Search
  • Follow NativePlanet
Share
» »కాలాపానీ జైలు చూశారా ?

కాలాపానీ జైలు చూశారా ?

పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ రాజధాని. ఈ నగరాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రసిద్ధి చెందిన కాలాపానీ జైలు ఇక్కడే ఉన్నది.

By Mohammad

కాలపానీ సినిమా గుర్తుందా !! అందులో అమ్రీష్ పురి పోలీస్ పాత్రలో నటించిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆంగ్లేయుల కాలంలో సెల్యులార్ జైలు లో జరిగిన ఆకృత్యాలు ఆధారంగా నిర్మించిన సినిమా ఇది. జైలులో అతను పెట్టిన చిత్రహింసలు తలచుకుంటే ఒళ్ళు గగుర్పుడుతుంది. ఆ జైలు మరెక్కడో కాదు అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నది. దేశంలోనే అతి భయంకర జైలుగా ముద్రపడ్డ ఆ కాలాపానీ జైలును చూసొద్దాం పదండి!!

పోర్ట్ బ్లెయిర్, కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు రాజధాని. ఇది దక్షిణ అండమాన్ ద్వీపంలో కలదు. పోర్ట్ బ్లెయిర్ లో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటూ వర్షాలు పడే సరికి మంచి సెలవుల విశ్రాంతి ప్రదేశంగా మారిపోతుంది. ఈ ప్రదేశాన్ని దేశీయులే కాక విదేశీయులు సైతం బాగా ఇష్టపడతారు. ఈ దీవిలో కొన్ని ప్రాంతాలు విదేశీయులకు రిజర్వు చేయబడి ఉంటాయి.

పోర్ట్ బ్లెయిర్

చిత్రకృప : Sumant jo

పోర్ట్ బ్లెయిర్ అనేక కారణాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆహ్లాదకరమైన కొన్ని బీచ్ లకు, సెలవుల ప్రదేశాలకు నిలయంగా ఉండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ ఎప్పుడు నావికాదళం, వైమానిక దళం మరియు కోస్ట్ గార్డులు కావలి కాస్తుంటారు.

కాలాపానీ జైలు

కాలాపానీ సినిమా లో చూపించే జైలును పోర్ట్ బ్లెయిర్ లో సెల్యులార్ జైలు అని పిలుస్తారు. కాలాపాని అంటే నల్లని నీరు జైలు అని అర్ధం . ఇది 1800 ల సంవత్సరంనుండి ప్రసిద్ధి చెందినది. కాలాపాని జైలును 1800 ల సంవత్సరంలో బ్రిటీష్ వారు భారతీయ రాజకీయ ఖైదీలను, స్వతంత్ర పోరాటంలో బంధించేందుకు నిర్మించారు. ఈ జైలులో ఆనాటి బ్రిటీష్ అధికార్లు ఖైదీలను వివిధ రకాలుగా హింసించేవారని ప్రజలు చెప్పుకొనేవారు.

పోర్ట్ బ్లెయిర్

చిత్రకృప : Stefan Krasowski

కాలాపానీ జైలు చుట్టూ సముద్రం చుట్టుముట్టి ఉంటుంది. కనుక ఖైదీలు ఎవరూ తప్పించుకోవటానికి సాహసించరు. ఒకవేళ తప్పించుకున్న సముద్రంలోని షార్క్ చేపలకు, తిమింగలాలు బలి అవుతారు. పోనీ దీవుల ఒడ్డుకు చేరుకున్న అక్కడ తిండి దొరక్క బక్కచిక్కి ఆకలితో చస్తారు. అందుకే బ్రిటీష్ వారు అక్కడ పెట్టిన అకృత్యాలను భరిస్తూ శాంతియుతంగానే గడిపారు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే గన్ తో కాల్చేస్తారు.

కాలాపానీ ఒక్కటే పోర్ట్ బ్లెయిర్ ప్రధాన ఆకర్షణ అనుకుంటే పొరబడినట్లే!! ఇక్కడ చూడవలసినవి, ఆనందించవలసినవి అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని...

మెరైన్ పార్క్

పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నపుడు మీరు ప్రఖ్యాత మెరైన్ పార్క్ తప్పక చూడాలి. సముద్ర కార్యకలాపాలు, సముద్ర జీవితం, సుమారు 150 చిన్న చిన్నదీవులకు తిరగటం మొదలైనవి ఉంటాయి. సముద్ర జీవితంపై మీకు గల ఆసక్తిని బట్టి మీ టూర్ మరింత పెంచుకోవచ్చు లేదా కొద్ది గంటలకు తగ్గించుకోవచ్చు కూడాను.

పోర్ట్ బ్లెయిర్

చిత్రకృప : Aliven Sarkar

అండమాన్ వాటర్ పార్క్స్

సెల్యులర్ జైలుకు సమీపంలోనే అండమాన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. దీనిలో అద్భుతమైన నీటి క్రీడలు అంటే పారా సెయిలింగ్, వాటర్ స్కూటర్స్, పెడల్ బోట్ల్, కయాకింగ్ వంటివి చేయవచ్చు. వాణిజ్యపర అంశాలేకాక, అండమాన్ దీవులలో నీటి క్రీడలు మిమ్మల్ని ప్రకృతికి మరింత సన్నిహితం చేస్తాయి.

రాస్ ఐలాండ్

రాస్ ఐలండ్ దీవి ఎన్నో యుగాలనుండి శిధిలాలకు నిలయంగా ఉంది. ఇది ప్రతి చరిత్ర కారుడికి అవసరమైన సమాచారం ఇచ్చే భవనాలు కలిగి ఉంది. రాస్ ఐలండ్ ను పోర్ట్ బ్లెయిర్ నుండి బోటు ప్రయాణంలో లేదా దీవిలో కల ఫొయనిక్స్ జెట్టీ ద్వారా కూడా చేరవచ్చు. పర్యాటకులందరూ ప్రవేశంలో లేదా బయటకు వచ్చేటపుడు వారి రికార్డులలో సంతకాలు చేయాల్సి ఉంటుంది.

పోర్ట్ బ్లెయిర్

చిత్రకృప : Joseph Jayanth

పోర్ట్ బ్లెయిర్ ఎలా చేరుకోవాలి ?

పోర్ట్ బ్లెయిర్ చేరుకోవటానికి విమాన, జల మార్గాలే గతి. ఊర్లో తిరగటానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. వైజాగ్, చెన్నై నుండి షిప్ లలో, ఫెర్రీ లలో మరియు విమానాలలో పోర్ట్ బ్లెయిర్ చేరుకోవచ్చు. జల మార్గం ద్వారా అయితే రోజులు పడుతుంది అదే విమానాల్లో అయితే గంటలు పడుతుంది అంతే తేడా !!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X