• Follow NativePlanet
Share
» »‘ఆ’ సుఖాలను పొందుతామని తెలిస్తే ఇక్కడ చనిపోవడానికి మీరు సిద్ధమవుతారు

‘ఆ’ సుఖాలను పొందుతామని తెలిస్తే ఇక్కడ చనిపోవడానికి మీరు సిద్ధమవుతారు

Written By: Kishore

ఇక్కడ అలా ఎందుకు జరుగుతోందో తెలియక వారు జుట్టు పీక్కొంటున్నారు

మీ చర్మం చూసి ఎవరైనా 'ఛీ'అంటుంటే ఇక్కడికి వెళ్లి వస్తే వారికి 'గుణపాఠం'చెప్పొచ్చు

ఈ దేవాలయకు వెళితే ప్రసాదంతో పాటు ఆ 'యాంగిల్స్'పై నాలెడ్జ్ కూడా ఫ్రీ

భారత దేశం పుణ్యభూమి అన్న విషయం తెలిసిందే. ఈ విశాల దేశంలో ఒక్కొక్క ప్రాంతానిది ఒక్కొక్క ప్రత్యేకత. ఈ కోవకు చెందినదే కురుక్షేత్రం. ద్వారప యుగంలో దాయాదులైన కురు, పాండవులకు యుద్ధం జరిగింది ఇక్కడే అన్న విషయం తెలిసిందే. అయితే ఇంత విశాల భారత దేశంలో మిగిలిన ప్రాంతాలన్నీ ఉండగా ఇక్కడే యుద్ధం జరపడానికి కారణం ఏమిటి అన్న సందేహం కలుగక మానదు. ఇందుకు సమాధానం ఈ కథనంలో కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా సాధారణంగా ఎక్కడైనా దానం చేస్తే కొంచెం పుణ్యం వస్తుంది. ఇక పుణ్యక్షేత్రాల్లో దానం చేస్తే ఆ పుణ్యం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు. అయితే కురుక్షేత్రంలో దానం చేయడం వల్ల మిగలిన క్షేత్రాల్లో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో దానికి కోటి రెట్లు ఎక్కువ వస్తుందని సాక్షాత్తు మహావిష్ణువు తెలిపాడు. ఇందుకు కారణం ఏమిటీ వంటి విషయాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.

1.యముడి కుమార్తె కొడుకు

1.యముడి కుమార్తె కొడుకు

Image Source:

పూర్వం సంవరణుడనే రాజు సూర్యుని కుమార్తె అయిన తపతిని పెళ్లి చేసుకొంటాడు. వీరికి కురువు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇతనికి 16 ఏళ్లు వచ్చేసరికి అపర మేథావిగా మారిపోతాడు.

2. 16 ఏళ్లకే పట్టాభిషేకం

2. 16 ఏళ్లకే పట్టాభిషేకం

Image Source:

ప్రపంచంలో ఇతనికి తెలియని విద్య ఏదీ లేదు. దీంతో సంవరణుడు పదహారేళ్ల కురువకు పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లి పోతాడు. మహా జ్జాని, అత్యంత బలవంతుడు అయిన కురువుకు అందరి వలే తాను రాజ్యాన్ని పాలించి చనిపోవాలని అనిపించదు.

3.బంగారు నాగలి

3.బంగారు నాగలి

Image Source:

తన పేరు, కీర్తి ఈ భూ మండలం పై శాశ్వతంగా ఉండాలని భావిస్తాడు. దీంతో తన తపోబలంతో బంగారు నాగలిని సృష్టించి శివుడి వాహనమైన నందిని ఒక వైపు, యముడి వాహనమైన మహిశము (దున్నపోతు)ను మరోవైపు కట్టి ప్రస్తుతం కురుక్షేత్రం ఉన్న చోట భూమిని దున్నుతాడు.

4. ఇంద్రుడు భయపడుతాడు

4. ఇంద్రుడు భయపడుతాడు

Image Source:

దీంతో త్వరలో ఈ కురువు దేవతలను మించి పోతాడని దీంతో తన పదవికి ముప్పు ఏర్పడుతుందని ఇంద్రుడు భావిస్తాడు. సమస్య పరిష్కారం కోసం ఉపాయంతో మహావిష్ణువును కురువు వద్దకు పంపిస్తాడు.

5. అష్టాంగ మార్గాలు

5. అష్టాంగ మార్గాలు

Image Source:

శాశ్వత కీర్తి కోసం మానవుడు సత్యము, తపము, క్షమ, దయ, పవిత్రత, దానము, యోగము, బ్రహ్మచర్యం అనే అష్టాంగమార్గాలను అవలంభించాలని విష్ణువు కురువుకు సూచిస్తాడు. వీటికి అనుమతి నేనే ఇవ్వాలి అని విష్ణువు చెబుతాడు.

6. కాళ్లు చేతులు ఇవ్వమని కోరుతాడు

6. కాళ్లు చేతులు ఇవ్వమని కోరుతాడు

Image Source:

దీంతో కురువు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా అష్టాంగ మార్గాన్ని అనుసరించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా విష్ణువును కోరుతాడు. ఇందుకు ప్రతిఫలంగా నీ కాళ్లు చేతులు ఇవ్వాలని విష్ణువు కోరుతాడు.

7. విష్ణువు ముచ్చట పడుతాడు

7. విష్ణువు ముచ్చట పడుతాడు

Image Source:

తన తల అయినా తీసుకోండి అయితే అష్టాంగమార్గాలను అనుసరించడానికి అనుమతి మాత్రం ఇవ్వాల్సిందిగా కురువు పట్టుపడుతాడు. 16 ఏళ్లు కూడా నిండని అతని పట్టుదలకు విష్ణువు ముచ్చట పడుతాడు.

8. ఉత్తరవేద కురుక్షేత్రమయ్యింది

8. ఉత్తరవేద కురుక్షేత్రమయ్యింది

Image Source:

అంత చిన్న వయస్సులోనే అపర శక్తిని పొందిన నీ కీర్తి శాశ్వతమవుతుందని వరమిస్తాడు. నీవు దున్నిన ఉత్తరవేద పేరుతో పిలువబడిన ఈ ప్రాంతం ఇక నీ పేరు పై కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని చెబుతాడు.

9నేరుగా స్వర్గలోకంలోకి

9నేరుగా స్వర్గలోకంలోకి

Image Source:

ఇక దేవేంద్రుడు కూడా నంది, మహిశితో ఈ ప్రాంతాన్ని నీవే స్వయంగా దున్నడం వల్ల ఈ క్షేత్రం పరమ పవిత్రమైదని ఇక్కడ ఎవరైన చనిపోతే వారి పాపపుణ్యాలతో సంబంధం లేకుండా నేరుగా స్వర్గంలోకి ప్రవేశం కల్పిస్తానని చెబుతాడు. అక్కడ అమర సుఖాలను పొందవచ్చునని పేర్కొంటాడు.

10. అందువల్లే ఇక్కడ యుద్ధం

10. అందువల్లే ఇక్కడ యుద్ధం

Image Source:

అందువల్లే కురు, పాండవ యుద్ధంలో ఎవరు మరణించినా వారికి స్వర్గలోక ప్రాప్తి కల్పించాలనే ఉద్దేశంతో ఇరు వర్గాల వారు బాగా అలోచించి ఈ కురుక్షేత్రంలో యుద్ధం చేశారని చెబుతాడు. అంతే కాకుండా ఈ కురుక్షేత్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.

11.మొదట లింగ రూపంలో

11.మొదట లింగ రూపంలో

Image Source:

కురుక్షేత్రంలో శ్రీ స్థానేశ్వర దేవాలయం ఉంది. పురాణాల ప్రకారం శివుడిని మొదట లింగ రూపంలో పూజించింది ఇక్కడే అని తెలుస్తుంది. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి.

12.బ్రహ్మసరోవరం

12.బ్రహ్మసరోవరం

Image Source:

స్థానేశ్వర దేవాలయానికి దగ్గర్లోనే బ్రహ్మసరోవరం ఉంది. ఇక్కడ గ్రహణాల రోజున స్నానం చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. దీనిలో ఒక్కసారి స్నానం చేస్తే అప్పటి వరకూ తాము చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం.

13. దుర్యోధనుడు జల స్తంభన చేసింది ఇక్కడే

13. దుర్యోధనుడు జల స్తంభన చేసింది ఇక్కడే

Image Source:

కురుక్షేత్ర యుద్ధం చివరి దశలో దుర్యోధనుడు జల స్తంభన ద్వారా నీట మునిగి కొన్ని గంటల పాటు గడిపినది బ్రహ్మసరోవరంలోనే అని స్థానికులు చెబుతారు.

14. గీతోపదేశం జరిగిన ప్రదేశం

14. గీతోపదేశం జరిగిన ప్రదేశం

Image Source:

కురుక్షేత్రం సమయంలో అర్జునుడు గీతోపదేశం చేసిన ప్రాంతం జ్యోతిసరోవర్ పక్కన ఉన్న మర్రిచెట్టు కిందే. ఈ ప్రాంతాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు.

15. కంచు విగ్రహం

15. కంచు విగ్రహం

Image Source:

ఈ ప్రాంతంలో శ్రీ కృష్ణుడు రథ సారథిగా ఉండగా, అర్జునుడు రథం కింద వినమ్రంగా ఉన్న విగ్రహాన్ని కంచుతో చేయించి ఇక్కడ ప్రతిష్టించారు. ఈ కురుక్షేత్రంలో అత్యంత ఆకర్షణీయమైన స్థలాల్లో ఇది ఒకటి.

16. కోటి రెట్లు పుణ్యం

16. కోటి రెట్లు పుణ్యం

Image Source:

అంతే కాకుండా ఈ క్షేత్రంలోని సరోవరంలో కాని బావిలోకాని స్నానం చేస్తే అనంత పుణ్యం లభిస్తుందని అంతే కాకుండా మిగిలిన పుణ్యక్షేత్రాల్లో దానం చేయడం వల్ల లభించిన పుణ్యానికి కోటి రెట్లు ఎక్కడ లభిస్తుందని చెబుతారు.

సృష్టి ఆరంభమైనది ఇక్కడే

సృష్టి ఆరంభమైనది ఇక్కడే

Image Source:

విష్ణువు నాభి నుంచి ఉదయించిన కమలం నుంచి బ్రహ్మదేవు జన్మించినట్లు ఉండే విగ్రహం ఇక్కడ నాభికమల్ మందిరంలో చూడవచ్చు. సృష్టిఆరంభమైనది ఇక్కడి నుంచే అని స్థానికులు చెబుతారు

18. శక్తి పీఠాల్లో ఒకటి

18. శక్తి పీఠాల్లో ఒకటి

Image Source:

దక్షయజ్జం తర్వాత ఆత్మహుతికి పాల్పడిన సతీదేవిని విష్ణువు సుదర్శన చక్రంతో 52 ఖండాలుగా చేసిన విషయం తెలిసిందే. ఆ శరీరంలో ఒక భాగమైన చీలమండలం పడిన ప్రాంతమే ఇక్కడ ఉన్న భద్రకాళీ మందిరం. ఇక్కడ అమ్మవారి పాదం మూల విరాట్టుగా ఉంటుంది.

19. బీష్మ కుండ్

19. బీష్మ కుండ్

Image Source:

అంపషయ్య మీద ఉన్న భీష్ముడి దాహాన్ని తీర్చడానికి అర్జుడు బానం ద్వార సృష్టించబడిన ప్రాంతమే భీష్మ కుండ్. ఇక్కడ తీర్థం నీటిని తాగితే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు.

20 ఎలా చేరుకోవాలి.

20 ఎలా చేరుకోవాలి.

Image Source:

ఛండీఘడ్, ఢిల్లీల నుంచి కురుక్షేత్రానికి నేరుగా బస్సలు ఉన్నాయి. ఇక ఆ రెండు నగరాల్లో విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీల ద్వారా మనం కురుక్షేత్రాన్ని చేరుకోవచ్చు.

21. వాతావరణం ఇక్కడ ఇలా

21. వాతావరణం ఇక్కడ ఇలా

Image Source:

ఇక్కడ వేసవిలో ఎండలు ఎక్కువ. అదే విధంగా చలి కాలంలో విపరీతమైన చలి ఉంటుంది. అందువల్ల అందువల్ల జులై నుంచి ఆగస్టు మధ్య వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి