» »దెయ్యాలు కట్టిన శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

దెయ్యాలు కట్టిన శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

By: Venkata Karunasri Nalluru

మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు వున్నాయి. వాటిని దేవతలో, మహర్షులో, మునులో లేదా ఆతర్వాత రాజ్యాధికారంలో కొచ్చిన నిర్మించి పోషించేవారు.కానీ దేవతల చేత కాకుండా మునుల చేత కాకుండా నిర్మితమైన దేవాలయం గురించి మీకు తెలుసా? అయితే ప్రస్తుతం వెలుగొచ్చిన దేవాలయం గురించి వింత విషయాలు వినపడుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కర్ణాటకలోని బొమ్మావర వెళ్ళాల్సిందే. దొడ్డబల్లాపూరం, దేవనహళ్లి మార్గమధ్యంలో వున్న బొమ్మావర సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయట.

600 సంవత్సరాల క్రితం ఈ వూరిలో దెయ్యాల బుచ్చయ్య అనే దెయ్యాల మాంత్రికుడుండేవాడట. అప్పట్లో ఊరినిండా దెయ్యాలే వుండేవట. అయితే ఒక ఆలయం నిర్మిద్దామనే ఆలోచనతో మాంత్రికుడు ఒక దేవాలయాన్ని నిర్మిస్తే రాత్రికిరాత్రే ఆలయాన్ని పడగొట్టేశాయట ఆ దెయ్యాలు.

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

దెయ్యాలు కట్టిన శివాలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

1. కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు

1. కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు

కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు తన శక్తులతో ఆ దెయ్యాలను వశపరచుకుని ఆ దెయ్యాల జుట్టు కత్తిరించి తన దగ్గర వున్న రోకలికి వాటిని కట్టిపడేశాడట.

pc:youtube

2. దేవాలయం

2. దేవాలయం

తమ జుట్టు తమకివ్వమని ఆ దెయ్యాలు మొరపెట్టుకోగా ఆ దేవాలయం యధాతధంగా నిర్మించమని ఆదేశించాడట.

pc:youtube

3. బొమ్మావరవాసులు

3. బొమ్మావరవాసులు

మరి మాంత్రికుడి ఆజ్ఞ మేరకు ఆ దెయ్యాలు ఆలయం తిరిగి నిర్మించాయట. ప్రస్తుతం బొమ్మావరవాసులు చెప్పే కథ ఇదే.

pc:youtube

4. అయితే ఇప్పటివరకు

4. అయితే ఇప్పటివరకు

మనం చూసిన గుడులపై దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు మనం చూశాం. కానీ ఈ గుడిపై దెయ్యాల బొమ్మలు కనిపిస్తాయి.

pc:youtube

5. ఆలయంపై బొమ్మలు

5. ఆలయంపై బొమ్మలు

దెయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అంటున్నారు. ఇక ఇదిలావుంటే ఈ ఆలయం నిర్మించారే కానీ అందులో ఎటువంటి విగ్రహం ప్రతిష్టించలేదట.

pc:youtube

6. త్రాగునీటి చెరువు

6. త్రాగునీటి చెరువు

గత 50 సంవత్సరాల క్రితం వరకు గర్భగుడి ఖాళీగానే వుండేదట. అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామశివార్లలో వున్న త్రాగునీటి చెరువులో త్రవ్వుతుండగా 8 అడుగుల శివలింగం లభించిందట.

pc:youtube

7. సుందరేశ్వర దేవాలయం

7. సుందరేశ్వర దేవాలయం

ఆ లింగాన్ని తీసుకొచ్చి ఖాళీగా వున్న దేవాలయంలో ప్రతిష్టించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారు ఆ దేవాలయానికి.

pc:youtube

8. ఎత్తైన లింగాలు

8. ఎత్తైన లింగాలు

ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని దేశంలో ఐదు చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలు వున్నాయని గ్రామస్థులు చెపుతూవుంటారు.

pc:youtube

9. గ్రామస్థులు

9. గ్రామస్థులు

మరి నిజంగానే ఈ దేవాలయాన్ని దెయ్యాలు నిర్మించాయని ఈ గ్రామస్థులు ఇప్పటికీ నమ్ముతున్నారు.

pc:youtube

10. దెయ్యాలు కట్టిన శివాలయం

10. దెయ్యాలు కట్టిన శివాలయం

దెయ్యాల బాధ ఉన్నవారు ఈ దేవాలయాన్ని దర్శిస్తారట.

pc:youtube

Please Wait while comments are loading...