కొండలే అయినా మనస్సు దోచే కళా ఖండాలు. రాళ్లే అయినా..రమ్యమనిపించే అద్భుతాలు. బొమ్మలే అయినా..నాట్యాన్ని కళ్లకు కడతాయి. ప్రపంచంలోనే అద్భుతం అనిపించే అరుదైన కళారీతి ఈ ఖజురహో శిల్పాలు. వాస్తవికతకు దగ్గరగా..మనస్సుని హత్తుకునేలా..ఆలోచనలు పరవళ్లు తొక్కేలా ..రూపుదిద్దుకున్నవే ఈ శిల్పాలు. చూడగానే..ఏ కదలిక లేకున్నా మౌనముద్రలో ఉన్నశిల్పాలు మస్తిష్కాన్ని తొలుస్తాయి. మనస్సును కదిలిస్తాయి. మనిషిని ఉద్రేకపరుస్తాయి. ఆ మౌనం జీవన పాఠాలు చెబుతుంది. సృష్టి రహస్యాన్ని బోధిస్తుంది. అందుకే ఈ పర్యాటక కేంద్రం ప్రేమికులకు నందనవనం..కొత్త జంటలకు బృందావనం..అతే ఖజురహో..అపురూప శృంగార శిల్పనగరి గురించి తెలుసుకుందాం..

ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖజురహో కేత్రం ఉంది. ఇది ఒక మోస్తరు పట్టణమే కానీ, లోనికి వెళ్లే కొద్దీ బయటకు రానివ్వకుండా చేస్తుంది. ఇక్కడ ఆలయాలపై నిలిచిన ఇసుకరాతి శిల్పాలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉత్సుకత రేకెత్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Photo Courtesy : commons.wikimedia.org

ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి
అలా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో దేవీ జగదాంబ ఆలయం, విష్ణుమూర్తి, చిత్రగుప్తుని ఆలయం, పార్వతీ దేవి ఆలయం, గంగామాత ఆలయాలున్నాయి. ఈ ఆలయాన్ని సౌండ్ స్టోన్ తో నిర్మించారు. ఇవి బఫ్, పింక్, లేత పసుపు వర్ణాల్లో ఉంటాయి. క్రీ.శ 950-1050 మధ్య చందేలా రాజుల హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాలు భక్తికి, అనురక్తికి సరికొత్త అర్థం చెబుతాయి.
Photo Courtesy : commons.wikimedia.org

చందేలా రాజులు ఖజురహో రాజధానిగా
చందేలా రాజులు ఖజురహో రాజధానిగా మధ్యభారతాన్ని పరిపాలించారు. ఆ సమయంలోనే ఖజురహోలో ఉన్న ఆలయాలన్నీ నిర్మింపబడ్డాయి. వాటిలో మతంగేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. అలాగే లక్ష్మణ మందిరం, మహావిష్ణువు కొలువుదీరిన ఆలయం మరియు ఆలయంలో ఉన్న వందలాది శిల్పాలు వేలాది భావాలను స్పురింపజేస్తాయి.
Photo Courtesy : commons.wikimedia.org

ఖజురహో సౌందర్యమంతా ఆలయ గోపురాలు
ఖజురహో సౌందర్యమంతా ఆలయ గోపురాలు, స్తంభాల్లోనే ప్రతిష్టితమై ఉంది. ఈ ఖజురహో ఆలయ సమూహంలో వరాహ మందిర మరో అద్భుతం. చాలా పెద్దగా ఉన్న వరాహ విగ్రహం ఒక అద్భుతమనుకుంటే, ఆ విగ్రహంపై 674 దేవతా మూర్తులు చెక్కడం మరో విశేషం. ఇవన్నీ పర్యాటకుల కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Photo Courtesy : commons.wikimedia.org

జత్తులో కనివిని ఎరుగని శిల్పకళ
ఒక్కొక్క ఆలయం ఈ గజత్తులో కనివిని ఎరుగని శిల్పకళను సంతరించుకున్నాయి. కానీ, ఆ రాజులు పోయాక..ఏ రాజులూ ఇక్కడి సౌందర్యాన్ని గుర్తించలేదు. దాంతో వందల సంవత్సరాల ఇక్కడి ఆలయాలు, శిల్పాలు ఏ ఆదరణకూ నోచుకోలేదు. కానీ బ్రిటిష్ హయాంలో మళ్లీ ఖజురహో గొప్పదనం బయటి ప్రపంచానికి తెలిసింది.
Photo Courtesy : commons.wikimedia.org

ఎన్నో వింతలకు కొలువయ్యాయి
ఒకప్పుడు 80 ఆలయాలతో అలరారిన చందేలా రాజధానిలో కాలపరీక్షను తట్టుకుని నిలబడ్డవి 22 ఆలయాలే!అలా కొన్నే ..ఎన్నో వింతలకు కొలువయ్యాయి. అంతులేని కళనైపుణ్యాలు దాగున్న ఈ ఆలయాలను నిత్యం వేలాది మంది దేశ, విదేశీయులు సందర్శిస్తారు.
Photo Courtesy : commons.wikimedia.org

ఖజురహో శిల్పసౌందర్యం చూపరుల మనసు దోచుకుంటుంది
శృంగార దేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పసౌందర్యం చూపరుల మనసు దోచుకుంటుంది. ఈ ఆలయ సమూహాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయ శిల్ప సంపద శృంగారానికి ప్రతీకగా ఉండటంతో.. చాలా ప్రసిద్ధి చెంది..
Photo Courtesy : commons.wikimedia.org

దేవుళ్లు, అప్సరసలు, యుద్ధవీరులు
ఆలయాల నిర్మాణాలంలో ఇసుక రాళ్లతో మూర్తీభవించిన శిల్పాలను చూసి మైమరచిపోతారు. దేవుళ్లు, అప్సరసలు, యుద్ధవీరులు, సంప్రదాయాలు ఇలా ఎన్నో విశేషాలు ఒకెత్తు..కామశాస్త్రాన్ని కళాత్మకంగా వర్ణించే శిల్పాలు మరో ఎత్తు అందుకే పర్యాటకులను రారమ్మంటుంది. అందుకే ఈ ఖజురహోని హార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ గా పిలుస్తారు.
Photo Courtesy : commons.wikimedia.org

చారిత్రక నగరి హనీమూన్ డెస్టినేషన్‌గా కూడా
ఖజురహోకు ఏడాదంతా పర్యాటకులు వస్తుంటారు. ఈ చారిత్రక నగరి హనీమూన్ డెస్టినేషన్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రేమికుల చిరునామాగా కూడా నిలిచింది. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే ఈ మహత్తర పర్యాటక కేంద్రం మహోన్నత సాంస్కృతిక కార్యక్రమానికి వేదికవుతుంది.
Photo Courtesy : commons.wikimedia.org

అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన
అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఈ వేడుకల్లో సంప్రదాయ నృత్య రీతులను ‘కదిలే శిల్పాలా!' అన్నట్టుగా ఆవిష్కరిస్తారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, కథాకళి ఇలా భారతీయ లాస్యాలన్నీ ఒక్కచోట చేరి మలిసంజెకు మంగళహారతులు పడతాయి. ఈ వేడుకలు కళ్లారా వీక్షించాలన్నా, మనసారా ఆస్వాదించాలన్నా..అదరహో ఖజురహో అనాల్సిందే!
Photo Courtesy : commons.wikimedia.org

11వ శతాబ్ధంలోని జీవనశైలిని వివరిస్తూ..
11వ శతాబ్ధంలోని జీవనశైలిని వివరిస్తూ.. ఈ ఆలయ శిల్పకళలు ఉంటాయి. ఖజుర్ (ఖర్జూరం)వేలడంతే ఉంటుంది. మెలికలు తిరిగిన రేఖలతో విచిత్రంగా తోస్తుంది. ఈ పండు పేరుతో వెలిసిన ఖజురహో కూడా అంతే ఇక్కడ అనేక హిందూ, జైన దేవాలయాలు ఉండటమే విశేషం. ఈ ఆలయాలను 20లలో కనుగొన్నారు.
Photo Courtesy : commons.wikimedia.org
Photo Courtesy : commons.wikimedia.org

భారతీయ శిల్పకళాకారుల గొప్పదనాన్ని ఈ ఆలయాలు కళ్లకుకడతాయి
మధ్యయుగ కాలంలో.. భారతీయ శిల్పకళాకారుల గొప్పదనాన్ని ఈ ఆలయాలు కళ్లకుకడతాయి. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఖజురహో విశిష్టతను వివరించాయి. ఫేమస్ హీరో చిరంజీవి సినిమాలో ఖజురహో ప్రేమ అనే పాట కూడా సూపర్ హిట్ కొట్టింది.
Photo Courtesy : commons.wikimedia.org

ఎలా వెళ్ళాలి:
ఖజురహో ఝాన్సీ నుంచి 175కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఝాన్సీకి రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గంలో ఖజురహో చేరుకోవచ్చు.
Photo Courtesy : Paul Mannix