Search
  • Follow NativePlanet
Share
» »కేరళ బ్యాక్ వాటర్స్ హౌస్ బోటు ల అద్భుత జర్నీ !

కేరళ బ్యాక్ వాటర్స్ హౌస్ బోటు ల అద్భుత జర్నీ !

కేరళ రాష్ట్రం పేరు వినగానే మొదటగా మీకు గుర్తుకు వచ్చేవి బ్యాక్ వాటర్స్ మరియు హౌస్ బోటు లు. కేరళ రాష్ట్ర టూరిజం లో మూడు వంతుల మంది పర్యాటకులు అక్కడ కల హౌస్ బోటు లు, బ్యాక్ వాటర్స్ కొరకే వెళతారు. దేశంలోని పర్యాటకులే కాక, ఇతర దేశాలనుండి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆనందించి వెళతారు. ఈ రకంగా కేరళ దేశీయులకు, విదేశీయులకు ఒక సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. కేరళలో కల ఈ కెనాల్స్ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణిస్తూ ట్రావెల్లెర్ లకు గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ అందాలు చూపుతున్నాయి. ఇంతవరకూ కేరళలోని బ్యాక్ వాటర్స్, హౌస్ బోటు లు చూడని వారికి ఈ ఆర్టికల్ చక్కటి మార్గదర్శకత కాగలదు.
హౌస్ బోటు ... అధ్బుత ఆనందాలు

అల్లెప్పి

అల్లెప్పి

బ్యాక్ వాటర్ టూర్స్ కు ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలలో అల్లెప్పి ఒకటి. ఇక్కడ మీరు ఒక రోజు బోటు విహారం లేదా ఓవర్ నైట్ స్టే కొరకు ఒక పేకేజ్ తీసుకోవచ్చు. బ్యాక్ వాటర్ టూర్స్ చాలావరకు అల్లెప్పి నుండి మొదలవుతాయి.

Photo Courtesy: McKay Savage

తాజా అనుభూతుల అల్లెప్పి

తాజా అనుభూతుల అల్లెప్పి

ఇక్కడ కల హౌస్ బోటు లలో కొద్ది గంటలు గడిపితే చాలు ఎంతో రిఫ్రెష్ అయిపోతారు. చల్లటి నీటి గాలులలో ప్రకృతి మధ్య అద్భుత ఆనందాలు అనుభవించగలరు.

Photo Courtesy: McKay Savage

ప్రయాణం

ప్రయాణం

ఇక్కడి బోటు ప్రయాణాలు పున్నమడ లేక్ నుండి మొదలవుతాయి. ఇక్కడే ప్రసిద్ధ నెహ్రు ట్రోఫీ స్నేక్ బోటు రేస్ కూడా జరుగుతుంది. అల్లెప్పి నుండి ఇంకనూ ఇతర రూట్ లు కూడా కలవు.

అల్లెప్పి నుండి అల్లెప్పి

అల్లెప్పి నుండి అల్లెప్పి

ఈ విహారాలలో అధికంగా అల్లెప్పి నుండి అల్లెప్పి వరకు పేకేజ్ లు వుంటాయి. దీనిలో హౌస్ బోటు లో ఓవర్ నైట్ స్టే కూడా వుంటుంది. బోటు పున్నమడ లేక్ నుండి దాటి రాత్రి అంతా వత్తకాయాల్ లేక్ వద్ద వుండి మరుసటి రోజు ఉదయానికి వెనక్కు తిరిగి అల్లెప్పి చేరుతుంది.

Photo Courtesy: McKay Savage

అల్లెప్పి నుండి కుమరకోమ్

అల్లెప్పి నుండి కుమరకోమ్

అల్లెప్పి బ్యాక్ వాటర్స్ నుండి, మరొక అందమైన ప్రదేశం కుమరకోమ్ వరకు ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ లో ప్రయాణం ఆహ్లాదం కలిగిస్తుంది. చక్కని ప్రకృతి, వీనుల విందైన గాలుల సంగీతం కల ఈ విహారం మీకు లైఫ్ లో ఒకేసారి కలిగే అనుభూతిగా వుంటుంది.

పక్షుల కిల కిల ధ్వనులు

పక్షుల కిల కిల ధ్వనులు

మీకు పక్షుల పట్ల ఆసక్తి కలిగి వుంటే, మీరు తప్పక అల్లెప్పి నుండి కుమరకోమ్ కు బ్యాక్ వాటర్స్ లో ప్రయానిన్చాల్సిందే. మీ జర్నీ అంతా దోవలో ఎన్నో రకాల, స్థానిక మరియు వలస పక్షులు కనపడతాయి.

Photo Courtesy: Amog

అల్లెప్పి నుండి కొట్టాయం

అల్లెప్పి నుండి కొట్టాయం

బ్యాక్ వాటర్ విహారంలో మీరు అల్లెప్పి నుండి కొట్టాయం కూడా ప్రయాణించ వచ్చు. ఈ రూట్ లో మీరు తాటి చెట్లు, వాటి పై నుండి కల్లు తీసి జీవనం సాగించే వారిని చూస్తారు.

Photo Courtesy: Srikumar Venugopal

అల్లెప్పి నుండి తోత్తప్పల్లీ

అల్లెప్పి నుండి తోత్తప్పల్లీ

బహుశ తోత్తప్పల్లీ గురించి మీరు ఎక్కువగా విని వుండరు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం. ఇక్కడ కల వరి పొలాలు, కొబ్బరి తోటలతో తోత్తప్పల్లీ ఒక స్వర్గం లా వుంటుంది. మీ బోటు విహారం లోని ఈ ఈ రూట్ లో మీరు ఇతర ఆకర్షణలు అయిన అమ్బలపుజ్జ టెంపుల్ , చంపక్కులం చర్చి, వెంబనాడ్ లేక్ మరియు పతిరమనల్ వంటివి చూడవచ్చు.

Photo Courtesy: Ramesh NG

అల్లెప్పి నుండి మంకొట్ట

అల్లెప్పి నుండి మంకొట్ట

ఈ జర్నీ మరో మారు మిమ్మల్ని పున్నమడ లేక్ నుండి తీసుకు వెళుతుంది. మంకొట్ట ఒక చిన్న గ్రామం. ఇక్కడి ప్రజలు పీచు తయారీ పరిశ్రమలతో జీవనం సాగిస్తారు.

Photo Courtesy: Classiccruisekerala

అల్లెప్పి నుండి అలుమ్కదావు

అల్లెప్పి నుండి అలుమ్కదావు

అలుమ్కదావు లో బోటు తయారీ పరిశ్రమ కలదు. ఇక్కడ మీరు తిరిగే హౌస్ బోటు లు అలుమ్కడవు లో తయారు అవుతాయి. ఈ ప్రదేశం పర్యటన ఒక గొప్ప అనుభూతి కాగలదు. బోటు ల తయారీ, అక్కడి ప్రజల జీవన విధానం అద్భుతంగా వుంటాయి.

Photo Courtesy: Lenish

అసలు సిసలైన కేరళ భోజనం

అసలు సిసలైన కేరళ భోజనం

కేరళ భోజనం ఎంతో రుచికరంగా వుంటుంది. సాధారణంగా అనేక మార్లు ఈ హౌస్ బోటు లకు వచ్చేవారు, కేరళ వంటకాలు అమితంగా ఇష్టపడే వారే. హౌస్ బోటు లోనే ఈ వంటకాలను వంటవారు తయారు చేస్తారు. మీరు ముందుగా వారికి ఏ డిష్ కావాలో, ఎలా కావాలో చెపితే, మీ ఛాయస్ మేరకు వారు దానిని తయారు చేస్తారు.

కేరళ ప్రజల ఆతిధ్యం

కేరళ ప్రజల ఆతిధ్యం

కేరళ లో హౌస్ బోటు టూర్లను నిర్వహించేందుకు అనేక ఏజెన్సీ లు కలవు. అన్ని ఏజెన్సీ ల వారి మంచి అలవాటు, వారి స్నేహ పూరిత సంభాషణలు. వీరితో వ్యవహరిస్తూ వుంటే, మీరు మీ హోం టవున్ లో ఉన్నట్లే వుంటుంది. మీరు అన్నీ మరచి పచ్చని ప్రకృతి ఒడిలో విశ్రాంతి పొందవచ్చు.
Photo Courtesy: Jithraj1

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X