» »భాగ్యనగరంలో కూల్ కూల్ గా స్నో వరల్డ్ ! ఎంజాయ్ చేద్దామా !

భాగ్యనగరంలో కూల్ కూల్ గా స్నో వరల్డ్ ! ఎంజాయ్ చేద్దామా !

Posted By: Venkata Karunasri Nalluru

వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి నుంచి ఉపశమనం కోసం చాలామంది ఏ ఊటీకో లేక కొడైకెనాల్కో వెళతారు. కానీ ఈ అవసరమే లేదు. -5డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో హిమాలయాల్లో వున్న అనుభవాన్ని మనముందుకు తెచ్చింది స్నో వరల్డ్.

స్నో వరల్డ్ అనగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రెండు ఎకరాల స్థలంలో ఉన్న ఒక వినోద ఉద్యానవనం. ఇందిరా పార్క్ పక్కన మరియు హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి ఉన్న ఈ పార్క్ 28 జనవరి 2004 న ప్రారంభించబడింది. స్నో వరల్డ్ అనే అమ్యూజ్మెంట్ పార్క్ ఈ తరహా పార్కులలో దేశంలోనే మొట్టమొదటిది.2004లో పర్యాటకులకు అందుబాటులోకొచ్చింది ఈ పార్క్. ఇక్కడ ఒక్కరోజులో 2400 మంది పర్యాటకులు వినోదించవచ్చును.

ఇది ఎక్కడో తెలుసా? అదేనండి.. మన హైదరాబాద్ లో లోయర్ ట్యాంక్ బండ్ కు దగ్గరలోనే వుందండీ.

హైదరాబాద్ లో కూల్ కూల్ గా స్నో వరల్డ్ !

1. స్నో వరల్డ్

1. స్నో వరల్డ్

స్నో వరల్డ్ అనగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రెండు ఎకరాల స్థలంలో ఉన్న ఒక వినోద ఉద్యానవనం.

PC: wikimedia.org

2. ప్రారంభం

2. ప్రారంభం

ఇందిరా పార్క్ పక్కన మరియు హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి ఉన్న ఈ పార్క్ 28 జనవరి 2004 న ప్రారంభించబడింది.

PC:Rameshng

3. నెంబర్ 1

3. నెంబర్ 1

స్నో వరల్డ్ అనే అమ్యూజ్మెంట్ పార్క్ ఈ తరహా పార్కులలో దేశంలోనే మొట్టమొదటిది.

PC:Rameshng

4. పర్యాటకుల వినోదం

4. పర్యాటకుల వినోదం

2004లో పర్యాటకులకు అందుబాటులోకొచ్చింది ఈ పార్క్. ఇక్కడ ఒక్కరోజులో 2004 మంది పర్యాటకులు వినోదించవచ్చును.

PC:Rameshng

5. టన్నులకొద్ది మంచు

5. టన్నులకొద్ది మంచు

కృత్రిమంగా తయారుచేసిన మంచు ఈ పార్క్ లో కురిపిస్తున్నారు.టన్నులకొద్ది మంచు పొరలుపొరలుగా నేలపై పరచబడి వుంటుంది.

PC:Rameshng

6. మంచుముద్దలు

6. మంచుముద్దలు

పర్యాటకులు ఈ మంచుముద్దలతో ఆడుకోవచ్చును.మంచు మనిషిని నిర్మించవచ్చును.

PC:Rameshng

7. చిన్నపిల్లలు

7. చిన్నపిల్లలు

చిన్నపిల్లలు ఈ మంచును నోటిలో పెట్టుకున్నా మంచినీటితో చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందీ వుండదు.

PC:Rameshng

8. ఉన్ని వస్త్రాలు

8. ఉన్ని వస్త్రాలు

ఈ పార్క్ లోపలి వెళ్లే ముందు పర్యాటకులు ఉన్ని వస్త్రాలు ధరించాలి.పార్క్ లోకి వెళ్ళగానే శరీరాన్ని వెచ్చగా వుంచటానికి ఓ కప్ వేడి సూప్ ని ఇస్తారు.

PC:Rameshng

9. పార్క్ లోపల వినోద వసతులు

9. పార్క్ లోపల వినోద వసతులు

పార్క్ లోపల స్నో ట్యూబ్ స్లయిడ్ ,ఐస్-బుమ్పింగ్ కార్స్, ఐస్ స్కేటింగ్ రింక్, స్నో వార్ జోన్ అండ్ స్లెఇఘ్ స్లైడ్స్ వంటి వినోద వసతులు ఉన్నాయి.

PC:Rameshng

10. కృత్రిమ మంచు

10. కృత్రిమ మంచు

రెండు వందల టన్నుల కృత్రిమ మంచును ఇక్కడ గచ్చు మీద పొరలుగా వేశారు, ఈ మంచు కరిగి ప్రవహించకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.

PC:Rameshng

11. సౌకర్యాలు

11. సౌకర్యాలు

ప్రతిరోజు మంచు యొక్క పై పొర శుభ్రపరుస్తారు మరియు దీనిలో అదనంగా రెండు మూడు టన్నుల మంచు ఉత్పత్తి చేసే సౌకర్యాలున్నాయి, ఈ మంచును పై పొరగా ఉపయోగిస్తారు.

PC:Rameshng

12. సాంకేతిక పరిజ్ఞానం

12. సాంకేతిక పరిజ్ఞానం

కృత్రిమ మంచుగళ్లు తయారు చేయడానికి ఆస్ట్రేలియా నుండి తెప్పించిన పేటెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.

PC:Rameshng

13. ప్రపంచంలో అతిపెద్దది

13. ప్రపంచంలో అతిపెద్దది

ఈ ప్రత్యేక స్నో సౌకర్యం స్థానిక పర్యాటక శాఖ సహకారంతో నిర్మింతమైంది. ఇది భారతదేశంలో మొదటిది మరియు ప్రపంచంలో అతిపెద్దది మరియు మలేషియా మరియు సింగపూర్ లో ఉన్నటు వంటి స్నో పార్క్ ల తరువాత మూడవది.

PC:Rameshng