Search
  • Follow NativePlanet
Share
» »కాశి విశాలాక్షిని దర్శిస్తే..వివాహం కాని కన్నెలకు త్వరగా వివాహం అవుతుంది..

కాశి విశాలాక్షిని దర్శిస్తే..వివాహం కాని కన్నెలకు త్వరగా వివాహం అవుతుంది..

కాశి విశాలాక్షిని దర్శిస్తే..వివాహం కాని కన్నెలకు త్వరగా వివాహం అవుతుంది..

కాశీ అనగానే పవిత్ర గంగానదీ విశ్వేశ్వరుడు, విశాలక్షీ, అన్నపూర్ణాదేవీ, డుంఠిగణపతి, కాలభైరవుడు ముందుగా గుర్తుకొస్తారు. ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిసారు. సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రమిది. జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికి ఈ క్షేత్రం ఆరాధ్యనిలయం. ఆ ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రం ఒక మహాశక్తిపీఠంగా కూడా ప్రసిద్ది చెందినది.

అష్టాదశ శక్తిపీఠాలలో 17వ శక్తిపీఠం శ్రీ విశాలాక్షిదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భలాయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంటుంది. ఒక రూపం స్వయంభువు, మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మొదట అర్చామూర్తిని, తర్వాత స్వయంభువును దర్శించుకోవాలి. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలది అని అర్థం. విశాలాక్షి దేవి కొలువుదీరిన అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రం వారణాసి. అమ్మ కొలువైన శక్తి క్షేత్రం కాశి. కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

కాశినే వారణాసి అని పిలుస్తారు. వరుణ మరియు అసి అను నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి. వారణాసి భారతీయులందరికీ ఆరాధ్య పుణ్యక్షేత్రం, సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా ఈ క్షేత్రం పేరుపొందినది.

ఆలయం ప్రాముఖ్యత:

ఆలయం ప్రాముఖ్యత:

గంగానది తీరంలో మీర్ ఘాట్ వద్ద ఉంది. కాశీ విశ్వేశ్వరుని గుడికి కొంత దూరంలో విశాలక్షి అమ్మవారి క్షేత్రం ఉంది. భగవతి కర్ణ కుండలాలు(కళ్లు, చెవిపోగులు) కాశీలో పడినట్లు ప్రతీతి. అందుకే ఇక్కడ అమ్మవారిని మనికర్ణిక అని పిలువబడుతున్నది. మణికర్ణికగా శ్రీ విశాలాక్షి శక్తిపీఠం ఆవిర్భవించినదని పురాణాలు చెబుతున్నాయి. ఈమెనే విశాలాక్షీ దేవి అని, విశ్వలక్ష్మీ దేవి అని పిలుస్తున్నారు. వారణాసిలో సతిదేవి కన్నులు పడిన కారణంగా ఇక్కడ కాజలి పండుగకు విశిష్టత ఉంది. వారణాసిలో ఈ పండుగను మహిళలు ఆచరిస్తారు. విశాలక్షి ఆలయంలో కాజలి పండుగ నిర్వహిస్తారు. ఏటా భాద్రపద శుద్ద తదియ నాడు వారణాసిలో కాజలి ఉత్సవం జరుగుతుంది.

PC:Youtube

కాశిలో కొలువైన శివుడు కాలభైరవుడు

కాశిలో కొలువైన శివుడు కాలభైరవుడు

కాశిలో కొలువైన శివుడు కాలభైరవుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆలయాలకు రెండు వీధులు దక్షిణంగా ఉండే వీధిలో విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. ఈవిశాలక్షీ దేవి ఆలయంలో శ్రీ చక్రం ఉండటం మహా విశేషంగా చెప్పుకుంటారు.

ఇక్కడ అమ్మవారికి పురాతన విగ్రహం

ఇక్కడ అమ్మవారికి పురాతన విగ్రహం

ఇక్కడ అమ్మవారికి పురాతన విగ్రహం ఉద్భవమూర్తిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి వెనుకలవైపున ఈ విగ్రహం ఉంది. ఆలయంలో అమ్మవారు బంగారు తొడుగుతో దర్శనం ఇస్తారు. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వస్తిస్తారు.

 ఇక్కడి అమ్మవారిని గౌరీ అని కూడా పిలుస్తారు

ఇక్కడి అమ్మవారిని గౌరీ అని కూడా పిలుస్తారు

ఇక్కడి అమ్మవారిని గౌరీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో పార్వతీదేవి అన్నదానం చేయడం వల్ల పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తుంటారు. ఈ తల్లిని కాశీలోని అన్నపూర్ణేశ్వరిగా, మరొక అంశంతో కంచిలో కామాక్షిమాతగా కొలవబడుతున్నది. కాశీలో విశాలాక్షి మాత దేవాలయం అన్నపూర్ణ ఆలయానికి అతి సమీపంలో ఉంది. ఈ ఆలయ గోపురం దక్షిణాది సంప్రదాయ శైలిలో ఉంటుంది.

PC:Youtube

విశాలాక్షిని పురాణాలలో విశ్వాన్ని పరిపాలించే రూపంగా

విశాలాక్షిని పురాణాలలో విశ్వాన్ని పరిపాలించే రూపంగా

విశాలాక్షిని పురాణాలలో విశ్వాన్ని పరిపాలించే రూపంగా వర్ణించారు. తంత్రాలలో ఆమెను మహాకాళిగా వర్ణించారు. కాశీలో మరణించిన వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుంది. కాశీ విశ్వనాధుడు మహాకాల రూపం ధరించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కాశిలో మరణించిన వారికి శివుడు వారి ఆత్మ చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని అంటుంటారు.

PC:Youtube

పురాణగాథ:

పురాణగాథ:

స్కంద పురాణం ప్రకారం వారణశిలో వ్యాసభగవానునికి, ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు ఎవరూ భిక్షం వెయ్యలేదు. దానికి ఆయనకు విపరీతంగా కాశీపై కోపం వచ్చి, శపించాడు. అప్పుడు విశాలాక్షి దేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాసభగవానుడిని, అతని శిష్యులను ఆథిద్యానికి ఆహ్వానించింది. వారందరికీ విశాలాక్షీ విశ్వేశ్వర దంపతులు షడ్రసోపేత మ్రుస్తాన్న భోజనం పెడతారు. వ్యాసుడు కాశీ పట్టణాన్ని శపించడం మహా నేరంగా భావించిన శివుడు వ్యాసుడిని కాశీ క్షేత్రం నుండి బహిష్కరిస్తాడు.

PC:Youtube

అన్నపూర్ణామాత అంటే విశాలాక్షిదేవి

అన్నపూర్ణామాత అంటే విశాలాక్షిదేవి

దాంతో వ్యాసుడు శివుడి కాళ్ళమీద పడి తప్పు మన్నించమని కోరుతాడు.‘వ్యాస నిష్కాసనం ' చరిత్ర ససృష్టిస్తుందని ఊరడించి , మళ్ళీ తప్పక వ్యాసునికి కాశీలో ప్రవేశించే అనుమతినిస్తానని విశ్వేశ్వరుడు చెప్పాడు. అన్నపూర్ణమాత లాగే విశాలాక్షీ మాత కూడా శివుడికి భోజనం సమకూరుస్తుంది కాబట్టి, విశాలాక్షి పెట్టిన భోజనానికి సంతృప్తిచెందిన ఆ పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి ముఖ్య దేవతగా ఉండే యోగ్యతను కల్పిస్తాడు. చాలాకాలం అన్నపూర్ణామాత అంటే విశాలాక్షిదేవి అనే భావించారు కాలక్రమం లో రెండు వేరు వేరు ఆలయాలేర్పడ్డాయి. విశ్వనాధుని గుడికి దగ్గరలో అన్న పూర్ణ ఆలయం ఉంటె దీనికి కొద్ది దూరం లో విశాలాక్షి ఆలయం ఉంది.

PC:Chore Bagan Art Studio

వివాహం కాని కన్నెలు గంగా స్నానం చేసి నిష్టతో విశాలాక్షి ని

వివాహం కాని కన్నెలు గంగా స్నానం చేసి నిష్టతో విశాలాక్షి ని

వివాహం కాని కన్నెలు గంగా స్నానం చేసి నిష్టతో విశాలాక్షి ని అర్చిస్తే త్వరలో అనుకూలుడైన భర్త లభిస్తాడనే విశ్వాసం ఉంది .నల్ల రాతి అమ్మవారి విగ్రహాలు తేజో వంతం గా ఉంటాయి. నవ రాత్రి ఉత్సవాలను ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. భాద్రపద మాసపు ఉత్సవాలు కూడా చెప్పుకో దగినవే.

ఫోటో క్రెడిట్: Ekabhishek

దగ్గరలోని మణి కర్ణికా ఘట్టంలో వేలాది భక్తులు పవిత్ర స్నానాలు

దగ్గరలోని మణి కర్ణికా ఘట్టంలో వేలాది భక్తులు పవిత్ర స్నానాలు

దగ్గరలోని మణి కర్ణికా ఘట్టంలో వేలాది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లో దేవత లందరూ గంగా నదిలోని ఈ మణికర్ణికా ఘట్టం లో పుణ్య స్నానాలు చేస్తారనే నమ్మకం ఉంది. మహిమాన్వితమైన పుణ్యభూమిలో కొలువైన విశాలాక్షి దేవిని నవరాత్రుల సందర్భంగా దర్శించుకునే వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు సూచిస్తున్నారు.

కాశి విశాలాక్షి ఆలయం చుట్టూ చూడదగ్గ పుణ్యక్షేత్రాలు

కాశి విశాలాక్షి ఆలయం చుట్టూ చూడదగ్గ పుణ్యక్షేత్రాలు

కాశివిశాలక్షి అమ్మవారి ఆలయం చుట్టూ శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి. గర్భగుడిలో అమ్మవారితో పాటు ఆదిశక్తి కూడా కొలువై ఉంది. అమ్మవారి ఎదురుగా ఉన్న మహిమాన్వితమైన శ్రీ చక్రంను భక్తులు తాకి దర్శించుకోవడానికి అందుబాటులో ఉంటుంది. కాశీలో ఏడు ఆవరణలలో 56గణపతులున్నారు. అందులో డుంఢిరాజగణపతి ప్రసిద్ది. ఈయనే కాశీలోని ఏడు ప్రాకారాలలోనూ యాభై ఆరు గణపతులుగా రూపమెత్తి విరాజిల్లాడని పురాణాలలో చెప్తుంటారు. ఇందు పది గణపతులకు ప్రాధాన్యం ఉంది.

మార్కండేయ మాధవ్ టెంపుల్, భరతమాత మందిర్, కాలభైరవ టెంపుల్

మార్కండేయ మాధవ్ టెంపుల్, భరతమాత మందిర్, కాలభైరవ టెంపుల్

ఇంకా మార్కండేయ మాధవ్ టెంపుల్, భరతమాత మందిర్, కాలభైరవ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, దుర్గగుడి, బిర్లా టెంపుల్, వ్యాస టెంపుల్, తిలభణ్డేశ్వర్ ఆలయం, ఇలా చూడవలసిన గుళ్ళు గోపురాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు వారణాసిలో ఉన్నాయి.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

దేశంలోని అన్ని నగరాలతో ఈ నగరానికి రోడ్, రైలు మార్గాలున్నాయి.
వారణాసి సమీపంలోని మొగల్ సరాయ్ పెద్ద జంక్షన్. నిత్యం అనేక రైళ్ళు ఈ రైల్వేస్టేషన్ ద్వారా వెళుతుంటాయి.
వారణాసి విమానశ్రయాన్ని అన్ని నగరాలతో విమాన సర్వీసులతో అనుసంధానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X