Search
  • Follow NativePlanet
Share
» » కొత్త ప్రదేశాల పర్యటన !

కొత్త ప్రదేశాల పర్యటన !

ట్రావెల్ పట్ల ఆసక్తి కల ప్రతి వారికి...మళ్ళీ ఏ ప్రదేశానికి ప్లాన్ చేయాలి ? అని ప్రశ్న సహజంగా కలుగుతూనే వుంటుంది. ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయించుకోవటం కొంచెం కష్టమే. కొన్ని సార్లు, చూసిన ప్రదేశాలకే వెళతాము. మరి కొన్ని సార్లు కొత్త ప్రదేశాలకు వెళతాము. కొన్ని సార్లు, అసలు ఎక్కడకు వెళ్ళాలనేది నిర్నయిన్చుకోలేము. ఇటువంటపుడే, మా నేటివ్ ప్లానెట్ సహాయం తీసుకోండి. మేము ఎన్నో ప్రదేశాలు, ట్రావెల్ చిట్కాలు అందించి మీ అభిరుచులను అధికం చేస్తాం. ఇక అపుడు మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నేరుగా వెళ్ళగలరు.

 కొత్త ప్రదేశాల పర్యటన !

మొదటగా మీకు తెలిసిన ప్రదేశాలన్నిటిని ఒక జాబితా చేయండి. ఆ జాబితాలోని ప్రదేశాలన్నీ మీరు సందర్సిన్చారా ? లేదా అనేది చెక్ చేసుకోండి. అలా చేయకుంటే, ఇపుడు చేయండి. మీరు తప్పక కొన్ని ప్రదేశాలను మిస్ చేసే వుంటారు. ఉదాహరణకు సౌత్ ఇండియా లోని వారు హిమాలయాలలోని ప్రదేశాలకు ట్రెక్కింగ్ కు ఎన్నో మార్లు వెళతారు. కాని పక్కనే కల పడమటి కనుమల సందర్శన ఆనందించరు. చాలా మంది, టూర్ పేకేజ్ అంటూ అనేక ప్రదేశాలు వదిలేస్తారు. ప్రధాన ప్రదేశాలు వరకూ చూస్తారు. ఉదాహరణకు తాజ్ మహల్. ఇది సాధారణంగా అన్ని పేకేజ్ లలో వుంటుంది. అదే ప్రదేశంలో కల ఇతర ఆకర్షణలు కూడా లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే. పేకేజ్ లంటూ కొన్నిటికే పరిమితం కారాదు.

మరి పాకేజ్ లేకుండా కూడా అన్ని ప్రాంతాలూ పర్యటించవచ్చు. తరచి చూస్తె, దేశంలో ని ఎన్నో ప్రదేశాలలో మన పరిచయస్తులు, స్నేహితులు లేదా బంధువులు వుంటూనే వుంటారు. కొంతమందికి విదేశాలలో సైతం తెలిసిన వారు వుంటారు. అయితే, మీరు వారితో సత్సంబంధాలు నిర్వహించాలి సుమా ! వారి ప్రదేశాలలో కల పర్యాటక ఆకర్షనలను గురించి తెలుసుకోనండి. వారి సహాయ సహకారాలతో అందుబాటులోని అన్ని ప్రదేశాలు చూసి ఆనందించండి.

ప్రదేశ ఎంపిక ఎలా ? ముందుగా మీరు ఏది ఇష్ట పడతారు ? అనేది నిర్ణయం చేసికోనండి. అడ్వెంచర్ ? రొమాన్స్ ? విశ్రాంతి ? హిమ పాతం ? వంటి ఆసక్తులు మీ ట్రావెల్ ప్రదేశాన్ని నిర్ణయిస్తాయి. బడ్జెట్ విషయంలో తప్పక జాగ్రత్త పడాలి. విదేశాలకు వెళ్ళేంత బడ్జెట్ చేయక పోయినా, దేశంలో కొన్ని ప్రదేశాలకు అంటే గోకర్ణ లేదా గోవా లాంటివి తిరిగి ఆనందించవచ్చు.

అన్నిటికి మించి ట్రావెల్ లో ఉత్సాహంగా పర్యటించేందుకు తగిన స్నేహితులను ఎంచుకోవాలి. అపుడే మీ పర్యటన ప్రతి ప్రదేశంలో విజయవంతమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X