» »ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట !

ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట !

Written By: Venkatakarunasri

LATEST: మహేంద్ర సింగ్ ధోని బాల్యం గడిచిన ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా?

శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూసారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలోని జిల్లాలలో త్రిసూర్ జిల్లా ఒకటి. దీనిని త్రిచూర్ అని కూడా అంటారు.

జిల్లాలో పురాతన ఆలయాలు, చర్చిలు మరియు మసీదులు ఉన్నాయి. త్రిసూర్ పూరం మహోత్సవం కేరళ రాష్ట్రంలో వరణరంజితమైన ఉత్సవాలలో ఒకటిగా భావించబడుతుంది. త్రిసూర్ అనే పేరుకు మూలం " తిరు- శివ - పేరూర్ " పరమశివుని పేరు కలిగిన నగరం ఇది. పురాతన కాలంలో త్రిసూర్‌ " వ్రిషంభాద్రిపురం " మరియు "కైలాసం " (దక్షుణ కైలాసం " అని కూడా పిలువబడింది.

మరొక కథనం అనుసరించి " త్రి- శివ - పేరూర్ " అంటే మూడు శివాలయాలు ఉన్న పెద్ద ఊరు అని కూడా అర్ధం. అందుకు నిదర్శనంగా ఈ ప్రాంతంలో వడక్కునాథన్ ఆలయం, అశోకేశ్వరం శివాలయం మరియు ఇరత్తచిరా శివాలయం అనే మూడు ఆలయాలు ఉన్నాయి. వంచి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చేరచక్రవర్తులు కేరళ రాష్ట్రంలోని అత్యధిక భాగాన్ని పాలించారు.

కొడుంగల్లోర్ " ప్రీమియం ఎంపోరియం ఇండియా " గా గుర్తించబడుతుంది. మలబార్ (ఉత్తర కేరళ) అభివృద్ధికి సహకరిస్తున్న మూడు సమూహాలకు (క్రైస్తవులు, జ్యూలు మరియు ముస్లిములు) కొడుంగల్లోర్ ఆశ్రయం కల్పిస్తుంది.

త్రిసూర్ ప్రాంతాన్ని 9-12 శతాబ్దాలలో మహోదయపురానికి చెందిన కులశేఖరాలు పాలించారు. 12వ శతాబ్దం తరువాత త్రిసూర్ చరిత్రలో పెరుంపడప్పు స్వరూపం చోటుచేసుకుంది. 1790 లో రాజా రాం వర్మ(శక్తన్ తంబురాన్) (1790-1805) కొశ్చిన్ సామ్రాజ్య సింహాసనం అధిరోహించాడు.

ఆ ఆలయంలో శివలింగం కంటికి కనపడదట..

1. త్రిసూర్

1. త్రిసూర్

త్రిసూర్ లో పెరియార్ నది, చలకుడి నది, కురుమలి నది (కురువన్నూర్ నదికి ఉపనది) మరియు పొన్నై (భారతపుళా) మొదలైన నదులు ప్రవహిస్తున్నాయి.

pc: Gayatri13

2. అరేబియన్ సముద్రం

2. అరేబియన్ సముద్రం

నదులన్ని తూర్పున ఉన్న పర్వతాలలో జన్మించి అక్కడ నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియన్ సముద్రంలో కలుస్తున్నాయి.

pc:Adarsh Padmanabhan

3. అథిరపల్లి జలపాతాలు

3. అథిరపల్లి జలపాతాలు

ఈ ప్రధాన నదులలో పలు ఉపనదులు సంగమిస్తున్నాయి. జిల్లాలో అథిరపల్లి జలపాతాలు (భారతీయ నయాగరాఅంటారు) ఉన్నాయి.

pc:Sarinsoman

4. ఆర్కియాజికల్ సంపద

4. ఆర్కియాజికల్ సంపద

త్రిసూర్ ఆర్కియాజికల్ సంపద, చారిత్రక మరియు సాంస్కృతిక సంప్రదాయంతో సుసంపన్నమై ఉంది.

pc:Aruna

5. త్రిసూర్ పూరం ఉత్సవం

5. త్రిసూర్ పూరం ఉత్సవం

ఇది కేరళ సాంస్కృతిక కేంద్రంగా గుర్తించబడుతుంది. త్రిసూర్ పూరం ఉత్సవం త్రిసూర్‌కు ప్రత్యేకత కలిగిస్తుంది.

pc:Adarsh Padmanabhan

6. త్రిసూర్‌

6. త్రిసూర్‌

జిల్లా వివిధ సహజసంపదలను కలిగి ఉంది. అందమైన కేరళ భూభాగం త్రిసూర్‌తో మొదలౌతుంది. ప్రశాంతమైన అందమైన చిన్న చిన్న గ్రామాలు నిరంతరంగా ప్రవహించే నదులు సహజ సౌందర్యానికి మెరిగులు దిద్దుతున్నాయి.

pc:Mullookkaaran

7. కేరళ సాహిత్య అకాడమీ

7. కేరళ సాహిత్య అకాడమీ

పురాతన సంప్రయ కేంద్రమైన త్రిసూరులో కేరళ కాలమండలం, కేరళ సాహిత్య అకాడమీ, కేరళ లలితకాళా అకాడమీ మరియు కేరళ సంగీత నాడక అకాడమీ (త్రిస్సూర్) సాంస్కృతిక కళాకేంద్రాలు ఉన్నాయి.

pc:Rkrish67

8. త్రిసూర్ నగరం

8. త్రిసూర్ నగరం

వడక్కునాథన్ శివాలయం ఉన్న కొండ చుట్టూ త్రిసూర్ నగరం అభివృద్ధి చెందింది. పురాతన కేరళ నిర్మాణ సంప్రదాయానికి ఆలయం ప్రతిబింబంగా ఉంది.

pc:Jayeshj

9. పవిత్ర ఆలయాలు

9. పవిత్ర ఆలయాలు

జిల్లాలో పలు పవిత్ర ఆలయాలు ఉన్నాయి. మాలిక్ బిన్ దీనార్ మరియు 20 మంది ముహమ్మద్ (ఇస్లాం మత స్థాపకుడు) అనుయాయులు భారతదేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా త్రిసూరులోని కొడుగనల్లుర్‌లో అడుగుపెట్టారు.

pc:Rkrish67

10. చెర్మన్ జుమా మసీద్

10. చెర్మన్ జుమా మసీద్

ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇస్లాంకు రాజమర్యాద పొందిన తరువాత భారతదేశం అంతటా విస్తరించింది. మాలిక్ బిన్ దీనార్ నగరంలో " చెర్మన్ జుమా మసీద్ " నిర్మించాడు.

pc:Aruna

11. రెండవ మసీదు

11. రెండవ మసీదు

చెర్మన్ జుమా మసీద్ హిందూ ఆలయ శైలిలో నిర్మించబడింది. ప్రపంచంలో మదినా తరువాత నిర్మించబడిన రెండవ మసీదుగా ఇది భావించబడుతుంది.

pc:Manojk

12. త్రిసూరు

12. త్రిసూరు

గురువాయూర్‌లో ప్రఖ్యాత కృష్ణుని ఆలయం ఉంది. ఇది త్రిసూరుకు 25 కి.మీ దూరంలో ఉంది.

pc:Krish9

13.చవకడి మరియు కున్నంకుళం

13.చవకడి మరియు కున్నంకుళం

ప్రంపంచంలోని హిందువులు అందరూ ఇక్కడకు కృష్ణుని దర్శనార్ధం వస్తుంటారు. చవకడి మరియు కున్నంకుళం వరుసగా ముస్లిములకు మరియు క్రైస్తవులకు యాత్రా స్థాలాలుగా ఉన్నాయి.

pc:Challiyan

14. మూడు ప్రసిద్ధ శ్రీరాముని ఆలయాలు

14. మూడు ప్రసిద్ధ శ్రీరాముని ఆలయాలు

త్రిప్రయార్ ఆలయం మరొక ప్రముఖ ఆరాధనా ప్రాంతంగా ఉంది. కేరళ రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ శ్రీరాముని ఆలయాలలో ఇది ఒకటి.

15. కడవల్లూరు రామాలయాలు

15. కడవల్లూరు రామాలయాలు

మిగిలిన రామాలయాలలో తిరువిల్వమాల ఆలయం మరియు కడవల్లూరు రామాలయాలు ప్రధానమైనవి.

16. త్రిశూర్

16. త్రిశూర్

కేరళ చరిత్రలో సాంస్కృతిక రాజధానిగా వెలసిన త్రిశూర్ లో వున్న వాడక్కున్నాథన్ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెప్తారు.

17. పురాతన ఆలయం

17. పురాతన ఆలయం

పురాతన చారిత్రక ప్రాశస్త్యమున్న ఈ ఆలయం అనేక కళలకు నిలయం. పురాతన ఆలయం అని చెప్తున్నారు కదా మరి శివలింగం వుండకపోవటం ఏమిటి ? అనుకోకండి.

18. నెయ్యితో అభిషేకాలు

18. నెయ్యితో అభిషేకాలు

ఇక్కడ శివలింగం వుంది. కానీ వందల సంవత్సరాలుగా ఈ శివలింగానికి నెయ్యితో అభిషేకాలు చేసిచేసి అది ఒక గుట్టలాగ పేరుకుపోయిందని అంటున్నారు.

19. శివలింగం

19. శివలింగం

దాదాపు 5,6మీటర్ల ఎత్తున్న నెయ్యి గుట్ట కింద శివలింగం కప్పబడిపోయిందట.

20. నెయ్యి

20. నెయ్యి

ఆ నెయ్యి కాస్త గడ్డకట్టుకుని పోయిందట.

21. మండే ఎండలోనూ కరగదు

21. మండే ఎండలోనూ కరగదు

అది మండే ఎండలోనూ కరగదు. వాసనను వెదజల్లదు.

22. ఏడాదిలోపు పిల్లలు

22. ఏడాదిలోపు పిల్లలు

ఏడాదిలోపు పిల్లలను ఈ ఆలయం లోపలకు అనుమతించరు.

23. సాంప్రదాయక వస్త్రధారణ

23. సాంప్రదాయక వస్త్రధారణ

ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే సాంప్రదాయక వస్త్రధారణ తప్పనిసరి. మహాశివరాత్రి పర్వదినాన లక్షదీపాల అలంకరణతో తేజోవంతంగా భాసిల్లుతూ భక్తులకు కనువిందుచేయటం ఈ ఆలయం ప్రత్యేకత.

24. ఏకైక శివాలయం

24. ఏకైక శివాలయం

ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటేనేమో!

25 .ఎలా చేరాలి

25 .ఎలా చేరాలి

వడక్కునాథన్ శివాలయం
pc:google maps