Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. కిన్నౌర్

ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. కిన్నౌర్

ఎటుచూసినా కొండకోనల సోయగాలకు చిరునామా హిమాచల్ ప్రదేశ్లోని అద్భుతమైన అందాల కిన్నౌర్. చుట్టూ ఆకుపచ్చని లోయలు, అందమైన ద్రాక్షతోటలు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికే వన్నె తెస్తాయి. ఏటా వచ్చే ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతాయి. టిబెటన్ సంస్కృతి ప్రభావం ఇక్కడి ప్రజలపై ఎక్కువగా ఉండటం వల్ల రాష్ట్రంలోని మిగిలినవారి కంటే స్థానికుల సంస్కృతి భిన్నంగా ఉంటుంది. ట్రెక్కింగ్ ప్రియుల మనసుదోచే అనేక కొండకోనలు ఇక్కడ దర్శనమిస్తాయి. మరెందుకు ఆలస్యం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ కనువిందు చేసే కిన్నౌర్ ప్రకృతి అందాలు చూసొద్దాం.

https://www.google.co.in/search?q=kinnaur+kailash+native+planet&dcr=0&sxsrf=ALiCzsacg2bf_yxN-qO_r3XQmKW-0W50ag:1655467747205&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwjQlIn4ubT4AhWTTWwGHdwHDS8Q_AUoAnoECAEQBA&biw=1538&bih=664&dpr=1.25#imgrc=x4UrCRtiXCCqzM

కిన్నౌర్ ప్రాంత విస్తీర్ణం 6400 చదరపు కిలోమీటర్లు. ఇది ట్రెక్కింగ్ కు మంచి ప్రజాదరణ పొందిన సాహసోపేతమైన ప్రదేశంగా పేరుపొందింది. ఈ ప్రాంత జనాభా తక్కువగా ఉండడం వల్ల సవారీల అందుబాటులో కూడా తక్కువే. అందువల్ల పర్యాటకులు ట్రెక్కింగ్ వైపు మొగ్గు చూపక తప్పదు. సాంగ్లవ్యాలీ, బాబావాలీ, కిన్నౌర్ కైలాష్ పర్వతం ట్రెక్కింగ్ కు అనువైనవి. 6500 మీటర్ల ఎత్తు ఉండే కిన్నౌర్ కైలాష్ పర్వత ప్రాంతాన్ని హిందూ, బౌద్ధ మతస్థులు పవిత్రంగా పరిగణిస్తారు.టిబెటెన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నకిన్నౌర్ కైలాష పర్వతం హిందువుల పవిత్ర స్థలంగా పేరుపొందింది. ఇక్కడ అక్టోబర్ నుండి మే నెల వరకూ దీర్ఘకాలిక శీతాకాలం ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు మాత్రమే వేసవి ఉంటుంది. ఇలా వాతావరణంలో కనిపించే వైవిధ్యాలకు ఈ ప్రాంతం చిరునామాగా చెప్పుకోవచ్చు. శాలువాలు, టోపీలు, మంకీక్యాప్స్, నూలు - చేనేత వస్త్రాలు, నాణ్యమైన చెక్క బొమ్మలు, వెండి బంగారు ఆభరణాల తయారీలో ఈ ప్రాంతం పేరొందింది. ఆపిల్, బాదాం, చిల్గోజా, ఓగ్లా, ద్రాక్ష వంటి పండ్ల జాతులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి.

పర్వతారోహణకు చిరునామా

https://www.google.co.in/search?q=kinnaur+kailash+native+planet&dcr=0&sxsrf=ALiCzsacg2bf_yxN-qO_r3XQmKW-0W50ag:1655467747205&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwjQlIn4ubT4AhWTTWwGHdwHDS8Q_AUoAnoECAEQBA&biw=1538&bih=664&dpr=1.25#imgrc=x4UrCRtiXCCqzM

కిన్నౌర్ కి వచ్చేవారు ముందుగా చూడాల్సిన ప్రదేశం నాకో సరస్సు. ఇది సముద్ర మట్టానికి 3,662 మీటర్ల ఎత్తులో ఉంది. ఏడాదిలో ఎక్కువభాగం మంచుతో కప్పబడి ఉండడం ఈ సరస్సు ప్రత్యేకత. విల్లో, పోప్లర్ చెట్లు సరస్సు చుట్టూ అలంకరించినట్లుగా కనిపిస్తూ పర్యాటకుల్ని కనువిందు చేస్తాయి. ఇక్కడికి దగ్గరలో టాషిగాంగ్ అనే గ్రామం ఉంటుంది. దీనిచుట్టూ అనేక గుహల సముదాయాలు దర్శనమిస్తాయి. ఇక్కడ గుర్రాలు, యాక్స్ లాంటి జంతువులు కనిపిస్తాయి. అలాగే, సాంగ్ల వ్యాలీలో ఉన్న ఎత్తయిన చరంగ్ ఘటిపై పర్వతారోహణ చేసేప్పుడు ఇక్కడి ప్రకృతి సహజ అందాలను, అపురూపమైన దేవాలయ నిర్మాణాల్లో శిల్పకళను ఆస్వాదించవచ్చు. ఈ ప్రాంతం జులై నెల మధ్య వరకూ మంచుతో కప్పబడి ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఈ ప్రాంతాలు సందర్శనకు అనువుగా ఉంటాయి. చాన్గో దేవాలయం ప్రాంతంలో ఇక్కడ పూర్వపు మట్టి విగ్రహాలను చూడొచ్చు.ఈ ప్రాంతంలో పర్యాటకులకు కావలసిన వసతులు, ప్రార్ధనా మందిరం, లైబ్రరీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటి సందర్శనార్థం దేశవిదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడి యాపిల్ తోటలు సహజసిద్ధ ప్రకృతి అందాలకు ప్రతీకలుగా పర్యాటకుల మనస్సును దోచుకుంటాయి.

ఎలా చేరుకోవాలి

https://www.google.co.in/search?q=kinnaur+kailash+native+planet&dcr=0&sxsrf=ALiCzsacg2bf_yxN-qO_r3XQmKW-0W50ag:1655467747205&source=lnms&tbm=isch&sa=X&ved=2ahUKEwjQlIn4ubT4AhWTTWwGHdwHDS8Q_AUoAnoECAEQBA&biw=1538&bih=664&dpr=1.25#imgrc=x4UrCRtiXCCqzM

సిమ్లా రైల్వేస్టేషన్ కి 230 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్ ఉంది. అక్కడి నుండి టాక్సీలు, క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గంలో చేరుకోవడానికి సిమ్లా, రాంపూర్ నుండి బస్సు సదుపాయం ఉంది. ఇక్కడ అందరికీ అందుబాటుగా ఉండే ధరలలోనే ఉండటం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X