» »ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ ... డాన్స్ ...డాన్స్ ...డాన్స్ !

ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ ... డాన్స్ ...డాన్స్ ...డాన్స్ !

Posted By:

ఇండియా లోని సాంప్రదాయ నృత్యాలన్నీ ఒక చోట చేరితే ఎలా వుంటుంది ? ఒక్కసారి ఊహించుకోండి ! నిజంగా అది ఒక అద్భుతమే !
పూర్వకాలంలో మహారాజులు తమ సభా ప్రాంగణంలో టెంపుల్ డాన్సర్స్ చే నృత్యాలు చేయించి వినోదాత్మకంగా ఆనందించేవారు. కళలను పోషించే వారు. ఈ కోవలోని చెందినదే ఇప్పటికీ ఖజురాహో లో జరుగుతున్న డాన్స్ ఫెస్టివల్. ఈ డాన్స్ ఫెస్టివల్ ఈ నెలలోనే 20 వ తేదీ నుండి 26 వ తేదీవరకు ఖజురాహో లో జరుగనుంది. వేయి సంవత్సరాల పురాతన ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో జరిగే డాన్స్ ఫెస్టివల్ లో అనేక సాంప్రదాయక నృత్యాలు జరుగుతాయి. ఒడిస్సీ, కథక్, భరతనాట్యం వంటి అనేక నృత్య రూపాలు ప్రదర్శించ బడతాయి. ఈ కార్యక్రమాలను మధ్య ప్రదేశ కళా పరిషద్ దేశ వ్యాప్త నృత్య కారులతో నిర్వహించనుంది.

ప్రదేశం ఎక్కడ ? మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో టెంపుల్ కాంప్లెక్స్ లోని చిత్రగుప్త టెంపుల్ మరియు విశ్వనాథ టెంపుల్. మరి ఈ ప్రోగ్రాం ఎలా వుంటుంది ? ఇక చూడండి ....!

దేవాలయ సముదాయం

దేవాలయ సముదాయం

డాన్స్ ఫెస్టివల్ నిర్వహణకు నృత్యం, సంగీతం, కామ కేళి చిత్రాలు కల ఖజురాహో టెంపుల్ సముదాయం కంటే మంచి ప్రదేశం ఏది వుండ గలదు ? చక్కటి వినోదాల మిశ్రమం కాగలదు ఈ డాన్స్ ఫెస్టివల్.
Pic credit: dalbera

దివ్యత్వ అందాలు

దివ్యత్వ అందాలు

ఖజురాహో టెంపుల్ సముదాయం చందేలా రాజులు సుమారు క్రీ. 950 నుండి క్రీ. శ.1050 సంవత్సరాల లో నిర్మించారు.
Pic credit: www.khajurahodancefestival.com

ఆధునిక నృత్య రూపాలు

ఆధునిక నృత్య రూపాలు

ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ లో సాంప్రదాయ మరియు ఆధునిక నృత్య రూపాలు ప్రదర్శించ బడతాయి. భారత దేశ గొప్ప సంస్కృతి, కళల వైభవం మరోసారి పునరుద్ధరించా బడుతోంది.

Pic credit: www.khajurahodancefestival.com

గత కాల సంస్కృతి, కళలు

గత కాల సంస్కృతి, కళలు

అద్భుతమైన ప్రదర్శనలు కల ఈ డాన్స్ ఫెస్టివల్ ఫిబ్రవరి 20 వ తేదీ మొదలై, 26 తేదీ నాడు ముగుస్తుంది. ఒడిస్సీ, కథక్, భారత న్బాత్యం , కూచిపూడి వంటి భారతీయ నృత్యాలు ప్రదర్శించ బడతాయి.
Pic credit: www.khajurahodancefestival.com

దేవాలయ సముదాయ వైభవం

దేవాలయ సముదాయ వైభవం

ఖజురాహో టెంపుల్ కాంప్లెక్స్ లో 85 దేవాలయాలు కలవు. వాటిలో నేటికి 22 దేవాలయాలు మంచి స్థితి లో ప్రదర్శనకు అనుకూలంగా కలవు.

Pic credit: www.khajurahodancefestival.com

భక్తి మరియు నృత్యం

భక్తి మరియు నృత్యం

ఖజురాహో టెంపుల్ లోని చేక్కడాలి కామ కేళి చిత్రాలు గా ఎందుకు చెక్కారు ? దీని వెనుక అనేక సిద్ధాంతాలు కలవు. ఒక సిద్ధాంతం మేరకు చందేలా రాజులు తంత్రాన్ని నమ్మేవారు. కామ పర కోరికలను త్రుప్తి పరిస్తే, స్వర్గం లభిస్తుందని భావించేవారు.

Pic credit: www.khajurahodancefestival.com

Please Wait while comments are loading...