైనింగ్ హాలు, కిచెన్, సన్ డెక్ కూడా వుంటాయి. కావలసినంత ప్రయివసి మరియు కోరినన్ని రుచి కర , శుభ్రత కల ఆరోగ్యమైన వంటకాలు అందిస్తారు. మీ అవసరాలను తీర్చీటందుకు ముగ్గురు సిబ్బంది కూడా వుంటారు.

కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

డ్రీం బోట్స్ సంస్థ అయిదు బెడ్ రూములు కల బోటు లను కూడా అందిస్తోంది. వీటిలో ఒక ప్రత్యేక రెస్ట్ రూమ్, సన్ డెక్, చైర్ లు, బాత్ రూమ్ లు, కిచెన్ వుంటాయి. ఒక వంటవాడు, డ్రైవర్, కేబిన్ అసిస్టెంట్ కూడా వుంటారు. ఆహారంలో రుచికర ఫిష్ మరియు ఇతర సాంప్రదాయ డిష్ లు వుంటాయి. ఎక్కువమంది సభ్యులు కల కుటుంబాలకు ఇది అనువైనది. పది మంది వరకూ తేలికగా ఆనందించవచ్చు.

 కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

ఎంతో విలాసవంతమైన ఈ హౌస్ బోటు మీకు అల్లెప్పి లో దొరుకుతుంది. ఈ బోటు ల లో ఏ.సి, గదులు కూడా లభిస్తాయి. బోటు ముందు భాగం, లివింగ్ రూమ్ గా వుండి అందులో సోఫాలు, చైర్ లు వుండి, ప్రయాణంలో అనేక సుందర దృశ్యాలు చూపేదిగా వుంటుంది. గదులకు పెద్ద కిటికీలు కూడా వుంటాయి. కిచెన్. గెస్ట్ లు కూడా ఉపయోగించవచ్చు. రైటింగ్ టేబుల్, డ్రెస్సింగ్ మిర్రర్, ప్రత్యేక షవర్ ప్రదేశం, ఇండోర్ గేమ్, సౌకర్యాలు అనేకం కలవు.

కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

అల్లెప్పి లో ఇది ఒక లక్సరీ హౌస్ బోటు. గతంలో ఈ బోటు లలో సుగంధ ద్రవ్యాలను రవాణా చేసేవారు. ఇపుడు ఈ బోటు లను పర్యాటకులకు అందిస్తున్నారు. ఈ సంస్థ కేరళలో అతి గొప్పది. ఈ బోటు లలో కూడా అనేక వసతులు కలవు.

కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

కొల్లంలో కల అల్ సీసన్స్ బోటు సంస్థ కూడా మీక్లు ఫర్నిష్డ్ బోటు లను అందిస్తుంది. వీటిలో లివింగ్ రూమ్, బెడ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్, సన్ డెక్. బాల్కనీ, రెస్ట్ రూమ్ లు కలవు. ఏ.సి, నాన్ ఏ.సి. లు కలవు. సిబ్బంది శిక్షణ కలవారు. బోటు విహారంలో చుట్టూ కల కొబ్బరి తోటలు, వాటర్ లిల్లీస్, అనేక గ్రామాలు చూసి ఆనందించవచ్చు. రుచికరమైన కొబ్బరి బొండాల నీరు తాగుతూ ఎన్నో సుందర దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.

 కార్దమం కేరళ బోటు విహారం

కార్దమం కేరళ బోటు విహారం

అల్లెప్పి లో కల ఈ హౌస్ బోటు రెండు చక్కని ఫర్నిచర్ కల ఏ.సి రూములు కలది. ఈ రూము లకు కార్దమం లోని రెండు రకాల పేర్లను పెట్టారు. అవి గ్రీన్ బోల్డ్ మరియు ఎంజల్లనీ. ఉన్నత సౌకర్యం, నూరు శాతం ప్రయివసి వుంటుంది. ఆధునిక సౌకర్యాలు కల ఈ బోటు కు పెద్ద కిటికీలు కలవు. హుందా అయిన బెడ్ రూమ్ లు, సూట్ బాత్ రూమ్ లు, కిచెన్ వంటివి అన్నీ మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి.

 కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

దివ్యమైన అనుభూతులు ఈ హౌస్ బోటు లో కలుగుతాయి. ప్రశాంతమైన పరిసరాలలో కల ఈ బోటు మీకు బ్యాక్ వాటర్స్ లోని అలల ధ్వని, పక్షులు వేసే ఈలలు కూడా అందిస్తుంది. కిచెన్ సిబ్బంది, మీకు ఎన్నో రకాల ఆహారాలు సిద్ధంగా ఉంచుతారు. చైనీస్, కాంటినెంటల్ , ఇండియన్, స్థానిక కేరళ వంటకాలు లభ్యంగా వుంటాయి. ఈ బోటు దానిలోని లోపలి అలంకరణకు, సిబ్బంది సర్వీస్ కు అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

చేరవల్లీ హౌస్ బోట్స్

చేరవల్లీ హౌస్ బోట్స్

చేరవల్లీ హౌస్ బోట్స్ లో మీకు మరింత వినోదం లభిస్తుంది. ఈ బోటు ప్రత్యేకత అంటే, దీని సిబ్బంది విద్యావంతులు, అనుభవజ్ఞులు, బ్యాక్ వాటర్ పై మంచి అనుభవం కలవారు. చక్కని పరిసరాలను నిర్వహిస్తూ మీకు ఎన్నో విషయాలను విపులీకరిస్తారు. వీరి బోటు లు ఒక బెడ్ రూమ్ నుండి ఆరు బెడ్ రూముల వరకూ కలిగి వుంటాయి. అనేక ఇతర సౌకర్యాలతో పాటు, కాన్ఫరెన్స్ హాలు, బిజినెస్స్ గెస్ట్ సూట్ లు కూడా కలవు.

కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

ఉత్తర కేరళ లో బెకాల్ బోటు స్టే మంచి ప్రదేశం .ప్రశాంతమైన వాతావరణంలో చక్కని దృశ్యాలను అందిస్తుంది. చక్కని ఫర్నిచర్ కల ఈ బోటులో మీకు అవసరమైన అన్ని సౌకర్యాలు వుంటాయి. నోరూరే, కేరళ వంటకాలు వుంటాయి. ఈ ప్రదేశంలో మీరు తెయ్యం, బెకాల్ ఫోర్ట్ మొదలైన బెకాల్ పర్యాటక ఆకర్షణలు కూడా చూడవచ్చు.

 కేరళ బోటు విహారం

కేరళ బోటు విహారం

అల్లెప్పి హౌస్ బోటు లలో మీకు ఒక బెడ్ రూమ్ నుండి ఏడు బెడ్ రూమ్ ల వసతి దొరుకుతుంది. విహారాలకు అవసరమైన ఈ బోటు లలో అన్ని సౌకర్యాలు వుంటాయి. చక్కటి ఆతిధ్య సేవలు లభిస్తాయి. వీటిని ప్రత్యేక హనీమూన్ లకు బుక్ చేసుకోవచ్చు. ఈ బోటు లలో మోటార్ , షికారా, కంట్రీ బోటు లని మూడు రకాలుగా వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X