Search
  • Follow NativePlanet
Share
» »కేరళలో మొదటి ఆర్చిడ్ పూవుల తోట !

కేరళలో మొదటి ఆర్చిడ్ పూవుల తోట !

రళ రాష్ట్రంలో ఆర్చిడ్ పూవుల తోట అనేది ఇంత వరకు మనం వినలేదు. అటువంటిది ఇంతవరకూ లేదు కూడాను. ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ప్రకృతి దృశ్యాలూ, బ్యాక్ వాటర్స్, బోటు హౌసెస్ వంటివే వింటాం గానే పూల తోట అనేది ఎక్కడా చూడం. అయితే, ఇపుడు, కేరళ టూరిజం శాఖ అక్కడ దాని మొదటి ఆర్చిడ్ గార్డెన్ ఒకటి వాగామోన్ ప్రదేశంలో ఏర్పాటు చేసింది. కేరళ రాష్ట్రానికి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు. ఇక్కడ అనేక హిల్ స్టేషన్ లు, అందమైన టెంపుల్స్, పురాతన పాలస్ లు, జలపాతాలు కలవు. ఇపుడు వీటి అన్నిటికీ తోడుగా ఒక పెద్ద ఆర్చిడ్ పూవుల గార్డెన్ కూడా ఏర్పరచారు.

కేరళ మొదటి ఆర్చిడ్ పూల తోట

కవిత్వం చెప్పే ఆర్చిడ్ పూవులు !
Photo courtesy: mshameers

వాగామోన్ ప్రదేశం కేరళ లోని ఒక సహజ అద్భుత అందాల ప్రదేశం. దాని అందాలు ఎటువంటివి అంటే, ఈ ప్రదేశాన్ని చూసే పర్యాటకులు మరో మారు కూడా దాని సుందర దృశ్యాలను చూసేందుకు ప్లాన్ చేస్తారు. ఎన్ని సార్లు చూసినా ఈ ప్రదేశం మరల చూడాలని అనిపిస్తూనే వుంటుంది. ఈ ప్రత్యేకమైన ఆర్చిడ్ గార్డెన్ మొదటి దశను పబ్లిక్ కు వచ్చే సంవత్సరం జనవరి మధ్యలో తెరువనున్నారు. ఆర్చిడ్ పూవుల అందాలను గురించి వర్ణించ నలవి కాదు. ఎంతోమంది కవులు, ప్రకృతి ప్రేమికులు ఈ పూవుల అందానికి ముగ్ధులై కవిత్వాలు కూడా వ్రాస్తారు. ఈ పూవుల అందాలు ఎంత చెప్పినా తరగనివి గా వుంటాయి.

ఇపుడు అందమైన ఈ ఆర్చిడ్ పూలు కేరళ రాష్ట్రంలో ఒక ప్రధాన ఆకర్షణగా చోటు చేసుకోనున్నాయి. ఈ రాష్ట్ర టూరిజం శాఖ ఆర్చిడ్ పూవులకు ప్రత్యేకించి ఒక పెద్ద గార్డెన్ తయారు చేయనుంది. ఈ అంశం ఎంతో ఆశ్చర్యం. అయినా నమ్మక తప్పదు. ఒక్కసారి వేలాది ఆర్చిడ్ పూవులు ఒక కార్పెట్ లా పరచుకుని వుంటే, ఎంత అందంగా వుంటుంది ? అది కూడా అతి సుందరమైన వాగామోన్ ప్రదేశంలో ఒక విశాలమైన 15 హెక్టార్ ల ప్రదేశంలో నిర్మించనున్నారు. ఈ ప్రదేశం వాగామోన్ లోని కొలహలమేడులో కలదు. ఈ ప్రదేశం చాలామందికి తెలియదు. వాగామోన్ నుండి పుల్లిక్కనం రోడ్ పైకి వచ్చి కొంత దూరం ప్రయాణిస్తే, ఎంతో అందమైన ఈ ప్రదేశానికి చేరతారు.

కవిత్వం చెప్పే ఆర్చిడ్ పూవులు !

Photo Courtesy: Clare Bell

ఈ ఆర్చిడ్ పూల తోటను కేరళ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పో రేషన్ నిర్వహిస్తోంది. ఒక పక్క కర్నాటక టూరిజం శాఖ దాని కూర్గ్ ప్రాంత పర్యాట కతతో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మున్నార్ తో పోటీ పడుతూ వుంటే, మరొక పక్కమున్నార్ ప్రాంతంలో తగ్గిన పర్యాటకులను భర్తీ చేసుకునేందుకు గాను కేరళ టూరిజం శాఖ దాని పర్యాటకులను అధికం చేసుకొనేందుకు వాగామోన్ లో ఈ ఆర్చిడ్ పూల తోటను స్థాపించింది. ఇండియా లో అనేక తోటలు కలవు, వాటిలో కొన్ని ఆర్చిడ్ గార్డెన్ లు కూడా కలవు. అయితే, ఇంతవరకూ కేరళ లో ఇటువంటి గార్డెన్ లేదు. ఇది మొదటి ఆర్చిడ్ పూల గార్డెన్. అయితే, ఇక్కడ మీకు స్వాగతం పలికే ఆర్చిడ్ పూవులు ఒక అరుదైన వెరైటీ. ఈ ఆర్చిడ్ పూవులు అధికంగా పడమటి కనుమలలో మాత్రమే వికసిస్తాయి.

ఈ గార్డెన్ ను పర్యాటకులకు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉండేలా స్థాపించారు. ఒక విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని కూడా సందర్శకుల కొరకు నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X