Search
  • Follow NativePlanet
Share
» »డామన్ ... తెలియని ప్రదేశాలు !

డామన్ ... తెలియని ప్రదేశాలు !

మీరు సెలవుల్లో అద్భుతమైన సహజ అందాన్ని మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశాలు చూడాలంటే డామన్ మరియు డయ్యు సందర్శించాలి. ఇది ఇండియా యొక్క కేంద్రపాలిత ప్రాంతం. ఈ జిల్లాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు, 450 సంవత్సరాల క్రితం నుండి పోర్చుగీస్ సంస్కృతితో ఉన్నాయి మరియు డిసెంబర్ 19, 1961 సంవత్సరంలో గోవాతో పాటుగా, వీటిని భారత గణతంత్ర రాజ్యం యొక్క భాగంగా ప్రకటించారు. డామన్ మరియు డయ్యు ప్రారంభ కాలంలో అనేక యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచాయని చరిత్ర చెపుతున్నది. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, పోర్చుగీస్ మరియు మరాఠీ ఈ రెండు జిల్లాలలో ప్రధానంగా మాట్లాడే భాషలు. ఇక ఇక్కడున్న వింతలూ, విశేషాలు తెలుసుకుందామా...

జలంధర్ బీచ్

జలంధర్ బీచ్

ఇది డయ్యు నగరానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నది.ఈ బీచ్ కు ఒక రాక్షసుడి పేరు పెట్టారు. ఇతని విగ్రహం సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద ఉన్నది.జలంధర్ బీచ్ మనోహరంగా, శాంతిగా మరియు ప్రశాంతంగా ఉన్న ఒక స్వర్గంలాగా ఉంటుంది. సెలవు రోజుల్లో హాయిగా, ప్రశాంతంగా గడపటానికి వస్తారు. వారు ఇక్కడి మెత్తటి ఇసుకతిన్నెల మీద సేద తీరుతున్నప్పుడు, వారిమీదుగా సముద్రపుగాలులు మత్తుగా వీస్తుంటాయి.ఇక్కడ పాం చెట్ల నీడన చల్లగా వీచే గాలులతో సందర్శకులు చిన్నచిన్న కునుకులతో సేద తీరుతుంటారు.ఈ బీచ్ ప్రాంతం, నగరానికి చాలా సమీపంలో ఉండటంవలన, ప్రకాశవంతమైన ఏర్పాట్లతో మరింత ఆకర్షణీయంగా ఉన్నది.ఈ ప్రాంతం రాత్రి వేళల్లో చాలా మనోహరంగా కనపడుతుంది.

Photo Courtesy: SyeN

నగోవ బీచ్

నగోవ బీచ్

నగోవ బీచ్,బుచర్వాడ ఒక ఫిషింగ్ హామ్లెట్ అయిన నగోవ గ్రామం పేరు వొచ్చింది.ఈ బీచ్ కు చేరాలంటే డయ్యు నుండి 20 నిముషాల సమయం పడుతుంది.ఈ బీచ్ ఒక చివర నుండి ఇంకొక చివరి వరకు సుమారుగా 2.5 కిలోమీటర్లు ఉన్నది.ఈ బీచ్ పూర్తిగా నగరానికి వేరుగా ఉండటంవలన ఇక్కడ నిశబ్ద మరియు ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది.నగోవ బీచ్ అద్భుతమైన శుభ్రతతో మరియు మనోహరంగా ఉన్నది.ఇక్కడ రోజంతా సముద్రపు అలల గుసగుసలతో, పాం చెట్ల గాలి వీచికలతో వాతావరణం అద్భుతంగా ఉంటుంది.ఈ బీచ్,నీటి అలల మీద ఆడుకోమని, నీటిలో ఈత కొడుతూ సమయాన్ని గడపమని సందర్శకులను ఆహ్వానిస్తున్నది.ఈ బీచ్ ఈత మరియు ఇతర జల క్రీడలకు కూడా చాలా సురక్షితం.ఇక్కడ అధిక సాహసోపేతమైన సెయిలింగ్, బోటింగ్, వాటర్ స్కీయింగ్ లేదా ఇతర ఉత్తేజకరమైన కార్యకలాపాలను చేయవొచ్చు.ఈత వంటివి ఇష్టపడనివారు మెత్తని ఇసుకతిన్నెల మీద సేద తీరవొచ్చు లేదా దట్టమైన పాం చెట్ల నీడన చిన్న కునుకు తీయవొచ్చు.

Photo Courtesy: SyeN

నైద గుహలు

నైద గుహలు

నైద గుహలు చాలా వరకు బయటి ప్రపంచానికి తెలియదు.ఈ గుహలు పోర్చుగీసు వారి కాలంలో వెలుగులోకి వచ్చింది.ఇవి డియు కోటకి కాస్త దూరంలో ఉన్నాయి.మీరు గనక ఈ గుహలను సందర్శించినట్లయితే గొప్ప అనుభూతిని పొందినట్లవుతారు.ప్రకృతి యొక్క సహజ అందాలలో ఇది ఒక భాగమైపోయింది.ఖచ్చితంగా చెప్పగలిగేది ఎంటంటే ఈ గుహలను చూసినట్లయితే మిక్కిలి ఆనందాన్ని పొందగలరు.

Photo Courtesy: Edwin James

ఐ ఎన్ యస్ ఖుక్రి స్మారక ప్రదేశం

ఐ ఎన్ యస్ ఖుక్రి స్మారక ప్రదేశం

భారత రక్షణ నౌక, ఖుక్రి-INS పేరుగల భారత నౌకాదళ ఓడను డిసెంబర్ 1971లో 9 తేదిన జరిగిన ఇండో పాక్ యుద్ధసమయంలో, పాకిస్తాని జలాంతర్గామి PNS హన్గోర్ తో టార్పెడోలద్వారా కాల్చి నాశనం చేశారు.ఈ ఓడ డయ్యు యొక్క l8మంది అధికారులు, 176 మంది నావికులు,దాని సిబ్బందితోపాటు 40 నాటికల్ మైళ్ళలో సముద్రంలో మునిగిపోయింది.కెప్టెన్ మహేంద్ర నాథ్ ముల్ల మరణానంతరం దేశం యొక్క గౌరవం కోసం అతను చూపిన యెనలేని శౌర్యం మరియు త్యాగం ఫలితంగా మహావీర్ చక్ర పొందారు. దీనిని సముద్రం ముందు, ఒక చిన్న కొండ పైన ఉంచారు. సూర్యోదయం, సూర్యాస్తమం ఇక్కటి ప్రత్యేక ఆకర్షణ.

Photo Courtesy: Archan dave

డియు కోట

డియు కోట

ఈ డియు కోటని పోర్చుగీసు కోట అని కూడా పిలుస్తారు.ఈ కోట చరిత్ర పరంగా చూసుకుంటే, అరేబియా గవర్నరు దీనిని నిర్మిస్తే పోర్చుగీసు వలసవాదులు మరియు గుజరాత్ సుల్తాన్ అయినటువంటి బహదూర్ షా లు ఇద్దరు కూడా సంయుక్తంగా కలసి వారి యొక్క భూభాగాలను మొఘల్ చక్రవర్తి హుమయున్ సైన్యం నుంచి రక్షించుకోవడానికి కట్టించుకున్నారు.ఈ కోట తీరం వెంబడి 29 మీటర్ల పొడవు కలిగి ఉంది.ఈ కోటకి మూడు వైపుల సముద్రం మరోవైపు కెనాల్ ఆనుకొని ఉన్నాయి.ఈ కోట రెండు భారీ గోడలు చాలా గట్టిగా వృత్తాకారంలో ఉన్నాయి అందులో బయటి గోడ అలలు ఆటుపోట్ల నుండి రక్షించడానికి మరొకటి లోపలి గోడ బురుజుగా దానిమీద ఫిరంగులు ఎక్కించి పెట్టారు.ఈ కోటలో ఒక జైలు , లైట్ హౌస్ ,ఫిరంగులు, చుట్టూ కోమలమైన ప్రకృతితో నిండిన అందాలు,తోటలు ఉన్నాయి.

Photo Courtesy: Sumit sharma

పానీకోట

పానీకోట

పానీకోట ఫోర్తిండో మార్ అని కూడా పిలుస్తారు.ఇది అరేబియా సముద్రంలో చీలికల ప్రారంభంలో కట్టించిన ఒక అందమైన దుర్గం.ఇది ఘొఘ్లు గ్రామానికి దగ్గరలో, డయ్యులో ఉన్న జట్టి ప్రాంతం నుంచి ఒక నాటికల్ మైలు దూరంలో ఉన్నది.ఈ దుర్గం ఓడ ఆకారంలో సముద్రం మధ్యన కట్టబడింది.ఇక్కడి నుండి విస్తృత పరిసర సముద్ర దృశ్యాలు, జట్టి, ఘోఘ్ల గ్రామం మరియు డయ్యు నగరాలను చూడవొచ్చు.ఇక్కడ ఒక లైట్ హౌస్ మరియు సముద్ర కన్యకు అంకితం చేయబడిన ఒక చిన్న చాపెల్ ను చూడవొచ్చు.ఇక్కడ రాత్రి వేళల్లో ప్రత్యేకమైన లైట్లతో ప్రకాశింపచేస్తారు మరియు దర్శకులకు ఈ దృశ్యవీక్షణం మైమరపిస్తుంది.ఈ ప్రదేశాన్ని కయామత్ సినిమాలో చూపించారు.దీనిని బోర్డింగ్ సైట్ వద్ద అందుబాటులోఉన్న పర్యాటక పడవల ద్వారా చేరుకోవచ్చు.

Photo Courtesy: Vijay Bhadani

గంగేశ్వరుని ఆలయం

గంగేశ్వరుని ఆలయం

గంగేశ్వరుడు అన్న పదం శివుడికి మారుపేరు.ఇది ప్రధానంగా సముద్ర తీరంమీద ఉన్న శిలల మధ్యలో ఉన్న ఒక గుహ ఆలయం.ఈ ఆలయంలో అయిదు శివలింగాలు ఉన్నాయి. వీటిని నిరంతరం అరేబియన్ సముద్ర అలలు కడుగుతుంటాయి.పరమశివుడికి సముద్ర తరంగాల వందనసమర్పణ ఆధ్యాత్మిక దృశ్యం సందర్శకులలో ఆధ్యాత్మికత, గౌరవం మరియు భక్తి భావాలకు స్ఫూర్తినిస్తున్నది.ఈ ఆలయాన్ని పాండవులు వారి అజ్ఞాతవాసంలో రోజువారి పూజలకొరకు కట్టించారని పురాణాలు చెపుతున్నాయి.అందువలన ఈ ఆలయం మహాభారతకాలం నుండి ఉన్నదని చెపుతారు.సముద్రతీరాన ఉన్న ఈ గంగేశ్వర ఆలయం చారిత్రాత్మక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నది.

Photo Courtesy: Shakti

సెయింట్ థామాస్ చర్చి

సెయింట్ థామాస్ చర్చి

క్రీ.శ. 1598 వ సంవత్సరంలో సెయింట్ థామస్ కట్టించారు. ఈ చర్చి పోర్చుగీసు వారి హయాంలో ఒక ప్రముఖ చర్చిగా సేవలందించింది.ఈ చర్చి పురాతనమైనది మరియు చాలావరకు నిర్మాణ శైలిలో కూడా వ్యత్యాసమైనది. దీనిని గోతిక్ రీతిలో కట్టించినారు. దీని బయట వేసిన తెలుపు రంగు సున్నము వెలవెలా పోయిన, అప్పటి పోర్చుగీసు వారి చిత్రాలు మరియు వారి శిల్పకళా సంపదలు తారపడతాయి.1998 వ సంవత్సరంలో సెయింట్ థామస్ చర్చిని మ్యూజియంగా మార్చడం జరిగింది.

Photo Courtesy: poida.smith

సెయింట్ పాల్ చర్చి

సెయింట్ పాల్ చర్చి

సెయింట్ పాల్, యేసు క్రీస్తు యొక్క క్రైస్తవ బోధకుడి పేరు పెట్టబడింది.డయ్యులో పోర్చుగీసువారు నిర్మించిన మూడు చర్చిలలో, ఇక్కడ మాత్రమే క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశాలు మరియు ప్రార్థనలు జరుగుతున్నాయి.ఈ చర్చి 1610 లో నిర్మించారు మరియు పరిశుద్ధ కాన్సెప్షన్ యొక్క అవర్ లేడీకి అంకితం కావించారు.ఈ చర్చి యొక్క రూపకల్పన మరియు నిర్మాణశైలి బరోక్యు ఉత్తమ సంప్రదాయాలకు అనుగునంగా ఉన్నాయి. చర్చి లోపలిభాగం విస్తృతమైన మరియు కళాత్మకమైన చెక్క పనితో అందంగా తీర్చిదిద్దారు.బర్మీస్ టేకుతో, ఒకే ముక్కలో చెక్కిన సెయింట్ మేరీ విగ్రహం కలిగివున్న పీఠం ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా పేరుగాంచింది ఎందుకంటే దీని సాంద్రత, దృఢత్వం మరియు దీర్ఘ జీవితం వంటి లక్షణాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది.

Photo Courtesy: Viraat Kothare

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

డయ్యును విమాన, రైల్ మరియు బస్సు మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.

Photo Courtesy: Arctic Wolves

సందర్శించు సమయం

సందర్శించు సమయం

డయ్యులో వాతావరణం సంవత్సరమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Photo Courtesy: nevil zaveri

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X