» »అంతు చిక్కని రాధాకృష్ణుల రాసలీలా ప్రతిరోజు ఈ ఆలయంలో ?

అంతు చిక్కని రాధాకృష్ణుల రాసలీలా ప్రతిరోజు ఈ ఆలయంలో ?

Written By: Venkatakarunasri

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం.ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు.

నిధివన్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది రాధాకృష్ణ ఆలయం మధురలో వుంది. ఈ ప్రాంతంలో ఆబాలగోపాలుడు చిన్నతనంలో ఇక్కడ గడిపాడని నమ్ముతారు. అందుకే దీనిని బృందావన్ అంటారు. నిధివన్ కూడా అత్యంత రహస్యమైన ప్రాంతాలలో ఒకటి. ఈ నిధివన్ ఆలయం చుట్టూ దట్టమైన వనం వుంటుంది. ఈ వనంలో రాధాకృష్ణులు ప్రతిరోజూ విహరిస్తారని నమ్ముతారు.అందుకే ఈ ప్రాంతంలోకి ఎవ్వరినీ సాయంత్రం తర్వాత అనుమతించరట. ఈ వనంలోని చెట్లు అన్నీ ఒకేమాదిరిగా వుంటాయి. వీటిని గోపికలుగా భావిస్తారు. ఈ వనంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారికి కీడు జరుగుతుందని పిచ్చి వారిలా అవుతారని అక్కడి స్థానికులు నమ్ముతారు. అందుకే రాత్రిపూట ఇక్కడికి వెళ్ళటానికి సాహసించరు.

అంతు చిక్కని రాధాకృష్ణుల రాసలీలా ప్రతిరోజు ఈ ఆలయంలో ?

ఈ నెలలో టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

రామాయణ మహాకావ్యం

రామాయణ మహాకావ్యం

మథురకు పురాణ కాలంనుండి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది.

PC:youtube

రామాయణ మహాకావ్య నాయకుడు

రామాయణ మహాకావ్య నాయకుడు

ఇక్ష్వాకు రాజకుమారుడూ దశరథ చక్రవర్తి కుమారుడూ రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కథనం.

PC:youtube

నామాంతరం

నామాంతరం

తరువాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనంగానూ మథుపురంగానూ మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం.

PC:youtube

నిశిత పరిశోధనలు

నిశిత పరిశోధనలు

నిశిత పరిశోధనలు లవణాసురుడు శివభక్తుడూ శివునినుండి త్రిసూలాన్ని వరంగా పొందిన మధువు సంతతివాడనీ ఆకారణంగా ఈ నగరానికి మథుర అనే పేరు వచ్చినట్లు చెప్తున్నాయి.

PC:youtube

యాదవరాజైన మథు

యాదవరాజైన మథు

యాదవరాజైన మథు పేరుమీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లూ పురాణాల కథనం. ఇలా ఈ నగర పేరుకి సంబంధించి పలు కారణాలు పురాణాలలో ప్రస్తావించబడినాయి.

PC:youtube

రంగ్ మహల్

రంగ్ మహల్

ఇక్కడ రంగ్ మహల్ అనే చిన్న మందిరంలో రాధాకృష్ణుల కోసం ఒక మంచాన్ని అలంకరించి వారికోసం నాలుగు స్వీటు పదార్థాలను తమలపాకులు, వక్కలు, ప్రతిరోజూ సాయంత్రం అక్కడ వుంచి గుడి యొక్క తలుపులు, కిటికీలు మూసివేసి తలుపుకు తాళం వేస్తారు.

PC:youtube

పూజారి ఆలయం

పూజారి ఆలయం

మరుసటి రోజు పూజారి ఆలయం తలుపులు తెరిచే సరికి తమలపాకులు నమిలివేసిన గుర్తులు అక్కడ కనిపిస్తాయంట. ఈ ఆలయంలోకి అందుకే ఎవ్వరినీ వెళ్ళనివ్వరు.

PC:youtube

విచిత్రం

విచిత్రం

విచిత్రం ఏంటంటే ఈ వనంలో ఎలాంటి పక్షులు కానీ జంతువులు కానీ వుండవు. హారతి అయిన తర్వాత కోతులు కూడా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతాయంట.

PC:youtube

బృందావనంలోకి

బృందావనంలోకి

గుడి యొక్క తలుపులను, కిటికీలను మూసివేసి గేటుకు తాళం వేస్తారంట. ఎవ్వరూ ఆలయంలోంకి బృందావనంలోకి తొంగి కూడా చూసే ధైర్యం చేయరంట.

PC:youtube

చరిత్రకారులు, సైంటిస్టులు

చరిత్రకారులు, సైంటిస్టులు

స్థానికులు ఆలయంలోకి శబ్దాలు వినిపిస్తాయని చెప్తారంట. చరిత్రకారులు, సైంటిస్టులు ఈ మిస్టరీని చేధించాలనే ప్రయత్నం నుంచి విరమించుకున్నారంట.

PC:youtube

కృష్ణుని మహిమ

కృష్ణుని మహిమ

వారు కూడా అది కృష్ణుని మహిమగా భావించి వుండవచ్చును. కుదిరితే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించి మనం కూడా ఈ అద్భుతాన్ని చూడాల్సిందే.

PC:youtube

శాంతి, అనందం

శాంతి, అనందం

శ్రీకృష్ణుడు తిరిగిన ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మనస్సుకు శాంతి, అనందం కలుగుతాయని నమ్ముతారు.

PC:youtube

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

Please Wait while comments are loading...