Search
  • Follow NativePlanet
Share
» » అతి తక్కువ ఖర్చులో అన్ని ప్రదేశాలు - ఢిల్లీ !

అతి తక్కువ ఖర్చులో అన్ని ప్రదేశాలు - ఢిల్లీ !

ముందుగా ఢిల్లీ మెట్రో రైల్ వ్యవస్థ కు మనం థాంక్స్ చెప్పాలి. ఢిల్లీ లోని కొన్ని ఆకర్షణలు చూసేందుకు మెట్రో రైలు ప్రయాణం ఎంతో తేలిక.

మీ జేబులు పూర్తిగా ఖాళీ కాకుండా, ఢిల్లీ నగరం అయిదు వందల రూపాయలతో చుట్టి రావచ్చు అంటే నమ్ముతారా ? అదెలా ? చూడండి. ఢిల్లీ లో పర్యాటకులు చూసేందుకు ఎన్నో ఆకర్షణలు కలవు. ఇవి అన్నీ కూడా అధిక వ్యయం లేకుండా చూడవచ్చు. ముందుగా ఢిల్లీ మెట్రో రైల్ వ్యవస్థ కు మనం థాంక్స్ చెప్పాలి. ఢిల్లీ లోని కొన్ని ఆకర్షణలు చూసేందుకు మెట్రో రైలు ప్రయాణం ఎంతో తేలిక. ఈ ఆకర్షణ ప్రదేశాలు అన్నీ కూడా మన చరిత్రతో ముడి పడి వున్నాయి. మరి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కితే ఢిల్లీ లోని పర్యాటక ఆకర్షణలు ఏమి చూడవచ్చు అనేది పరిశీలిద్దాం.

చాందిని చౌక్

చాందిని చౌక్

మీరు మెట్రో ప్రయాణంలో చాందిని చౌక్ లో దిగితే ఇక్కడ నుండి అనేక టూరిస్ట్ ఆకర్షణలు చూడవచ్చు. ఈ ప్రదేశం యెల్లో లైన్ లో కలదు. ఇక్కడ మీరు చూసే ఆకర్షణలు, గౌరీ శంకర్ టెంపుల్, దిగంబర్ జైన్ టెంపుల్, సీష్ గంజ్ గురుద్వారా, రెడ్ ఫోర్ట్, ఫతేపూర్ మసీద్, జామా మసీద్ మరియు సలీం ఘడ్ ఫోర్ట్.

రాజీవ్ చౌక్

రాజీవ్ చౌక్

రాజీవ్ చౌక్ బ్లూ లైన్ లో వుంటుంది. ఈ ప్రదేశం ఢిల్లీ లో షాపింగ్ ప్రియుల కేంద్రం. ఇక్కడ మీరు కొన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, జనపథ్, లక్ష్మి నారాయణ్ మందిర్, బంగ్లా సాహిబ్ గురుద్వారా మరియు బాబా ఖారాక్ సింగ్ మార్గ స్టేట్ ఎంపోరియం లు చూడవచ్చు.

ఇంద్రప్రస్థ

ఇంద్రప్రస్థ

ఇంద్రప్రస్థ బ్లూ లైన్ లో కలదు. ఈ ప్రదేశంలో మీరు మెట్రో దిగితే, గార్డెన్ అఫ్ ఫైవ్ సెన్సెస్ మరియు కుతుబ్ మినార్ లు చూడవచ్చు.

సెంట్రల్ సెక్రటరియేట్

సెంట్రల్ సెక్రటరియేట్

సెంట్రల్ సెక్రటరియేట్ యెల్లో లైన్ లో కలదు. ఇక్కడ మెట్రో రైలు దిగిన మీరు ఇండియా గేటు, ఇందిరా గాంధి మెమోరియల్, జవహర్ లాల్ నెహ్రు మెమోరియల్, పురానా కిలా, సంస్కృతి మ్యూజియం, రాష్ట్ర పతి భవన్, లోడి గార్డెన్, నేషనల్ గేలరీ అఫ్ మోడరన్ ఆర్ట్, ది పార్లమెంట్ హౌస్, బిర్లా మందిర్, సఫ్దర్జంగ్ టూంబ్, నేషనల్ జూలాజికల్ పార్క్, నేషనల్ రైల్ మ్యూజియం మొదలైన ఆకర్షణలు చూడవచ్చు.

ప్రగతి మైదాన్

ప్రగతి మైదాన్

ప్రగతి మైదాన్ లో ఎక్కువగా ఎక్సిబిషన్ లు నిర్వహిస్తారు. లేదా నాటకాలు వేస్తారు. ఇక్కడ నుండి మీరు హస్త కళల మ్యూజియం, నేషనల్ సైన్సు సెంటర్ మొదలైన ఆకర్షణలు చూడవచ్చు.

అక్షర ధాం

అక్షర ధాం

అక్షర ధాం మెట్రో స్టేషన్ బ్లూ లైన్ లో కలదు. ఇక్కడ మీరు అతి పెద్దదైన అక్షర ధాం టెంపుల్ చూడవచ్చు.
Photo Courtesy: Nikhil K

జోర్ బాగ్

జోర్ బాగ్

జోర్ బాగ్ మెట్రో స్టేషన్ యెల్లో లైన్ లో పడుతుంది. ఇక్కడ కల పర్యాటక ఆకర్షణలు, హుమాయూన్ టూంబ్, సఫ్దర్ జంగ్ టూంబ్ లోది గార్డెన్, హజరత్ నిజాముద్దీన్ దర్గా , ఇండియా హబిటాట్ సెంటర్ లు చూడవచ్చు
Photo Courtesy: Haneesrivastava

కల్కాజి టెంపుల్

కల్కాజి టెంపుల్

కల్కాజి టెంపుల్ మెట్రో స్టేషన్ వయలేట్ లైన్ లో కలదు. ఇక్కడ మీరు కల్కాజి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, లోటస్ టెంపుల్ లు చూడవచ్చు. Photo Courtesy: Arian Zwegers

రేస్ కోర్స్

రేస్ కోర్స్

యెల్లో లైన్ మెట్రో లో కల రేస్ కోర్స్ స్టాప్ లో దిగి మీరు గాంధి స్మృతి , బిర్లా హౌస్ మొదలైనవి చూడవచ్చు.

Photo Courtesy: Poco a poco

Read more about: delhi ఢిల్లీ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X